ఒక లక్షాధికారి మరణశయ్యపై ఉండి కొడుకులిద్దరిని పిలిచి " నేను
చనిపోయానని తెలిసి మీరేం చేస్తారు ?" అని అడిగాడు.
" ఆ వార్తా విని నేను వుంటానా ? నీ చితిమీదికి దూకేస్తా " అని బోరుమన్నాడు
పెద్దకొడుకు.
" అన్నయ్య కూడా చనిపోతున్నాడు కాబట్టి ఆస్థి మొత్తం నాపేరుమీద రాసేయ్యి
నాన్నా " అని గబుక్కున నాలిక్కరుచుకున్నాడు రెండో కొడుకు.
" ఆ..." అని ఆశ్చర్యంగా నోర్లు తెరిచారు తండ్రి, పెద్ద కొడుకు.