సత్పరుషులు మేఘాలవంటి వారే
సత్పరుషులు మేఘాలవంటి వారే
ఉరుకరుణాయుతుండు సమయోచిత మాత్మ దలంచి యుగ్రవా
కృరుషతజూపినన్ఫలముకల్గుట తథ్యముగాదె యంబురం
బురిమిన యంతనే కురియకుండునె వర్షము లోకరక్షణ
స్థిరతర పౌరుషంబున నశేషజనంబు లెఱుంగ భాస్కరా!మేఘుడు తొలుత ఉరిమినా, తరువాత వర్షంతో జనులకు సంతోషాన్ని కలగచేయడం తథ్యం. సత్పురుషుల తీరు కూడా ఇలాగే ఉంటుంది. సమయాన్ని బట్టి వారు కొంత గంభీరంగా మాట్లాడినా, చివరికి మేలు చేసే గుణమే కలిగి ఉంటారు.