Read more!

ధనుర్మాస వ్రత విశిష్టత

 

ధనుర్మాస వ్రత విశిష్టత

 

- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రంగనాథ్

 

 

 

 

 

ధనుర్మాసంలో చేసే వ్రతం కనుక దీనిని ధనుర్మసవత్రంగా పిలుస్తున్నాం. మనకు మేషం నుండి మీనం వరకు పన్నెండు రాశులున్నాయి. సూర్యుడు నెలకో రాశిలో ప్రవేశిస్తుంటాడు. దీనిని సంక్రమణం లేక సంక్రాంతి అంటున్నాం. ఉదాహరణకు సూర్యుడు మేష రాశిలో ప్రవేశిస్తే ధనుస్సంక్రమణం లేదా మేష సంక్రాంతి అవుతుంది. అలాగే  సూర్యుడు ధనూరాశిలో ప్రవేశిస్తే  ధనుస్సంక్రమణం లేక ధనుస్సంక్రాంతి అవుతుంది. ఒక రాశిలో ప్రవేశించిన సూర్యుడు నెలపాటు ఆ రాశిలో వుంటాడు కనుక ఆ రాశి పేరున  ఆ సంక్రాంతిని వ్యవహరిస్తారు. ధనూరాశిలో ఒక మాసం పాటు సూర్యుడు  వుంటాడు కనుక ఆ మాసాన్ని ధనుర్మానం అనడం జరుగుతోంది. మార్గశీర్ష మానం ఆరంభమైన ఏడు  రోజులకు ధనుస్సంక్రమణం జరుగుతుంది. అంటే మార్గశీర్ష మాసపు ఏడవ రోజునుండి పుష్యమాసం  ప్రారంభమైన ఆరవ రోజు వరకు ఉంటుంది. 30వ రోజును భోగి పండుగగాను, ఆ మరుసటిరోజున మకర సంక్రాంతి పండుగగాను మనం జరుపుకుంటాం.

 

 

 


ఈ ధనుర్మాస వ్రతం మార్గశీర్షపు ఏడవ రోజునుండి ప్రారంభమై పుష్యమాసపు ఆరవ రోజువరకు నిరంతరాయంగా సాగుతుంది. వ్రతాన్ని ధనుర్శాసంలోనే ఎందుకు చేయాలన్న సందేహం రావచ్చు. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా 'మాసోహం మార్గశీర్షోహం' అని తానే మార్గశీర్ష మాసాన్నని భగవద్గీతలో సెలవిచ్చాడు. ఇది శ్రీకృష్ణ భగవాసునికి ప్రీతి పాత్రమైన  మాసం కాబట్టి స్వామిని ఈ మాసంలో విశేషంగా ఆరాధిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని శ్రీ గోదాదేవి మనకు నిరూపించి చూపింది.

మనకు ఉత్తరాయణం, దక్షిణాయనం అని రెండు పుణ్యకాలాలున్నాయి. ఇందులో ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకు పగలుగను, దక్షిణాయన పుణ్యకాలం వారికి రాత్రిగాను పరిగణించబడతాయి. ఇందులో మార్గశీర్ష మాసం ఉత్తరాయణ పుణ్యకాలానికి ఉషఃకాలమాట. అంటే బ్రహ్మీ ముహూర్తమన్నమాట! కావుననే మార్గశీర్షమాసం ఇంత ఆధిక్యతను సంతరించుకుంది.

ఇక ధనుర్మస వ్రత విషయానికొస్తే శ్రీ ద్వాపరయుగంలో శ్రీ కృష్ణ సంశ్లేషమును పొందగోరిన గోపకన్యలు వ్రేపల్లెలో కాత్యాయినీ వ్రతాన్ని చేశారని విని, తానూ అలాగే చేయాలనుకుంది. తానున్న విల్లిపుత్తూరును వ్రేపల్లెగను, తన్ను ఒక గోప కన్యకగను, తన స్నేహితురాళ్ళను వ్రజ కన్యలుగను భావించి, తాను గొల్ల కన్య రూపాన్ని ధరించి విల్లిపుత్తూరులో వేంచేసియున్న వటపత్రశాయినే శ్రీకృష్ణునిగా భావించి, అతి శ్రేష్ఠమైన మార్గశీర్షమాసాన ధనుర్మాససమయంలో శ్రీ స్వామివారిని నెలరోజులూ అర్చిస్తూ రోజుకొక పాశురాన్ని(పాట) సమర్పించింది. ఆమె పాడిన పాటలు సామాన్యమైనవి కావు.(1) శ్రీ సీతాకళ్యాణం "అష్ఠాక్షరీ మంత్రాన్ని "ఓం నమోనారాయణాయ.(2) శ్రీ గోదాకళ్యాణం" ద్వయమంత్రాన్ని "శ్రీ మన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః 3) శ్రీ రుక్మిణీ కళ్యాణం చరమశ్లోకాన్ని

