కూర లేని ఉప్పులాగే!

 

 

 

కూర లేని ఉప్పులాగే!

 

 

చదు వది యెంత కల్గిన రసజ్ఞత యించుక చాలకున్న యా

చదువు నిరర్థకంబు గుణసంయుతు లెవ్వరు మెచ్చ రెచ్చటం

బదనుగ మంచికూర నలపాకము చేసిన నైన నందు నిం

పొదవెడు నుప్పులేక రుచి పుట్టఁగ నేర్చునటయ్య! భాస్కరా!

 

చదువు ఎంతైనా ఉండవచ్చు. పక్కన ఎన్ని డిగ్రీలైనా ఉండవచ్చు. ఎంతటి హోదో కలిగిన ఉద్యోగమైనా చేయవచ్చు. కానీ మంచి విషయాలను అభినందించగల రసజ్ఞత లేకపోతే ఏంటి ఉపయోగం? అలాంటి చదువు నిరర్థకం అంటాడు శతకకారుడు. పైగా అట్టివారిని గుణవంతులు ఎవ్వరూ మెచ్చుకోరు కూడానట! అది ఎలాగంటే నలభీమ పాకానికి దీటైన వంటని వండినా కూడా... అందులో ఉప్పు లేకపోతే రుచిగా ఉండదు కదా!

 

..Nirjara