పచ్చ తోరణం ప్రయోజనం Purpose of Hanging mango leaves

 

పచ్చ తోరణం ప్రయోజనం

Purpose of Hanging mango leaves

 

ఇంట్లో పెళ్ళిళ్ళు, వ్రతాలు లాంటి ఏ శుభకార్యం జరిగినా గుమ్మానికి మావిడాకులతో పచ్చ తోరణం కడతాం. దేవాలయాల్లో పండుగలు, ఇతర విశేష దినాల్లో పచ్చ తోరణం కడతారు. తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలో స్వామివారికి నిత్యం కల్యాణం జరిపించి, పచ్చ తోరణం కడతారు కనుక ''నిత్య కల్యాణం పచ్చ తోరణం'' అంటారు.

 

ఇంతకీ మావిడాకులతో పచ్చ తోరణం కట్టడంవల్ల ఉపయోగం ఏమిటి? అసలు ఎందుకు కడతారు? ఆ వివరాలు తెలుసుకుందాం.

 

పచ్చని మావిడాకులు మహా సొగసుగా ఉంటాయి. వాటిని తోరణాలుగా వాకిట్లో కట్టడంవల్ల ఇంటికి శోభ వస్తుంది. చూడసొంపుగా, కళాత్మకంగా ఉన్నవి ఏవైనా మానసును ఉల్లాసపరుస్తాయి.

 

ద్వారాలకు మావిడాకుల తోరణాలు కట్టి, అవి ఎండిపోయినా సరే అలా వదిలేస్తారు. మరో పండుగ లేదా విశేష దినం వచ్చినప్పుడు పాట తోరణాలు తొలగించి, .తాజా మావిడాకులతో మళ్ళీ తోరణాలు కడతారు. ఆకులు వాతావరణంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ ను పీల్చుకుని, ఆక్సీజన్ను వదుల్తాయి. ఈ సుగుణం మావిడి, మారేడు, వేప ఆకుల్లో మరింత అధికంగా ఉంది. ఈ కారణంగానే పోలేరమ్మ మొదలైన గ్రామదేవతల ఆలయాల్లో వేప మండలు కడతారు. శివార్చనలో మారేడు దళాలను విస్తారంగా ఉపయోగిస్తారు. అయితే ఈ మూడు రకాల పత్రాల్లో మావిడాకులు ఎక్కువ రోజులు తాజాగా ఉండటంవల్ల, చూట్టానికి మరింత అందంగా ఉండటం వల్ల మావిడాకులతోనే తోరణాలు కడతారు. ఇవి వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తుంది. ఆ ప్రదేశంలో స్వచ్చత నెలకొంటుంది.

 

మావిడాకులు బొగ్గుపులుసు వాయువును పూర్తిగా పీల్చుకుని ప్రాణ వాయువును వదలడమే కాకుండా ఔషధ గుణాలను కూడా కలిగివున్నాయి. కొన్నిసార్లు ప్రమాదవశాత్తూ తగిలిన దెబ్బలకు రక్తం ఆగకుండా ధార కడుతుంది. అలాంటప్పుడు ఎండిన మావిడాకులను కాల్చి, భస్మం చేసి, ఆ పొడిని గనుక రాస్తే రక్తం కారదు. అంతేకాదు, ఈ చూర్ణాన్ని గాయాలపై వేసి కట్టు కడితే వెంటనే తగ్గిపోతాయి. మావిడాకులు ఇంత గొప్పవి కనుకనే వీటిని గుమ్మానికి కట్టుకునే ఆచారం పుట్టుకొచ్చింది.

 

కలర్ థెరపీ లేదా రంగుల చికిత్సను అనుసరించి మావిడాకుల్లో ఉండే ఆకుపచ్చ రంగు హాయిని, ఆనందాన్ని ఇస్తుంది. కంటికి మేలు చేస్తుంది.రోజంతా అలసిపోయే కళ్ళు మావిడాకుల తోరణాన్ని చూసినప్పుడు సేద తీరతాయి. కంటికి విశ్రాంతి లభించినట్లవుతుంది.


Hanging fresh mango leaves, Hindu tradition Paccha toranam, hindu festivals and paccha toranam, paccha toranam in front of house