శ్లో||    సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ
    అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచుః"
అని
    ప్రతిపాదిస్తాయని ఆచార్య సూక్తి -

 

 

 


శ్రీ గోదాదేవి స్వామికి సమర్పించిన పాశురాలు ప్రణవమంత్ర, అష్టాక్షరీ మంత్ర, స్వరూపాలే. వేదోపనిషత్తుల సారాంశమే! నియమ నిష్ఠలతో స్వామిని ఆరాధిస్తే ముప్పది దినాల్లోనే తరుణోపాయం లభిస్తుందని చాటి చెప్పింది మన ఆండాళ్ తల్లి చూపిన మార్గంలో పయనించి మన జీవితాలను ధన్యం చేసుకుందాం.

వ్రతం చేయదల్చుకున్న వారెవరైనా ఆచార్య నిష్ఠను కలిగి కులమత వర్గ భేదాల కతీతంగా ఉండి బ్రాహ్మీ ముహూర్తంలో బహిర్ స్నానం చేయటం అంతర్ మనస్సుకు భక్తిజల స్నానాన్నవలంభించటం ముద్గాన్నం వండి ఆరగింపు చేయగలగటం ఇవే నియమాలు.

    ఆచరిద్దాం! శ్రీ గోదా రంగనాధుల అనుగ్రహాన్ని పొందుదాం.

   
        తిరుప్పావు
        తనియులు


    శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవమ్|
    యతీన్ద్ర ప్రవణం వన్దే రమ్యజామాతరం మునిమ్||

    లక్ష్మీనాథ సమారమ్భం నాథ యామున మధ్యమామ్|
    అస్మదాచార్య పర్యన్తాం వన్దే గురుపరమ్పరామ్||

    యోనిత్యమచ్యుత పదామ్బుజ యుగ్మరుక్మ
    వ్యామోహత స్తదితరాణి తృణాయ మేనే!|
    అస్మద్గురో ర్భగవతో2స్య దయైకసిన్దోః
    రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే..||

    మాతా పితా యువతయ స్తనయా విభూతిః
    సర్వం యదేవ నియమేన మదన్వయానామ్ |
    ఆద్యస్య నః కులపతే ర్వకుళాభిరామం
    శ్రీ మపత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ద్నా.. ||

    ఆళ్వారులతనియన్ - శ్రీ పరాశరభట్టర్ ఆనతిచ్చినది ||
   
    భూతం సరశ్చ మహాదాహ్వయ భట్టనాథ
    శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ |
    భక్తాంఘ్రిరేణు పరకాల యతీన్ద్రమిశ్రాన్
    శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యమ్ ||


        తిరుప్పళ్ళియెళుచ్చి

    తమేవ మత్వా పరవాసు దేవం
    రంగేశయం రాజవదర్హణీయం
    ప్రాబోధికీం యోకృతసూక్తి మాలాం
    భక్తాంఘ్రి రేణుం భగవంతమీడే

    మండం గుడి మెన్బర్ మామఱైయోర్ మన్నియశీర్
    తొండరడిప్పడి తొన్నగరమ్ వణ్ణు
    తిణర్త వయల్ తెన్న రంగత్తమ్మానై - పళ్ళి
    యుణర్తుమ్ పిరానుదిత్త పూర్,


తొండరడిప్పొడి యాళ్ వారు అనుగ్రహించిన రెండు దివ్య ప్రబంధములలో ఇది రెండవ ప్రబంధము "తిరు" అను శబ్దము గోప్పతనమను అర్ధము చెప్పుచు "పళ్ళి" పడక "ఎళుచ్చి" లేచుట అనగా పడకను విడచి లేచుట యని అర్ధము.

