Read more!

సత్పురుషుల నడవడి ఇదే!

 

 

 

సత్పురుషుల నడవడి ఇదే!

 

 

తృష్ణాం ఛింధి భజ క్షమాం జహి మదం పాపే రతిం మా కృథాః

సత్యం బ్రూహ్యనుయాహి సాధుపదవీం సేవస్వ విద్వజ్జనమ్‌ ।

మాన్యాన్మానయ విద్విషో-ప్యనునయ ప్రఖ్యాపయ ప్రశ్రయం

కీర్తిం పాలయ దుఃఖితే కురు దయా మేతత్సతాం చేష్టితమ్‌॥

 

తృష్ణను (కోరిక) వీడు; క్షమ (ఓర్పు) వహించు; గర్వాన్ని వదులు; పాపకార్యాల పట్ల ఆసక్తి చెందకు; సత్యమే పలుకు; సజ్జనులను అనుసరించు; విద్వజ్జనులను సేవించు; పూజ్యులను కొలుచుకో; శత్రువులనైనా ఆదరించు; కీర్తిని రక్షించుకో; దుఃఖితుల పట్ల కరుణను చూపు... ఎందుకంటే, సత్పురుషుల నడవడి ఈ తీరుగానే ఉంటుంది!

 

Nirjara