పూజ గదిలో దేవి-దేవతలను ఎలా అమర్చుకోవాలో మీకు తెలుసా?

 

 

పూజ గదిలో దేవి-దేవతలను


ఎలా అమర్చుకోవాలో మీకు తెలుసా?

 

 

 

 

పూజ గదిని సాధ్యమైనంత వరకూ ఈశాన్య లేదా తూర్పు లేదా ఉత్తర దిక్కున ఏర్పా టు చేయాలి. దీనికి కారణం తెల్లవారు ఝామునే సూర్యుడు ఇంటికి ఈశాన్య దిక్కున ఉంటాడు. హిందువుల ఎవరి ఇంట్లోనైనా దేవీ-దేవతల ఫోటోలు వుంటాయి. కొందరి ఇళ్ళల్లో ప్రత్యేకంగా పూజాగది ఉంటుంది. మరికొందరి ఇంట్లో గోడలకు మాత్రమే దేవీ-దేవతల ఫోటోలు వ్రేలాడుతూ కనబడతాయి. అసలు ఈ దేవీ-దేవతల విగ్రహాలను కానీ, ఫోటోలు కానీ ఎలా వరుసక్రమంలో పెట్టుకోవాలో చూద్దాం.

 

 

 

 

గణపతి దేవుని విగ్రహము లేదా చిత్రము మధ్యలో అమర్చుకోవాలి. పురుష దేవతలు గణపతికి విగ్రహానికి కానీ ఫోటోకి కాని కుడి వైపున (ఉదా: హనుమంతుడు, శ్రీ కృష్ణుడు). స్త్రీ దేవతలు(ఉదా : అన్నపూర్ణ దేవి) గణపతికి ఎడమ వైపున వచ్చే విధంగా అమర్చుకోవాలి. కొన్ని ఫోటోలలో దేవీదేవతల కలిసిన ఫోటోలు (ఉదా : సీతారాముడు, లక్ష్మి నారాయణుడు)వుంటాయి. అలాంటి ఫోటోలను గణపతి దేవునికి కుడి వైపు వచ్చే విధంగా అమర్చుకోవాలి. ఎవ్వరికైనా ఆధ్యాత్మిక గురువు ఉండి, కేవలము ఒక్కరే నివశిస్తుంటే  అతను కేవలం గురువుల ఫోటోను మాత్రమే అమర్చుకోవాలి. ఒక్కవేళ కుటుంబ సభ్యులు వుంటే గురువుల ఫోటోను గణపతి దేవునికి కుడి వైపున వచ్చే విధంగా అమర్చుకోవాలి.