శ్రీ గణపతి సుప్రభాతం (Ganapati Suprabhatam)
శ్రీ గణపతి సుప్రభాతం (Ganapati Suprabhatam)
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్
ప్రసన్న వదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే.
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేక దంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే
శ్రీకరా! శుభకర! దేవ! శ్రీ గణేశ! అభయమిడి మమ్ము రక్షించి శుభము గూర్ప
మేలుకో గౌరీ వరపుత్ర! మేలుకో సుప్రభాతము నీకిదే శుభ గణేశ!
సర్వసిద్ధి ప్రదాయకా! సర్వనేత్రా! సర్వలోకాధినాయకా! సకల పూజ్యా!
ఆలసింపక మేలుకో అమలరూప సుప్రభాతము నీకిదే శుభ గణేశా!
తూర్పుదిశలోన భానుడు తొంగిచూడు దిక్కులన్నియు నీ ఖ్యాతి తెలుపుచుండె
మేలుకొను విఘ్నరాజ మమ్మేలుకొనగ సుప్రభాతము నీకేదే శుభగణేశ!
లేచి నిన్ను జాడ కనులారా వేచినాము కరుణ కురిపించి మమ్మింక కానవయ్య
జాగుసేయక లేవయ్య జగములేల సుప్రభాతము నీకిదే శుభ గణేశ!
కన్నులార నిన్ను చూసి తనివిదీర భక్తవర్యులు వచ్చిరి ప్రణతులిడగ
ఆలసింపక నిదురలే ఆర్తరక్ష సుప్రభాతము నీకిదే శుభ గణేశ!
సకల కార్యాలు సలిపెడి సాధుజునులు యజ్ఞయాగా లొనర్చెడి విజ్ఞవరులు
మొదట నీ పూజ సలుపక ముందుచనరు సుప్రభాతము నీకిదే శుభ గణేశ!
ఏకదంత గజాననా! లోకనాదా! షణ్ముఖాగ్రజా! పార్వతీ సాధుపుత్ర!
సర్వకార్య ఫలప్రద! సంకటహర! సుప్రభాతము నీకిదే శుభ గణేశ!
లోకములనెల్ల నడిపెడి లోకరక్ష! మాకు తల్లివి తండ్రివి మార్గమీవె
మమ్ము బ్రోచుట భారమూ మమత జూపి సుప్రభాతము నీకిదే శుభ గణేశ!
ఈతి బాధలు బాపుమా ఈశ పుత్ర! ధ్యైర్యమిచ్చి గుణమిచ్చి సంసార తపన నణచి
నీదు భక్తుం దరిజేర్చి నీవె దిక్కు సుప్రభాతము నీకిదే శుభ గణేశ!
బొజ్జతో గుజ్జూరూపున గజ్జె కట్టి భరత నాట్యాల నర్తించి పరవశించి
పార్వతీకుల మెప్పించు భాగ్యశాలి! సుప్రభాతము నీకిదే శుభ గణేశ!
అరిభయంకర! దైత్యసంహార! వీర! నీదు చరణాజ్జముల చెంత నీడనిమ్ము
శంకర కుమార! దేవర శౌర్యమూర్తి! సుప్రభాతము నీకిదే శుభ గణేశ!
సిద్ధి చిరునవ్వు వెన్నెల సిరులు గూర్ప బుద్ధి మనసార భక్తితో పూజ సలుప
సిద్ధి బుద్ధి ప్రదానంద శుద్ధరూప! సుప్రభాతము నీకిదే శుభ గణేశ!
సకల కళలందు నిన్ను గొల్చి సర్వజనులు భుక్తి శక్తిని ముక్తిని పొందుచుంద్రు
విమల విద్యా విశారద వినుత చరిత సుప్రభాతము నీకిదే శుభ గణేశ!
నిత్య మంగళ సుచరిత్ర! నిర్మలాంగ దేవ దానవ మానవ దీనబందు!
వరద మూషిక వాహన! వక్రతుండ! సుప్రభాతము నీకిదే శుభ గణేశ!
