బొమ్మల కొలువులు ఎలా ఏర్పాటు చేసుకోవాలి

 

బొమ్మల కొలువులు ఎలా ఏర్పాటు చేసుకోవాలి..?

 

అన్ని వర్గాలవారికీ ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పంచేదే సంక్రాంతి పండుగ. పిన్నలకు, పెద్దాలకు అందరికి పండుగతో సంబంధం ఉంది..అసలు సంక్రాంతి సందడంతా ఆడపిల్లలదే అని చెప్పవచ్చు..ఈ పండుగకు సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్మాసంలో ఇళ్ళ ముందు రకరకాల రంగవల్లికలను తీర్చిదిద్దుతూ అమ్మాయిలు సంబరాల్లో మునిగి తేలుతారు. అలాగే భోగిరోజు సాయంత్రం పిల్లలకు భోగిపళ్లు పోస్తారు..అదే సమయంలో చేసే మరో ఉత్సవం బొమ్మల కొలువు. పండుగకు పదిరోజుల ముందు నుంచే కొలువులో పెట్టే బొమ్మలను సేకరించడంలో చిన్నపిల్లలు నిమగ్నమవుతారు. ఎవరు ఎన్ని ఎక్కువ బొమ్మలను..ఎంత అందంగా అమరిస్తే అంత గొప్ప.