దీనిలో ఒక్కొక్క  పాశురమునందును పళ్ళియెళందరుళాయే అని పడకను విడచి లెమ్మనియే ప్రార్థించుటచే శ్రీ రంగనాధులను మేలుకొలుపుటనే -రాజవదర్హణీయమ్ అని చెప్పిరి దేవాలయాల్లో నేడు  విన్పించే సుప్రభాతములకు ఇదియే నంది అని పెద్దల వాక్కు.

 

 

 


1.    కదిరవన్ కుణతిశైచ్చిగరమ్ వన్ధణైన్దాన్
    కనైయిరుళగన్ఱచు కాలైయమ్ పొళుదాయ్
    మదువిరిన్దోళుగిన మామలరెల్లామ్
    వానవరరశర్ కళ్ వన్దు వన్దీణ్డి,
    ఎదిర్ దిశై, నిఱైన్ధన రివరొడుమ్ పుగున్ధ
    ఇరుంగళి త్తీట్టముమ్ పిడియెడు మురశుమ్
    అదిర్ దలిలలై కడల్ పోన్ఱుళదు ఎంగుమ్
    అరంగత్తమ్మా పళ్ళియెళున్ధరుళాయె

2.    కొళుంగొడి ముల్లైయిన్ కొళు మలరణవి
    క్కూర్ న్ధదు కుణదిశై మారుద మిదువో,
    ఎళున్ధన మలరణై ప్పళ్ళి కొణ్డన్నమ్
    ఈన్బనిననైన్ధ తమిరుమ్ శిఱుగుదఱి
    విళుంగియ ముదలైయిన్ పిలమ్బురై పేళ్వాయ్
    వెళ్ళెయిఱుఱవదన్విడత్తినుక్కనుంగి,
    అళుంగియ  వానైయి నరుమ్ తుయర్ కెడుత్త
    అరంగత్తమ్మా పళ్ళియెళున్ధరుళాయె..

3.    శుడరొళి పరన్ధన శూళిందిశై యెల్లామ్
    తున్నియ తారకై మిన్నొళిశురజ్గి.
    పడరొళి పశుత్తనన్ పనిమది యివనో
    పాయిరుళగనదు పెమ్ పోళిఱ్కముగిన్
    మడిలిడైక్కీఱి వణ్ పాళై కళ్ నాఱ
    వైగఱై కూర్ న్ధదు మారుద మిదువో
    అడలొళి తిగళదరు  తిగిరియమ్ తడక్కై
    అరంగత్తమ్మా పళ్ళియెళున్ధరుళాయే...

4.    మేట్టిళమేదిగళ్ తళై విడు మాయర్ గళ్
    వేయజ్ఞుళలో శైయుమ్ విడైమణిక్కురలుమ్
    ఈట్టియ విశైదిశై పరన్ధన వయలుళ్
    ఇరిన్ధన శురుమ్బిన మిలజ్గైయర్ కులత్తై,
    వాట్టియ వరిశిలై వానవరేఱే
    మాముని వేళ్వియైక్కాత్తు అవపిరదమ్
    అట్టియవడుతిఱలయోత్తి యెమ్మరశే
    అరంగత్తమ్మా పళియెళున్ధరుళాయే..

5.    పులంమ్బిన పుట్కళుమ్ - పూమ్ పోళుల్ గళిన్ వాయ్
    పోయిత్తుంగళ్ పుగున్ధదు పులరి
    కలన్ధదు కుణదిశైక్కనై కడలరవమ్
    కళివణ్ణు మిళుత్తియ కలమ్బగమ్ పునైన్ధ
    అలంగలన్దొడైయల్ కొణ్ణడియిణై పణివాన్
    అమరర్ కళ్ పుగున్ధన రాదలిలమ్మా
    ఇలంగైయర్ కోన్ వళిపాడు శెయ్ కోయిల్
    ఎమ్బెరుమాన్ పళ్ళియేళున్ధరుళాయే...

