LATEST NEWS
మాజీ మంత్రి టీఅ. జీవన్ రెడ్డి బీఅర్ఎస్ గూటికి చేరారు. తన నివాసంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు ఆయనకు బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత జగిత్యాలకు తొలి పర్యటన సందర్భంగా బోర్నపల్లి వంతెన అంశంపై జీవన్ రెడ్డి చేసిన వినతి వెంటనే ఆమోదించిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు.
అలాగే చక్కెర కర్మాగారం అంశంపై జీవన్ రెడ్డి పోరాటం చేసిన సందర్భాన్ని కూడా ప్రస్తావించారు. జీవన్ రెడ్డి వంటి నాయకుడి చేరికతో బీఆర్ఎస్ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పని చేయాలనే ఆలోచనే తనకు ఆనందాన్నిస్తోందని జీవన్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ను కలిసి తన రాజకీయ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తానన్నారు.
లోకం మాధవి మిరాకిల్ అక్రమాల పరిస్థితి ఏంటి? ఆమె పదవికి గండం ఏర్పడనుందా? ఈసీ వరకూ చేరిన ఈ ఆరోపణల ప్రభావం ఎంత మేరకు ఉండొచ్చు? జనసేనకు ఇది మరో తలనొప్పి కానుందా? అన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాలలో జోరుగా సాగుతోంది.
ఔను నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశ మయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే అరవశ్రీధర్ వ్యవహారంతో సతమతమౌతున్న జనసేనకు ఇప్పుడు లోకం మాధవిపై వచ్చిన అవినీతి వ్యవహారాలు మరో తలపోటుగా పరిణమించాయని అంటున్నారు.
జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆమెకు చెందిన మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ చుట్టూ ముసురుతున్న వివాదాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వ్యవహారం ఆమె పదవికి ఎసరుపెడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. లోకం మాధవిపై ప్రధానంగా రెండు రకాల ఆరోపణలు వస్తున్నాయి. మొదటిది భూ ఆక్రమణలు. భోగాపురం సమీపంలో మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సంస్థ కోసం కేటాయించిన భూముల్లో అక్రమాలకు పాల్పడ్డారని, ప్రభుత్వ భూములను నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్నారని ఫిర్యాదులు అందాయి. ఇక రెండోది ఎన్నికల అఫిడవిట్ వివాదం. ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తులు, కంపెనీ లావాదేవీలు, బకాయిల వివరాలను తప్పుగా లేదా అసంపూర్తిగా చూపించారనేది మరో ఆరోపణ.
వైసీపీ నాయకులు, కొందరు సామాజిక కార్యకర్తలు ఆమె అఫిడవిట్‌లో సమాచారాన్ని దాచారంటూ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అఫిడవిట్‌లో ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇంతకీ ఆమె పదవికి గండం ఉందా? అంటే.. ప్రస్తుతానికి లోకంమాధవి పదవికి వచ్చిన తక్షణ ముప్పు ఏమీ లేదంటున్నారు. లోకం మాధవిపై వచ్చిన ఆరోపణలపై అంతర్గత విచారణ జరిగే అవకాశం ఉందంటున్నారు. ఇక పోతే మాధవి ఈ ఆరోపణలను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నారు. ఇవి రాజకీయ కక్ష సాధింపుతో చేస్తున్న ఆరోపణలనీ, తన సంస్థలన్నీ నిబంధనల ప్రకారమే నడుస్తున్నాయని ఆమె చెబుతున్నారు.
ఇక ఈ విషయంలో జనసేన పార్టీకి మాత్రం ఒకింత ఇబ్బందికరమైన పరిణామంగానే చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ అవినీతి రహిత రాజకీయాలు అని చెబుతుంటారు. అటువంటిది ఆయన పార్టీ ఎమ్మెల్యేపై ఇలాంటి ఆరోపణలు రావడం ప్రత్యర్థులకు.. మరీ ముఖ్యంగా వైసీపీకి ఒక విమర్శనాస్త్రంగా మారుతుంది. ఒకవేళ విచారణలో ప్రాథమిక ఆధారాలు దొరికితే, పార్టీ పరంగా ఆమెపై చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. గతంలో అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ పదవులను కోల్పోయిన ఉదాహరణలు ఉన్నాయి.
కానీ, మిరాకిల్ సంస్థల వ్యవహారం కార్పొరేట్ లావాదేవీలతో ముడిపడి ఉన్నందున, అందులోని సాంకేతిక అంశాలను విశ్లేషించడానికి సమయం పడుతుంది. ఈ వివాదం ఆమె రాజకీయ భవిష్యత్తును దెబ్బతీస్తుందా లేదా? అనేది రాబోయే విజిలెన్స్ నివేదికలు, కోర్టు విచారణలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇది లోకం మాధవికి మరియు జనసేన పార్టీకి ఒక రాజకీయ సవాల్ లాంటిదేనంటున్నారు పరిశీలకులు.
