Read more!

ఏమీ తెలియదుగా

 

 

ఏమీ తెలియదుగా

వచ్చింది తెలియదు పోయేది తెలియదు

మధ్యలో మనబ్రతుకు ఏమౌనో తెలియదు

ఏమి తెలియని జన్మ కెందుకుర గర్వంబు

అందరిని కాపాడు ఆది పురుషుని నమ్ము!మనిషి అన్నీ తనకే తెలుసని భ్రమిస్తుంటాడు. నిజానికి అతని జీవితంలో అసంకల్పితంగా జరిగే ఘటనలకే ప్రాధాన్యత ఎక్కువ. తన జన్మరహస్యం అతనికి తెలియదు. ఏదో పుట్టాడంటే పుట్టాడు. అంతే! పోనీ ఎప్పుడు చనిపోతాడో... ఆ విషయమన్నా తెలుసునా అంటే, అదీ లేదు. పుటుకా, చావుల సంగతి పక్కన పెడితే... ఈ నడుమ సాగే జీవితంలో తన బతుకు ఏమవుతుందో కూడా అతనికి తెలియదు. అలాంటి ఏమీ తెలియని జన్మని చూసుకుని గర్వపడేకంటే... సర్వసాక్షి అయిన భగవంతుని నమ్ముకోమంటున్నారు వీరబ్రహ్మంగారు.