Read more!

చెవులు కుట్టించుకోవడం అందం కోసం కాదు, ఆరోగ్యం కోసం (Purpose of Earlobe Holes)

 

చెవులు కుట్టించుకోవడం

అందం కోసం కాదు, ఆరోగ్యం కోసం

(Purpose of Earlobe Holes)

 

చెవులు కుట్టించుకోవడం ఆడవాళ్ళకు చెందిన వ్యవహారం అని, ఇది అందం కోసం పుట్టిన సంప్రదాయం అని చాలామంది అనుకుంటారు. నిజానికి చెవులు కుట్టించుకోవడం అనేది ఆడవాళ్ళకు మాత్రమే చెందిన వ్యవహారం కాదు. అసలిది కేవలం అందం కోసం పుట్టిన సంప్రదాయం అంతకంటే కాదు.

 

చెవులు కుట్టించుకోవడంవల్ల చెవుడు రాదు. చెవికి, కంటికి సంబంధం ఉందని మనకు తెలుసు. చెవులు కుట్టించుకోవడం వల్ల కంటిచూపు బాగుపడుతుందని నిపుణులు తేల్చి చెప్పారు. మొదట కంటిచూపును మెరుగుపరచుకోవడం కోసమే చెవులు కుట్టించుకోవడం అనే సంప్రదాయం ఏర్పడింది. అలా చెవులకు రంధ్రాలు అయిన తర్వాత వాటికి ఆభరణాలను పెట్టుకోవడం అనే ఆచారం ఆరంభమయింది. అందువల్లనే పూర్వం స్త్రీలు మాత్రమే కాదు, పురుషులు కూడా చెవులు కుట్టించుకునేవారు.

 

ఎక్కువమంది చెవికి అడుగుభాగంలో కుట్టించుకుంటారు. మరికొందరు చెవికి కింది భాగంలోనే కాకుండా పైన, పక్కన అనేక భాగాల్లో కూడా కుట్టించుకుంటారు. ఇంకొందరు ముక్కుకు రంధ్రం పెట్టించుకుంటారు. ఇవన్నీ కూడా ఆరోగ్యరీత్యా ఏర్పడిన సంప్రదాయాలే.

 

ఆయుర్వేదం, హోమియోపతి, అలోపతి ల్లాగే ఆక్యుపంక్చర్ ఒక వైద్య విధానం. అయితే ఈ పేరుతో, ప్రస్తుత పద్ధతిలో కాకున్నా పూర్వం ఎప్పుడో ఈ రకమైన చికిత్స ఉండేది. అందులో భాగమే చెవులు, ముక్కు కుట్టించుకునే పద్ధతి.

 

ఇంకా లోతుగా చెప్పాలంటే... చెవికి, కళ్ళు, ముక్కు, పళ్ళు లాంటి ఇతర అవయవాలతోనూ సంబంధం ఉంది. ముఖంలోని అనేక ఇతర అవయవాలకు చెవి ప్రాతినిధ్యం వహిస్తుంది. కనుకనే పన్ను పీకేటప్పుడు ఏమాత్రం తేడా వచ్చినా వినికిడి శక్తి తగ్గుతుంది.ఒక్కోసారి విషజ్వరం లాంటి అనారోగ్యాలు సోకినప్పుడు చెవికి ఇబ్బంది కలుగుతుంది. కొందరికి కొంత వినికిడి శక్తి తగ్గవచ్చు. ఇంకొందరికి బ్రహ్మచెవుడు వచ్చే ప్రమాదం కూడా ఉంది.

 

చెవులు కుట్టించుకోవడంవల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఉబ్బసం, మూర్చ లాంటి దీర్ఘకాలిక వ్యాధులను చెవులు కుట్టడంద్వారా నివారించవచ్చు.

 

శరీరంలోని ఇతర అవయవాలకు, చెవికి ఇంత అవినాభావ సంబంధం ఉంది కనుకనే పూర్వం స్త్రీపురుషులందరూ చెవి కుట్టించుకునేవారు. అలా చెవి కుట్టించుకోవడం అనేది ఆరోగ్యం కోసం మొదలై, అందచందాలు తీసుకొస్తోంది.

 

ఆరోగ్యంకోసం చెవులు కుట్టించుకోవడం మొదలయ్యాక బంగారం, రాగి లాంటి లోహాలతో చెవి దుద్దులు, లోలకులు తయారుచేయించుకుని ధరిస్తున్నారు.

 

Earlobe holes for health, earlobe holes for glamour, ear holes and rings, ear rings and health ear holes started for health, then started wearing ear rings for glamourous and attractive look