అసలైన అలంకారము
అసలైన అలంకారము
శ్రోత్రం శ్రుతేనైవ న కుండలేన
దానేన పాణిర్న తు కంకణేన ।
విభాతి కాయః కరుణ పరాణాం
పరోపకారేణ న చందనేన ॥
కరుణ కలిగినవారి చెవులు జ్ఞానసంబంధమైన విషయాలను వినడం చేత ప్రకాశిస్తాయే కానీ కుండలాలతో కాదు. దానం చేయడం వల్ల వారి చేతులు శోభిస్తాయే కానీ కంకణాల చేత కాదు. అంతదాకా ఎందుకు! వారి శరీరం యావత్తూ పరోపకారంతో విరజమానం అవుతుందే కానీ గంధపుపూతల చేత కాదు!!!