6.    ఇరవియర్ మణినెడుమ్ తేరొడుమివరో
    ఇఱైయవర్ పదినొరు విడైయరుం ఇవరో
    మరుమియ ముయిలిన నఱుముగ నివనో
    మరుదరుమ్ పశుక్కలమ్ వన్దు వన్దీణ్డియ వెళ్ళమ్

    అరువరైయనై యనిన్ కోయిల్ మున్నివరో
    అరంగత్తమా పళ్ళి యెళున్ధరుళాయే

7.    అన్ధరత్తమరర్ గళ్ కూట్టంగళివైయో
    అరుందవ మునివరుం మరుదరుమివరో
    ఇన్దిర నానైయుమ్ తానుమ్ వన్దివనో
    ఎమ్బెరు మానున కోయిలిన్ వాశల్
    శున్ధరర్ నెరుక్కవిచ్చాదరర్ నూక్క
    ఇయక్కరుమ్ మాయంగినర్ తిరువడిత్తొళువాన్
    అన్ధరమ్ పారిడ మిల్లైమత్తిదువో
    అరంగత్తమ్మా పళ్ళియెళున్ధరుళాయే.

8.    వమ్బవిళింవానవర్ వాయుఱై వళుజ్గ
    మానిది కపిలై యొణ్ కణ్ణాడిముదలా
    ఎమ్బెరుమాన్ పడిమైక్కలమ్ కాణ్డఱ్కు
    ఏర్పన వాయినకొణ్డు నన్మునివర్
    తుమ్బురునారదర్ పుగున్ధన రివరో
    తోన్ఱిన విరవియమ్ తులంగొళి పిరప్పి
    అమ్బరతలత్తి, నిన్ఱగల్ గిన్ఱ దిరుళ్ పోయ్
    అరంగత్తమ్మా పళ్ళి యెళున్ధరుళాయే...

9.    ఏదమిల్ తణ్ఱుమై యెక్కమ్ మత్తళి
    యాళుమ్ కుళుల్ ముళువమో డిశైదిశైకైళుమి
    కీదంగళ్ పాడినర్ కిన్నరర్ కరుడర్ గళ్
    కన్ధరు వరుమివర్ కజ్గలు ళెల్లామ్
    మాదవర్ వానవార్ శారణర్ ఇయక్కర్
    శిత్తరుమ్ మయంగినర్ తిరువడిత్తోళువాన్
    ఆదలిలవర్కునాళో లక్కమరుళ
    అరంగత్తమ్మా పళ్ళియెళున్ధరుళాయే..

10.    కడిమలర్కములంగళ్ మరల్ న్ధన వివైయా
    కదిరవన్ కనైకడల్ ముళైత్తన నివనో
    తుడియుడైయార్ శురికుళుల్ పిఱున్దుదఱి
    త్తయిలుడుత్తే ఱినర్ శూళుంపునలరంగా!
    తొడై యొత్తతుళవముమ్ - కూడైయుమ్ పొలిన్దు
    తోన్ఱియతోళ్ తొణ్ణరడిప్పొడి యెన్నుమ్
    ఆడియనై యళియనెన్ఱరుళియున్నడియార్కు
    అప్పడుత్తాయ్ పళ్ళియెళున్ధరు ళాయే
    తొండరడి యాళ్వార్ తిరువడిగళే శరణం.


    తొండరడిప్పొడి యాళ్వార్ తిరువడి ఘళే శరణమ్
    (అని నమస్కారము చేయవలెను)
 

        అణ్డాళ్ తిరువడిగళే శరణమ్

 

 

 


    నీలా తుంగస్తన గిరిత సుప్త ముద్బోధ్య కృష్ణం
    పారార్థ్యం స్వం శ్రుతి శతశిరస్సిద్ద మధ్యాపయన్తీ|
    స్వోచ్చిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే
    గోదా తస్యై నమ ఇద మిదం భూయ ఏవాస్తు భూయః ||

    అన్నవయల్ పుదువై యాండా ళరంగఱ్కు
    ప్పన్ను తిరుప్పావై ప్పల్ పదియమ్ - ఇన్నిశైయాల్
    పాడి కోడుత్తాళ్ నఱ్పామాలై, పూమాలై
    శూడిక్కొడుత్తాళై చ్చొల్.

    శూడి క్కొడుత్త శుడర్ క్కొడియే! తొల్ పావై,
    పాడి యరుళవల్ల పల్ వళైయాయ్! - "నాడినీ
    వేంగడ వఱ్కెన్నై విది" యెన్ఱ విమ్మాత్తమ్,   
    నాంగడవా వణ్ణమే నల్ గు.


    * ఈ గుర్తు గల పాశురములు రెండు సార్లు విన్నపము చేయవలెను.