పరమ శివుని భక్తి కవితలు

 

పరమ శివుని భక్తి కవితలు

ఈ విధంగానే మనకు ఇష్టమైన దేవుడిని పూజించాలి లేక ఆరాదించాలి లేక కోలుచుకోవాలనే నిబందనలు ఉన్నప్పటికీ కొందరు శ్లోకాలు చదువుతూ, మరికొందరు స్తోత్రాలు చదువుతూ, ఇంకొందరు కథలు చదువుతూ ఇష్టమైన దైవాన్ని తలుచుకుంటూ ఉంటారు. అయితే మరికొంతమంది కవితలు రాస్తూ, వాటిని చదువుకుంటూ దైవాన్ని తలుచుకుంటారు. దైవభక్తి చాటుకుంటారు.

www.teluguone.com/devotional ఈ రోజు భక్తి స్పెషల్ గా అందిస్తున్న శీర్షికలో పరమశివుని తలపించే కొన్ని కవితలు చదువుకుందాం !

ఓ శివ...

సద్భుద్దిని ప్రసాదించు

మేధస్సును ప్రసాదించు

ఇంద్రియ నిగ్రహాన్ని ప్రసాదించు

తేజస్సును ప్రసాదించు

***********

పిలిచిన పలికే శ్రీ మహాదేవ

వరములనీయ శ్రీఘ్రమే రావా

అఖిల లోకముల మోక్ష ప్రదాత

అర్థనారీశ్వరా, శుభాములనొసగానయ్యా

కైలాసదేవరా మము బ్రోవవేమయా

ఓ నీలకంధరా, ఓ దీన మందార

మమ్మేలు ఓస్వామి..ఓ భక్తవశంకరా

సకల జ్యోతిర్లింగాలు మేము చూడ సాధ్యమా

అందుకే మా ఇంత నీ పూజ చేసెను

కాపాడి కరుణించి మముబ్రోవు దేవరా

నీ కరుణ మాకున్న చాలయ్యా దేవరా !

******************