పార్వతీ పుత్ర! గణపతీ! పాపనాశ! ఘోరసంసార బాధలు గోడు బావ
మేలుకోవయ్య జగతికి మేలుగూర్ప సుప్రభాతము నీకిదే శుభ గణేశ!
ఇష్టకామ్య ఫలప్రద! ఇభకరాస్య! ఆయురారోగ్య భాగ్యములందజేసి
మమ్ము దరిచేర్ప మేలుకో మహిత తేజ సుప్రభాతము నీకిదే శుభ గణేశ!
అమ్మ జేసిన బొమ్మగా అవతరించి బ్రహ్మ సృష్టికి మారుగా బ్రతికినావు
దేవదానవ సమరూప దివ్యతేజ! సుప్రభాతము నీకిదే శుభ గణేశ!
ప్రమధ గణనాధ పదవికి పందెమిడగ షణ్ముఖుడు విశ్వమునుజుట్టి సాగిపోయె
గెలిచితివి తల్లిదండ్రుల కొలిచి నీవు సుప్రభాతము నీకిదే శుభ గణేశ!
సర్వగ్రహ బాధలను దీర్పసాహసించి విధికి ఎదురీత నీదుచు విక్రమించి
నీదు భక్తుల రక్షించి నిలుపగలవు సుప్రభాతము నీకిదే శుభ గణేశ!
వాసుదేవుని నుతియించు వ్యాసగీత నీదు చేవ్రాత యూతచే నిర్వహింప
విమల పంచమవేదమై వినుతిగాంచె సుప్రభాతము నీకిదే శుభ గణేశ!
పాంచభౌతిక షట్చక్ర పంక్తియందు ముక్తిసాధన కాధార మూలమందు
వరలుచుందువు జీవుడు వర్ధిలంగ సుప్రభాతము నీకిదే శుభ గణేశ!
భాద్రపద శుద్ధ చవితిని ప్రజలెవండ్రు నింగి చూడరు చంద్రుని నింద భయము
నింద రాకుండ చేతురు నీదు పూజ సుప్రభాతము నీకిదే శుభ గణేశ!
పాలు మీగడ వెన్నెల భక్షకుండు చవితి వెన్నెల రోజున చంద్రునీడ
పాలలో జూచి కృష్ణుడు భంగపడెను సుప్రభాతము నీకిదే శుభ గణేశ!
బాసి శౌరి శమంతకమణి తెచ్చి యిచ్చెను తన నింద తీరిపోవ
ఎంతవారలైన నినుగొల్వ సంతసించు సుప్రభాతము నీకిదే శుభ గణేశ!
తెచ్చుట కభవుగిరికి తల్లి కోర్కెను దీర్పగ తనయుడరిగె
నీరు దయలేక రావణు నిష్టలుడిగె సుప్రభాతము నీకిదే శుభ గణేశ!
బ్రహ్మరుద్రాది దేవతా ప్రభ్రుతులైన నిన్ను తలువక సృష్టిని నిలువలేరు
హరిహరాదులే నిను గొల్వ నరుల మెంత? సుప్రభాతము నీకిదే శుభ గణేశ!
ఎవ్వరీ సుప్రభాతము వినగ చదువ ఈతి బాధలు తొలగును, ఖ్యాతిగనును
ఇహపరమ్ముల సౌఖ్యము లీయగలవు సుప్రభాతము నీకిదే శుభ గణేశ!
శరణు సిద్ది వినాయక! శరణు శరణు శరణు విద్యా ప్రదీపక! శరణు శరణు
శరణు మంగళదాయక! శరణు శరణు శరణు మోక్షప్రదాయక! శరణు శరణు
జయము విఘ్న వినాయకా! జయము జయము జయము శుభ ఫలదాయకా! జయము జయము
జయము కళ్యాణకారకా! జయము జయము జయము పరిపూర్ణ! నీకిదే జయము జయము
మంగళము పార్వతీసుత! మంగళమ్ము మంగళము శారదాసుత! మంగళమ్ము
మంగళము లక్ష్మీసంభూత! మంగళమ్ము మంగళమ్ము విశ్వాసౌభాగ్య! మంగళమ్ము.