వేసవి జిడ్డును వదిలించుకోండిలా!

 

 

వేసవి జిడ్డును వదిలించుకోండిలా!

 

 

ఎండ ఉన్నంతకాలం జిడ్డు మన వెంటే ఉంటుంది. ఎన్నిసార్లు కడిగినా ముఖాన్ని వదలకుండా మారాం చేస్తూ ఉంటుంది. దాంతో కళను కోల్పోయిన ఫేస్ తో డల్ గా తిరగాల్సి వస్తుంది. ఈ సమస్య తీరాలంటే కొన్ని సింపుల్ చిట్కాలు పాటించండి.

- జిడ్డును వదిలించడంలో ముల్తానీ మట్టి నంబర్ వన్. అందుకే కాస్త ముల్తానీ మట్టి తీసుకుని, అందులో కాసింత తేనె కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోండి. జిడ్డు వదిలిపోతుంది.

- టొమాటోను పేస్ట్ చేసి, అందులో కొద్దిగా పెరుగు, కాసింత పసుపు కలిపి ముఖాన్ని బాగా రుద్ది, ఆరిన తర్వాత కడిగేసుకుంటే జిడ్డు అన్నదే కనిపించదు.

- పచ్చకాయ జ్యూస్ లో దూదిని ముంచి... ముఖం, మెడ బాగా క్లీన్ చేసుకోండి. రోజూ ఇలా చేస్తూ ఉంటే కొద్ది రోజులకి ముఖం జిడ్డెక్కడమే మానేస్తుంది.

- బియ్యప్పిండిలో పచ్చి బంగాళాదుంప రసం కలిపి పేస్ట్ లా చేసుకోండి. దీనితో నలుగుపిండి మాదిరిగా రుద్దుకుంటే జిడ్డుతో పాటు ఎండ వల్ల వచ్చిన నలుపు కూడా పోతుంది.

- క్యారెట్ పేస్ట్ లో కాసింత బాదం నూనె కలిపి ప్యాక్ వేసుకున్నా ఫలితం ఉంటుంది.

- అరటిపండు తొక్కతో ముఖం బాగా రుద్దుకుని, ఆరిన తర్వాత కడిగేసుకున్నా జిడ్డు మాయమవుతుంది.

- పాలలో చిటికెడు తేనె కలిపి, దానిలో ముంచిన నూనెతో రుద్దుకున్నా మంచిదే.

- Sameera