Read more!

గణేశారాధన ఫలితాలు

 

రహచార రీత్యా మనం చేసిన దోషాలు తొలగించుకోవడానికి గణేశారాధన మంచిది. సూర్యదోష నివారణకు ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించాలి. చంద్ర దోష నివారణకు వెండి లేక పాలరాయితో చేసిన వినాయకుడిని పూజించాలి. కుజదోష నివారణకు రాగితో చేసిన వినాయకుడిని పూజిస్తే ఫలితం ఉంటుంది.

బుధ దోష నివారణకు మరకత గణపతిని అర్చించాలి. గురు దోష నివారణకు పసుపు, చందనం లేక బంగారంతో చేసిన గణపతిని కొలవాలి. శుక్ర దోష నివారణకు స్ఫటిక గణపతిని, శని దోష నివారణకు నల్లరాయిపై చెక్కిన గణపతిని పూజించాలి. రాహు గ్రహ దోషానికి మట్టితో చేసిన గణపతిని పుజిస్తే ఫలితం ఉంటుంది. కేతు గ్రహ దోష నివారణకు తెల్ల జిల్లేడుతో చేసిన గణపతిని పూజించాలి. ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించడం వల్ల అనారోగ్య సమస్యలు, పగడపు గణపతిని పూజించడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి. పాలరాయితో చేసిన గణపతిఅని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. మనకు ఎదురవుతున్న సమస్యలు తొలగిపోవాలంటే శ్వేతార్క గణపతిని పూజించాలి. స్ఫటిక గణపతి సుఖశాంతులు ప్రసాదిస్తాడు.