Read more!

Divine Omkaram

 

మహా మహిమాన్విత మంత్రం 

ఓంకారం

Divine Omkaram

''ఓం'' అంటూ ఉచ్చరించే ఓంకారం పరమ పవిత్రమైంది. ఓంకారం సంస్కృతంలో ''ॐ'' అక్షరం దైవంతో సమానం. ప్రణవ స్వరూపం. ఓంకారం శివరూప తత్వం. మహాశివుడు డమరుకం మోగిస్తున్నప్పుడు ఆ ధ్వనిలోంచి అక్షరాలు వచ్చాయట. ఆ సంగతి అలా ఉండగా ఓంకార మహత్తును వేద పండితులు ఎంతగానో వర్ణించారు. ఓంకారం దైవస్వరూపం. ఓంకారాన్ని మించిన మంత్రం లేదంటారు. ''ఓం'' అనే మంత్రాక్షరాన్ని జపిస్తే చాలు ఎంతో ప్రయోజనం ఉంటుంది, ఎన్నో సమస్యలు సమసిపోతాయి. అందుకే ఆలయాల్లో, ధ్యాన మందిరాల్లో మంద్రస్థాయిలో ఓంకారం ధ్వనిస్తూంటుంది. దివ్యత్వానికి ప్రతీక ఓంకారం.

 

మహా మహిమాన్వితమైన ఓంకారానికి అనేక అర్ధాలు ఉన్నాయంటూ నిర్వచించారు. ప్రధానంగా 18 అర్ధాలను సూచించారు. ఆ అర్ధాలు ఏమిటో స్థూలంగా చెప్పుకుందాం.

ఓంకారం తేజోవంతమైంది. సర్వ లోకానికీ వెలుగునిస్తుంది.

ప్రేమైక తత్వాన్ని ఇస్తుంది.

ఓంకారం ప్రశాంతతని, ఆనందాన్ని, సంతృప్తిని ప్రసాదిస్తుంది.

గ్రహణశక్తిని పెంచి, అనేక అంశాలను అవగాహన చేసుకునే అవకాశం కలిగిస్తుంది.

ఓంకారం నిత్యజీవితంలో కలిగే కష్టనష్టాల నుండి రక్షిస్తుంది.

సృష్టిలో సూక్ష్మ ప్రాకృతిక అంశాలను స్థూల మార్గంలోకి తెస్తుంది.

ఓంకారం సూక్ష్మ రూపంలో ప్రాణకోటిలో ప్రవేశిస్తుంది.

ప్రళయకాలంలో జగత్తును తనలో లీనం చేసుకుంటుంది.

ఓంకారం స్థూల, సూక్ష్మ, గుప్త, శబ్దనిశ్శబ్దాలను గ్రహిస్తుంది.

ప్రబోధాత్మకమైన బుద్ధిని ప్రసాదిస్తుంది.

ఓంకారం చరాచర జగత్తును శాసిస్తుంది.

అజ్ఞానాన్ని, అంధకారాన్ని నశింపచేస్తుంది.

ఓంకారం విద్యను, వివేకాన్ని, జ్ఞానాన్ని, తేజస్సునూ ఇస్తుంది.

సర్వ ఐశ్వర్యాలనూ కల్పిస్తుంది.

ఓంకారం శుద్ధ అంతఃకరణను ప్రసాదిస్తుంది.

ఓంకారం సర్వ వ్యాపకం.

ఓంకారం సమస్త జగత్తుకూ నాయకత్వం వహిస్తుంది.

కోరికలకు దూరంగా ఉంటూ, అందరి శ్రేయస్సూ కోరుకోవాలని ఉపదేశిస్తుంది.

hindu divine mantra Om, hindu powerful precious mantram Omkar, Omkaram is god, Omkar and Mahashiva, Omkar Maha Mantra meaning, Omkar Pranavam and 18 meanings, Omkar or Om (ॐ), Omkar Sacred Vowel and meaning