Pasupu Parani gives Beauty & Health

 

అందాన్ని, ఆరోగ్యాన్నీ ఇచ్చే పసుపు పారాణి

Pasupu Parani gives Beauty & Health

స్త్రీలకు సంబంధించిన ఆచారాలు, అలవాట్లలో పసుపు, కుంకుమలకున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. పెళ్ళి, పేరంటం లాంటి శుభ సందర్భాల్లో కాళ్ళకు పసుపు రాసుకోవడం తప్పనిసరి. పారాణి పెట్టుకోవడం ఆనవాయితీ. పసుపు కుంకుమలను నీళ్ళతో కలిపి పారాణిగా తీర్చిదిద్దుకుంటారు మహిళలు. పసుపుకుంకుమలు శుభ సంకేతం. పసుపు కుంకుమలవల్ల ప్రత్యేకతను సంతరించుకోవడమే కాకుండా అందం, ఆరోగ్యం ఇనుమడిస్తాయి.

 

పూజలు, వ్రతాలు లాంటి శుభ కార్యాల్లో పసుపుకుంకుమలకు చాలా ప్రాధాన్యత ఉంది. పండుగలు, పెళ్ళిళ్ళ లాంటి విశేష దినాల్లో గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడమే కాకుండా స్త్రీలు కాళ్ళకు తప్పకుండా పసుపు రాసుకుంటారు. ముఖాన చిటికెడు కుంకుమ లేకపోతే ఎంత బోసిగా, అందవిహీనంగా ఉంటుందో కదూ! పూజలు మొదలు పెళ్ళి పేరంటాల పిలుపుల వరకూ అంతా పసుపు కుంకుమలతోనే ముడిపడి ఉంటుంది. స్నానం చేసేముందు ముఖానికి, చేతులకు పసుపు పట్టించి కొంతసేపయ్యాక స్నానం చేస్తారు. దీనివల్ల శరీర ఛాయ పెరుగుతుందని, ముఖంలో మంచి వర్చస్సు వస్తుందని, అన్నిటినీ మించి ఆరోగ్యానికి మంచిదని పెద్దలు అనేక సందర్భాల్లో చెప్పారు. నెలసరి నాల్గవరోజున, బంధువులు మరణించినప్పుడు స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసుకుంటారు. కారణం పసుపు క్రిమిసంహారిణిగా పనిచేస్తుంది. అలా నీళ్ళలో పసుపు వేసుకోవడంవల్ల మరింత శుద్ధి జరుగుతుంది.

 

అనేక ఆయుర్వేద ఔషధాల్లో పసుపును ఉపయోగిస్తారు. దెబ్బ తగిలినప్పుడు, వెళ్ళసందులో పుండు ఏర్పడినప్పుడు, ఇతరత్రా గాయాలకు పసుపు అద్దడం తెలిసిందే. ఇన్ఫెక్షన్లు రాకుండా పసుపు కాపాడుతుంది. కళ్ళ కలకలు ల్లాంటి సమస్యలను నివారించడంలో పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది.

 

స్త్రీలే పసుపు ఎందుకు రాసుకుంటారు అనే సందేహం కలగడంలో ఆశ్చర్యం లేదు. అనాదిగా ఇంటిపనులు చేసేది, గృహ బాధ్యతలు నిర్వహించేదీ ఆడవాళ్ళే కదా! వంటావార్పు, అంట్లు కడగడం బట్టలు ఉతకడం లాంటి పనులు చేయడంవల్ల కాళ్ళు తడిలో నాని పాచిపోయే అవకాశం ఉంది. కాళ్ళకు పసుపు రాసుకోవడంవల్ల విరుగుడుగా (anti-allergicగా) పనిచేస్తుంది.


auspicious Pasupu Parani, pasupu kumkuma symbol of divine look, pasupu kumkum gives health and beauty, pasupu kumkuma in hindu puja, pasupu kumkuma in marriages