మటన్ ఎగ్ ఫ్రై

 

 

మటన్ ఎగ్ ఫ్రై

కావలసిన పదార్థాలు :

మటన్ - 1 కిలో
గుడ్లు - 2
ధనియాలపొడి - 1 స్పూన్
జీలకర్ర - 1స్పూన్
సాల్ట్ - తగినంత
అల్లం - చిన్నముక్క
వెల్లుల్లి - 8 రెబ్బలు
గసగసాలు - 1 స్పూన్
లవంగాలు - 5
దాల్చిన చెక్క 3
యాలకులు - 2
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 4

పుల్లపెరుగు - ½ కప్పు
కారం - 1 స్పూన్
కరివేపాకు - కొద్దిగా
కొత్తిమీర - 1 కట్ట
జీడిపప్పు - కొద్దిగా
నూనె - 1.1/2 కప్పు

తయారు చేసే పద్ధతి :

ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, గసగసాలు, లవంగాలు, దాల్చిన చెక్క యాలకులు అన్నీ కలిపి ముద్ద నూరాలి. మాంసం ముక్కలుగా చేసి కడిగి పాత్రలో వేసి నూరిన మసాలా ముద్ద, సాల్ట్, కారం, పుల్లపెరుగు, బ్రేక్ చేసిన గుడ్లు బీట్ చేసి వేసి అన్నీ కలిపి అరగంట నానబెట్టాలి. పాన్ లో నూనె వేడి చేసి కరివేపాకు. పచ్చిమిర్చి, జీడిపప్పు, ధనియాలపొడి, జీలకర్ర పొడి వేసి సన్నసెగలో వేయించాలి. మధ్యలో కలుపుతూ ఎర్రగా వేగాక దించాలి.