పరమశివుడికి ఏ పుష్పాలతో అర్చన ఇష్టం? నవగ్రహాలకు ఏ పూలతో అర్చన చేయాలి?

 

పరమశివుడికి ఏ పుష్పాలతో అర్చన ఇష్టం? నవగ్రహాలకు ఏ పూలతో అర్చన చేయాలి?

 1. కరవీరార్క మన్దార | శమీ వకుళ కింశుకమ్ | మధూక బృహతీ బిల్వ | మపామార్గం చ పాటలమ్ ॥

 అశోకా గస్త్య దత్తూర | కర్ణికార కదమ్బకమ్ । బాణ పున్నాగ తిలకం | కోవిదారం చ చమ్పకమ్ ॥

 మల్లికా మాధవీ జాతిః | ద్రోణం చ శతపత్రకమ్ | కమలం కైరవం చైవ | తథా నీలోత్పలాని చ ॥

తమాలం తులసీపత్ర | మిత్యేతాని శివార్చనే ॥ పుష్ప పత్రాణి శస్తాని | సర్వపాప హరాణి చ ॥

'శివార్చనకు కరవీరం (గన్నేరు), అర్కం (జిల్లేడు), మందారం, శమీ (జమ్మి), బొగడ, మోదుగ, ఇప్ప, వెంపలి, బిల్వం (మారేడు), అపామార్గం (ఉత్తరేణి), కలిగొట్టు, అశోకం, అవిసె, ఉమ్మెత్త, కొండగోగు, కడిమి, నల్ల గోరింట, సురపొన్న, ఎర్ర గోరింట, ఎర్ర దేవకాంచనం, సంపెంగ, మల్లి, పండు గురివెంద, జాజి, తుమ్మి, నూరు రేకుల పద్మం, వెయ్యి రేకుల పద్మం, తెల్ల కలువ, నల్ల కలువ, తాపింఛం, తులసి- వీటికి సంబంధించిన పుష్ప పత్రాలు సర్వదా శ్రేష్ఠాలు. వీటితో పరమ శివుణ్ణి పూజిస్తే, సమస్త పాపాలూ నశిస్తాయి.

ఏ దేవుడి అనుగ్రహానికి ఏ పుష్పం వాడాలి?

ఇంతకు ముందే చెప్పుకున్నట్లు ఒక్కో దేవతా స్వరూపానికి ఒక్కో రకం పుష్పాలు పూజకు ప్రత్యేకమైనవి. ఆ పుష్పాలతో పూజ చేయడం ద్వారా ఆ దేవతా స్వరూపం యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. సూర్య భగవానుణ్ణి, విఘ్నేశ్వరుణ్ణి పూజించడానికి ప్రత్యేకంగా తెల్లజిల్లేడు పువ్వులు వాడడం శుభకరం. విష్ణుమూర్తిని తులసీ దళాలతో పూజించడం శ్రేష్ఠం. శ్రీమహాలక్ష్మీ దేవిని - ప్రత్యేకంగా తామర పూలతో గాయత్రీదేవి విషయానికి వస్తే పూజించాలి. ఇక, ప్రత్యేకంగా మల్లిక, కుటజం (కొండమల్లె, అవిసె), పొగడ, కుశ మంజరి, మందార, మాధవి, జిల్లేడు, కదంబం, పున్నాగ, చంపక, గరిక పుష్పాలతో పూజించడం శ్రేయస్కరమని పెద్దలు చెబుతారు.

పరదేవతా స్వరూపమైన శ్రీచక్రాన్ని ప్రత్యేకంగా తామర పూలు, తులసీ దళాలు, కలువ పూలు, జాజి, మల్లెపూలు, ఎర్ర గన్నేరు, ఎర్ర కలువ పూలు, పున్నాగాలు, కలిగొట్టు పూలు, గురువింద పుష్పాలతో పూజిస్తుంటారు. శివుణ్ణి ప్రత్యేకంగా మారేడు దళాలతో అర్చిస్తుంటారు. ఇలా ఆయా దేవుళ్ళకు ఏ పుష్పాలు అత్యంత ప్రీతికరమో తెలుసుకొని పూజించడం సర్వశ్రేష్ఠం.

నవగ్రహాలకు పెద్దలు చెప్పిన పుష్పార్చన..

హయారి కుసుమైః సూర్యం | కుముదై శ్చంద్ర మర్చయేత్ | క్షితిజం తు జపా పుష్పై । శ్చంపకేన తు సోమజమ్ || శతపత్రై ర్గురుః పూజ్యో | జాజి పుష్పైస్తు భార్గవః | మల్లికా కుసుమైః పంగుః | కుందపుష్పై ర్విధుంతుదః ॥ కేతస్తు వివిధైః పుష్పైః శాంతి కాలేషు సర్వదా ।


'సూర్యుణ్ణి పచ్చ గన్నేరులతోనూ, చంద్రుణ్ణి కలువలతోనూ, కుజుణ్ణి దాసాని పూలతోనూ, బుధుణ్ణి సంపెంగలతోనూ, గురు గ్రహాన్ని పద్మాలతోనూ, శుక్రుణ్ణి - జాజిపూలతోనూ, శనైశ్చరుణ్ణి మల్లెలతోనూ, రాహువును మొల్లపూలతోనూ, కేతువును వివిధ పుష్పాలతోనూ పూజించాలి.

           *నిశ్శబ్ద..