Read more!

ఘోరమైన విషం అదే!

 

 

 

ఘోరమైన విషం అదే!

 

 

విశ్వమందు గలుగు విషరాజములయందు

అతిభయంకరంబు హాలహలము

ఘోరమంతకంటె క్రూరుని చిత్తమ్ము

లలితసుగుణజాల! తెలుగుబాల!!

 

ఈ ప్రపంచంలో ఉన్న విషాలన్నింటిలోకీ సముద్రమధనం నుంచి వెలువడిన హాలాహలం అతి భయంకరమైనది. కానీ అంతకంటే ఘోరమైన విషం మరొకటి ఉందంటున్నారు శతకకారుడు. అది క్రూరుని మనసట! కాబట్టి అలాంటివారికి కాస్త దూరంగా ఉండమన్నది కవిగారి హెచ్చరికగా భావించవచ్చు.

 

..Nirjara