Read more!

మంచివారి మాట

 

 

 

మంచివారి మాట

 

 

సాధుజనుల మానసము నారికేళంబు

పైన మిగులగట్టి, లోన మృదువు

బాలిశుల మనమ్ము బదరీఫలమ్మురా

లలితసుగుణజాల! తెలుగుబాల!!

 

సత్పురుషుల మనసు కొబ్బరికాయలాగా ఉంటుందట. పైకి చూసేందుకు కఠినంగా తోచినా, మనసు లోతున మృదువుగా ఉంటుందట. కానీ మూర్ఖుల మనసు అలా కాదు. అది బదరీఫలంలాంటిదంటున్నాడు శతకకారుడు. బదరీఫలం అంటే రేగుపండన్నమాట. ఈ రేగుపండు చూడటానికి తళతళా మెరిసిపోతూ ఉంటుంది. కానీ లోపల పెద్దగా సరుకు ఉండదు. ఉన్నా అది రుచికరంగా ఉండదు.

 

..Nirjara