Read more!

బగళాముఖీ స్తోత్రమ్

 

                                    బగళాముఖీ స్తోత్రమ్

ఓం అస్యశ్రీ బగళాముఖీ స్తోత్రస్య నారదఋషిః, శ్రీబగళాముఖీ దేవతా
మమ సన్నిహితానాం విరోధినాం వాజ్ముఖ పడబుద్ధీనాం స్తంభనార్ధే
స్తోత్రపాఠే వినియోగః మధ్యేసుధాబ్ధి మణిమంటపరత్నవేది
సింహాసనోపరిగతాం పరిపీతవర్ణాం
పితాంబరాభరణ మాల్యవిభూషితాంగీం
దేవీంభజామి ధృతముద్గర వైరిజిహ్వాం.
జిహ్వాగ్రమాదాయ కరేణదేవీం
వామేనశత్రూన్ పరిపీడయంతీం

గదాభిఘాతేన చ దక్షిణేన
పీతాంబరాఢ్యాం ద్విభుజాం భజామి.
చలత్కనక కుండలోల్లసిత చారుగండస్థలాం
లసత్కనక చంపకద్యుతిమ దిందుబింబాననాం
గదాహత విపక్షకాం కలితలో లజిహ్వాంచలాం
స్మరామి బగళాముఖీం విముఖ వాజ్మనసస్తంబినీం
పియూషో దధి మధ్య చారు విలాస ద్రక్తోత్పలే మంటపే

సత్సింహాసన మౌళిపాతితరిపుం ప్రేతాసనాఢ్యాంసినీం
స్వరాభాం కలిపీడతారి వసనాం భ్రాద్గదాం విభ్రమాం
యస్వాం ధ్యాయతి యాంతి తస్యవిలయం సద్యోధ సర్వాపదః
దేవీ త్వచ్చరణాంబుజార్చనకృతే యఃపీత పుష్పాంజలీన్
భక్త్యావామకరే నిధాయచమనుం మన్త్రీమనోజ్ఞాక్షరం
పీఠధ్యాన పరోధకుంభక వశాద్బీజంస్మ రేత్పార్థివ
స్తస్యామిత్రముఖస్యనాభి హృదయేజాడ్యంభవేత్త తక్షనాత్
వాదీమూకతి కంకతిక్షితిపతి రైశ్వానరశ్శీతితి

క్రోధీశామ్యతి, దుర్జనస్సుజనతి క్షప్రానుగఃఖంజతి
గర్వీ ఖర్వతి, సర్వవిచ్చ జడతి త్వద్యంత్రణా యంత్రితః
నిత్యేబగళాముఖీ ప్రతిదినం కళ్యాణి తుభ్యంనమః

బగళా (వల్గా ) ముఖీమంత్రః


ఓం హ్రీం బగళాముఖి! సర్వదుష్టానాం వాచం ముఖం పదం
స్తంభయ జిహ్వం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా.
 
మంత్రస్తావదయం విపక్షదళన స్తోత్రం పవిత్రంచతే
యంత్రం వాదినియంత్రణం త్రిజగతాం జైత్రం చ చిత్రం చ తే
మాత శ్రీబగళేతి నామ లలితం యస్యాస్తి జంతోర్ముఖే
త్వన్నామగ్రహేణేన సంసదిముఖ స్తంబో భవే ద్వాదినాం

దుష్టస్తంభన ముగ్రవిఘ్నశమనం దారిద్ర్య విద్రావణం
భూభృద్భీ శమనం చలన్ మృగదృశాం చేతస్సమాకర్షణమ్
సౌభాగ్యై కనికేతనం సమదృశః కారుణ్య పురామృతం
మృత్యోర్మారణ మానిరస్తుపురతో మాతస్తదీయంవపుః

మాతర్బంజయ మే విపక్షవదనాం జిహ్వాం చ సంకీలయ
బ్రాహ్మీం ముద్రయ నాశ యాశు ధిషణా ముగ్రాంగతిం స్తంభయ
శత్రూన్ శ్చూర్ణయదేవి దీక్ష గదయాగౌరాంగిపీతాంబరే
విఘ్నౌఘంబగళే హర ప్రణమతా కారుణ్య పూర్ణేక్షణే

మాతర్బైరవి భద్రకాళి విజయే వారాహి విశ్వాశ్రయే
శ్రీవిద్యే సమయే మహేశీ బగళే కామేశి రామేరమే
మాతంగి త్రిపురే పరాత్పరతరే స్వర్గాపవర్గప్రదే
దాసోహం శరణాగతః  కరుణయా విశ్వేశ్వరి త్రాహిమాం.

సరంభే చౌర్యసమయే ప్రహరణ సమయే బంధనే, వారి మధ్యే
విద్యావాదే వివాదే ప్రతికృతినృపతౌ దివ్యకాలేనిశాయామ్
తస్యేవా స్తంభనేవా రిపువధసమయే నిర్జనేవా వనేవా
గచ్చం తిష్ఠం స్తికాలః యదిపఠతి శివం ప్రాప్నుయాదాశు ధీరః

నిత్యం స్తోత్రమిదం పవిత్రమిహయో దేవ్యాఃపఠేత్యాదరాత్
ధృత్వాయంత్రమిదం తధైవసమరే బాహౌకరేవాగళే
రాజానోప్యరాయో మదాంధకరిణ స్సర్పా మృగేంద్రాదికాః
తేవైయాంతి విమోహితారిపుగణాలక్ష్మీః స్స్ధిరాస్సిద్ధయః

త్యంవిద్యా పరమా త్రిలోకజననీ విఘ్నౌఘసంఛేదినీ
యోషాకర్షణకారిణీ త్రిజగతా మానంసంవర్థినీ
దుస్ఫోటోచ్చాటనరికాణీజనమనస్సమ్మోహ  సంధాయినీ
జీహ్వాకీలనభైరవీ విజయతే బ్రహ్మాస్త్ర మంత్రోయథా.

విద్యాలక్ష్మీ స్సర్వసౌభాగ్యమాయః
పుత్రేః పౌత్రైః సర్వసామ్రాజ్యసిద్ధిః
మానంభోగో వన్యమారోగ్యసౌఖ్యం
ప్రాప్తం తత్తద్బూతలేపాస్మిన్నరేణ.

యత్కృతంచజపం హోమంగదితం పరమేశ్వరి
దుష్టానాం నిగ్రహార్థాయ తద్గృహాణ నమోస్తుతే.
బ్రహ్మాస్త్రమవిల్యాతం త్రిషులికేషు విశ్రుతం
గురుభక్తాయ దాతవంన్న దేయం యస్యకస్యచిత్

పీతాంబరరాంత్వాం ద్విభుజాం త్రినేత్రా గాత్రగోజ్జ్వలాం
శిలాముద్గరహస్తాంచ స్మరేత్తాం బగళాముఖీం.