సోమవారం రోజు శివుడిని ఇలా పూజిస్తే జాతకంలో ఉన్న ఈ దోషం పోతుంది!

 

సోమవారం రోజు శివుడిని ఇలా పూజిస్తే జాతకంలో ఉన్న ఈ దోషం పోతుంది!


 
జాతకం గురించి చాలామంది కొట్టి పడేస్తారు కానీ సరైన జ్యోతిష్యం చెప్పేవారు జాతకాలను చాలా స్పష్టతతో రాస్తారు. చాలామందికి జాతకాలలో వివిధ రకాల దోషాలు ఉంటాయి. కొందరికి జీవిత పరమైన సమస్యలు ఉంటే మరికొందరికి ఆరోగ్యపరమైన సమస్యలుంటాయి. చాలామంది ఏవైనా నిర్ణయాలు సరిగా తీసుకోలేకున్నా, జీవితంలో వెనుకబడి ఉన్నా దాన్ని జాతకంలో చంద్ర దోషంగా చెబుతారు.  చంద్రుడు శివుడి తలమీద ఉంటాడు. శివుడిని పూజిస్తే చంద్రుడు కూడా ప్రసన్నుడు అవుతాడు. ఆయన అనుగ్రహం కలిగితే జీవితం గురించి నిర్ణయాలు తీసుకోవడం నుండి చాలా విషయాల్లో మార్పులు వస్తాయి. ఊహించని విధంగా జీవితం మెరుగవుతుంది. అందుకోసం సోమవారం ఈ కింది పరిష్కారాలు ఆచరించాలి.

సోమవారం ఉదయాన్నే స్నానం, ధ్యానం చేసన తరువాత శివుడిని పూజించాలి. శివుడికి నల్ల నవ్వులు,  మారేడు దళాలు సమర్పించాలి. సుగంధ ద్రవ్యాన్ని నీటిలో కలిపి శివుడికి అభిషేకం చెయ్యాలి. ఇలా చేస్తే అన్ని రకాల గ్రహ దోషాల ప్రభావం తగ్గుతుంది.

జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నవారు చంద్రుడిని బలపరచడానికి సోమవారం రోజు శివుడికి పచ్చిపాలతో అభిషేకం చెయ్యాలి. ఇంకా సోమవారం రోజు తెల్లటి వస్తువును దానం చెయ్యం వల్ల చంద్రుడు బలపడతాడు.  శివుడి పూజ తరువాత పాలు, పెరుగు, అన్నం, పంచదార మొదలైన తెల్లని పదార్థాలు దానం చెయ్యాలి.

చంద్రుడు బలపడటానికి శివుడిని తెలుపు రంగు పువ్వులతో పూజించినా మంచి ఫలితం ఉంటుంది. అలాగే తెల్లని పువ్వులను నీటిలో వేసి సాయంత్రం సమయంలో చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చినా జాతకంలో చంద్రుడు బలపడతాడు.

జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉండటానికి మరొక కారణం ఉంది. అదే నీటిని వృధా చేయడం. నీటిని వృధా చేస్తే చంద్రుడి కరుణ తగ్గుముఖం పడుతుంది.  అలాగే తల్లికి సేవ చేయకున్నా చంద్రుడి కరుణ ఉండదు. కాబట్టి తల్లికి సేవలు చేస్తూ, నీటి వృధా అరికట్టే వారిపై చంద్రుడి కరుణ ఉంటుంది.

                                         *నిశ్శబ్ద.