ఈ మంత్రం చదివితే అనుమానాలు తీరిపోతాయి..
ఈ మంత్రం చదివితే అనుమానాలు తీరిపోతాయి..
అనుమానం మనిషి స్వభావం. ఓ కొత్త పని చేయాలన్నా, ఓ కొత్త మనిషిని కలవాలన్నా ఎంతో కొంత అనుమానం కలగక మానదు. కానీ అనుమానం హద్దులు దాటితే మాత్రం చాలా కష్టం. ఇలాంటి వాళ్లు తమ నీడని కూడా అనుమానిస్తారు. ఇంట్లో మనుషులన్నా అనుమానమే, ఓ అడుగు ముందుకు వేయాలన్నా అనుమానమే! ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ల జీవితాన్ని అనుమానమే శాసిస్తుంటుంది. ఒకోసారి అది లేనిపోని గొడవలకి, ఇంకా మాట్లాడితే హత్యలకీ దారితీస్తుంది.
జాతకం ప్రకారం చంద్రుడు, బుధుడు, శుక్రుడు సరైన స్థితిలో లేని వ్యక్తులకు నిరంతరం అనుమానాలు కలుగుతూ ఉంటాయి. వీటికి తోడు రాహువు లేదా శని కూడా సరిగా లేకుంటా ఆ అనుమానాలు కాస్తా నేరాలకి దారితీస్తుంటాయి. ఒక మనిషి వేళ్లని చూసి కూడా అతనిలో సంశయ స్వభావాన్ని గుర్తించవచ్చు. హస్తసాముద్రికం ప్రకారం పొడవాటి, సన్నటి వేళ్లుండేవాళ్లలో అనుమానం చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్లలో బొటనవేలు సరిగా లేకపోతే, ఆ అనుమానాలు కాస్తా నేరాలకు దారితీస్తాయి.
అనుమానపు స్వభావం ఎక్కువగా ఉన్నవారు పొరపాటున కూడా పగడం లేదా కెంపులని ధరించకూడదని చెబుతున్నారు. వీళ్లు ఎర్రటి రంగు బట్టలు కూడా వేసుకోకూడదు. అంతేకాదు! అనుమానం విచక్షణను అడ్డగిస్తూ ఉంటుంది. రోజూ ఉదయం 108 సార్లు గాయత్రిమంత్రాన్ని జపిస్తే, మన ఆలోచనల్లో ఎలాంటి లోపం ఉండదు. పౌర్ణమి రోజున ఉపవాసం ఉండి, తెల్లటి పూలు వేసిన నీటిని చంద్రునికి సమర్పించినా అనుమానపు స్వభావం తగ్గిపోతుందని చెబుతున్నారు.
- నిర్జర.