పిచ్చివాళ్లు
పిచ్చివాళ్లు
ఒకాయన తన కారుని డ్రైవ్ చేస్తుండగా వాళ్లావిడ నుంచి ఫోన్ వచ్చింది.
‘ఏమండీ ఎక్కడున్నారు!’ కంగారుగా అడిగింది ఆవిడ.
‘విజయవాడ హైవే మీద. ఏంటి విషయం?’ అడిగాడు భర్త.
‘అయ్యో అనుకున్నదంతా అయ్యింది. విజయవాడ హైవే మీద ఎవరో పిచ్చివాడు రాంగ్ డైరక్షన్‌లో తోలుతూ అందరినీ గుద్దిపారేస్తున్నాడట. కాస్త జాగ్రత్తగా ఉండండి!’ అంది భార్య.
‘ఏడిసినట్లుంది. ఇదేం రోడ్డో కానీ, అందరూ నాకు రాంగ్ డైరక్షన్‌లోనే ఎదురొస్తున్నారు. మధ్యమధ్యలో కొంతమంది నా కారుకి గుద్దుకుంటున్నారు కూడా’ అని చిరాగ్గా ఫోన్ పెట్టేశాడు భర్త.