Read more!

మాటే అలంకారము

 

 

 

మాటే అలంకారము

 

 

కేయూరాణి న భూషయంతి పురుషం హారా న చంద్రోజ్వ్జలా

న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః ।

వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే

క్షీయంతే-ఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్‌ ॥

 

మగవానికి కేయూరాలు (భుజకీర్తులు) కానీ, చంద్రుడిలా మెరిసిపోయే హారాలు కానీ, చందనాది లేపనాలతో కూడిన స్నానాలు కానీ, శిరోజాలంకారములు కానీ నిజమైన శోభని ఇవ్వవు. పైగా ఇవన్నీ కూడా నశించిపోయే లక్షణం కలిగి ఉంటాయి. కానీ అతని నుంచి వెలువడే మంచి మాట మాత్రం ఎప్పటికీ నశించిపోకుండా నిజమైన శోభని అందిస్తుంది.

 

...Nirjara