Read more!

తండ్రి అథముడైనప్పటికీ...

 

 

 

తండ్రి అథముడైనప్పటికీ...

 

 

పట్టుచుఁదండ్రి యత్యథమువర్తనుఁడైననుగాని వానికిం

బుట్టిన పుత్రకుండ తన పుణ్యవశంబున దొడ్డ ధన్యుఁడౌ

నెట్టన మఱ్ఱివిత్తు మునుపెంతయు గొంచెము దానబుట్టునా

చెట్టు మహోన్నతత్వమును జెందదే శాఖలనిండి భాస్కరా!

 

మర్రి చెట్టు విత్తనం చూసేందుకు చాలా చిన్నగా, పనికిరానిదిగా ఉంటుంది. కానీ దాని నుంచి శాఖోపశాఖలుగా ఎదిగే ఓ మహావృక్షం ఉద్భవిస్తుంది. అలాగే తండ్రి అథముడైనంత మాత్రాన అతనికి పుట్టిన పిల్లవాడు గొప్పవాడుగా మారకూడదన్న నియమం ఏదీ లేదు కదా!

 

..Nirjara