గంగా సాగర్ (వెస్ట్ బెంగాల్)

 

 

గంగా సాగర్ (వెస్ట్ బెంగాల్)

 

 

సాగరునితో కలిసే గంగ. బంగాళా ఖాతంలో  పవిత్ర  గంగా నది  కలిసే  సంగమ ప్రదేశం. ఇక్కడ ప్రతి సంవత్సరం జనవరిలో మకర సంక్రాంతినాడు జరిగే మేళా విశిష్టతని సంతరించుకుంటుంది లక్షలాది మంది సముద్ర స్నావానికై తీరం చేరుకునే సమయం.  

 


గంగా సాగర్  మేళా, గంగా సాగర్ యాత్ర, గంగా సాగర్ స్నాన్ ఇలా ఎన్నో పేర్లు వున్న గంగ సాగరునితో కలిసే చోటు  ఇది. ప్రత్యేకించి మకర సంక్రాంతి రోజున అందరు చేసే పుణ్య స్నానం. సూర్యుడు ధనుష్ రాశి  నుంచి మకర రాశిలో ప్రవేసించే రోజు కనుక సూర్యారాధన చేస్తారు.

 


పవిత్రమైన ఈ యాత్ర విశేషాలు ......

ప్రాశస్త్యం:

మహాభారత కాలం నుంచి కూడా ఈ సాగరసంగమంని  గురించిన ప్రస్తావన వుంది. భీష్మాచార్యుల వారికి ఈ పవిత్ర గంగా సాగర సంగమంలో పవిత్ర స్నానం గురించి వివరింనట్లుగా వుంది మహా భారతంలో. అప్పటి నుంచి కూడా ఈ స్టలానికి  అత్యంత  ప్రాముఖ్యం వుంది. ఇక్కడ గంగలో మునిగితే కల్మషాలు, మాలిన్యాలు తొలగి మనసు పవిత్రమవుతుందని నమ్ముతారు; మకర సంక్రాంతి రోజు లక్షలాది మంది దేశం నలుమూలల నుంచి ఇక్కడికి వస్తారు. ఆ రోజు స్నానం చేస్తే ముక్తి లభిస్తుందని కూడా నమ్ముతారు.గంగా సాగర్ అతి పెద్ద రెండవ కుంభ మేళ గా ప్రపంచమంతాఎంతో ప్రసిద్ది  చెందింది. ఇక్కడే  సగరుని కుమారులు 60,000 మంది కపిల మహర్షి శాపం వల్ల మరణించినపుడు, పవిత్ర  గంగానది వారి  మీదుగా  ప్రవహించి  వారికి మోక్షం కలిగిస్తుంది.  అందుకే  ఇక్కడ  మోక్ష  ప్రాప్తి కోసం ఇక్కడ  పుణ్య  స్నానాలు  ఆచరిస్తారు .  
పవిత్ర గంగా నది సముద్రంలో కలిసే చోటు. సముద్రంలో ఒక చిన్న ద్వీపంలో కలుస్తుంది గంగ.

 

 

కలకత్తాకి 150 కి.మీ దూరంలో వుంది గంగ సాగర్. ఇది ఒక చిన్న లంక లో వుంది.    కలకత్తాలో బయలు దేరి  డయమండ్ హార్బర్ (diamond Harbour)   మీదుగా కాకద్వీప్  (లాట్ నం 8) వెహికల్ లో చేరుకోవాలి.    ఈ ద్వీపం చేరుకోటానికి ఫెర్రీలు వున్నాయి.   అరగంట ప్రయాణం తరువాత ద్వీపానికి చేరుకుంటాం.   మరొక ప్రైవేటు వాహనంలో సముద్ర తీరానికి చేరుకున్నాం. కాని వాహనాలు సముద్ర తీరం వరకు చేరుకోవు.  నడిచి తీరం చేరుకోవచ్చు. కాని నడవలేని వారికి రిక్షాలు వుంటాయి. అక్కడి  రిక్షాల గురించి చెప్పాల్సిందే. ఫ్లాట్ గా  వుంటాయి. (ఇక్కడ vegitables  అమ్మే బల్ల లాగ వుంటాయి.)  తీరం చేరుకోటానికి రిక్షాలో సాగరా తీరం చేరుకున్నాం. అదొక అనుభవం.

 


పవిత్ర గంగా సాగర సంగమం లో స్నానాలు ముగించుకుని దగ్గరలోనే వున్న  కపిల ముని  ఆలయం దర్శించుకున్నాము. అక్కడ ఆలయంలో కపిలముని, అంజనేయుడు, గంగాదేవి విగ్రహాలు వున్నాయి. కపిల ముని అక్కడ తపస్సు చేసిన చోటు అని, గంగను భువికి రప్పించి తన పూర్వికులకు  విముక్తి కలిగించిన  భాగిరధుడు, అశ్వమేధ యాగం లో కపిలముని ఆశ్రమం చేరిన గుర్రం విగ్రహాలు ఈ ఆలయంలో కనిపిస్తాయి. అందరు ఒకే చోట కొలువై వున్న  ప్రదేశం అది. అక్కడ పూజాదికాలు ముగించుకున్నాము. ప్రస్తుతం వున్న కపిల ముని ఆలయం నాలుగోసారి నిర్మించింది.

 

 

సాధువులు ఎక్కువగా వుండే ప్రదేశం ఇది.  అడవుల్లో తపస్సు చేసుకుంటూ వుంటారు  అఖీరా బాబాలు (నాగ) సాధారణంగా కాషాయ రంగు  వస్త్రాలు,  చేతిలో ఆరెంజ్ కలర్ జెండా  ధరించి  గుంపులుగా వస్తుంటారు. మరి కొందరు సన్యాసులై   శివుని విభూతి మాత్రమే వంటికి పులుముకుని, నిర్వికారులై, మోక్ష ప్రాప్తికై ఎదురు చూస్తుంటారు. వీరితో పాటు  వేలాదిమంది సాధువులు, భక్త జన సందోహం ఇక్కడికి పవిత్ర స్నానానికై మకర సంక్రాంతి రోజు వస్తారు. 

 

 

తుఫాన్ లో తొలి ఆలయం కలిసిపోగా తరువాత కట్టిన ఆలయాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. ప్రస్తుతం వున్న ఆలయం 1961లో అప్పటి బెంగాల్ ముఖ్య మంత్రి బి.సి. రాయ్ చేతుల మీదుగా ప్రారంభించారు. కానీ ఆలయ నిర్మాణం 1973లో పూర్తి అయింది.  

 

...mani