నారా లోకేష్ ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్-ఛార్జ్‌ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా కడప జిల్లా ఎమ్మెల్యేలు, నేతలపై లోకేష్ సీరియస్ అయ్యారు. వారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలకు గైర్హాజరు కావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.
మైదకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా లేరనీ, నియోజకవర్గ సమస్యలపై పట్టు కోల్పోతున్నారని లోకేష్ దగ్గర సమాచారం ఉండటంతో ఆయనపై సీరియస్ అయ్యారు. ఇటీవల పుట్టా సుధాకర్ యాదవ్ తనయుడు మహేష్ యాదవ్ డ్రగ్ టెస్టుల్లో పట్టుబడటం.. పార్టీకి మాయని మచ్చగా మారడం కూడా ఇందుకు ఒక కారణం అయి ఉండొచ్చని భావిస్తున్నారు.
ఇక ప్రొద్దటూరు ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి సీనియర్ నేత అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను సమన్వయం చేయడంలో విఫలమవుతున్నారని నారా లోకేష్ అన్నారు.అలాగే కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంటూ కూడా జనానికి అందుబాటులో ఉండటం లేదన్న ఫిర్యాదులున్నాయి.
ఇటీవల ఒక ఆకస్మిక తనిఖీ చేసినా అది బూమరాంగ్ కావడంతో.. పార్టీ అధిష్టానం ఆమెపై ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. మాధవిరెడ్డిపై వస్తున్న ఫిర్యాదులపై లోకేష్ వివరణ అడిగారని తెలుస్తున్నది. ధర్మవరం ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ తదితర నేతలపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి నారా లోకేష్. కొందరు నేతలు స్థానిక పోలీసు, రెవెన్యూ అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని, ఇందువల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని లోకేష్ మందలించినట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, సొంత వర్గాలను ప్రోత్సహించడంపైనా లోకేష్ సీరియస్ అయినట్టు సమాచారం. మైలవరం నియోజకవర్గంలోని పార్టీ అంతర్గత విభేదాలు, స్థానిక నేతల మధ్య గల ఆధిపత్య పోరుపై లోకేష్ గతంలోనే హెచ్చరికలు జారీ చేశారు.
ఎమ్మెల్యేలు లేదా ఇన్-ఛార్జ్‌లు ప్రజలకు అందుబాటులో లేకపోతే వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చే ప్రసక్తి లేదని లోకేష్ నిష్కర్షగా చెప్పినట్లు తెలుస్తోంది. ప్రతి మూడు నెలలకోసారి ఇచ్చే పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఆధారంగానే భవిష్యత్తు ఉంటుందన్న వార్నింగ్ కూడా లోకేష్ నుంచి వారికి వెళ్లిందని చెబుతున్నారు. ఇసుక, భూ దందాల వంటి వాటిలో ఎవరి పేరు వినిపించినా ఉపేక్షించేది లేదన్నారని చెబుతున్నారు. మొత్తానికి, ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెంచే క్రమంలో సొంత పార్టీ నేతలైనా సరే తప్పు చేస్తే వదిలిపెట్టేది లేదన్న సంకేతాన్ని ఈ హెచ్చరికల ద్వారా లోకేష్ ఇచ్చారని చెబుతున్నారు.
ALSO ON TELUGUONE N E W S
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నిర్మాతగా మారి, క ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన మూవీ ‘తిమ్మరాజుపల్లి టీవీ’ (Thimmarajupalli TV). మునిరాజు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఏప్రిల్ 17న థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు.
ఒక టీవీ చుట్టూ తిరిగే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా రూపొందిందని ట్రైలర్ చూస్తుంటే స్పష్టమవుతోంది. ఈ సినిమా ఒక పల్లెటూరి నేపథ్యంలో సాగే వింటేజ్ డ్రామాగా కనిపిస్తోంది. ఊర్లోకి మొదటిసారి 'టీవీ' రావడం, ఆ టీవీ చుట్టూ జరిగే రాజకీయం, పంతాలు, వినోదాన్ని ఇందులో చూపించారు.
ట్రైలర్ ప్రారంభం నుంచే పల్లెటూరి వాతావరణం, అక్కడి మనుషుల మధ్య ఉండే వైషమ్యాలను చాలా నేచురల్ గా చూపించారు. ఊరి జనం అంతా చందాలు వేసుకుని శివరాత్రి పండుగ కోసం సతీష్ అనే వ్యక్తి ద్వారా ఊరికి టీవీని తెప్పిస్తారు. ఆ టీవీలో ఏ సినిమా చూడాలి అనే దానిపై ఊరి జనాల మధ్య జరిగే సరదా సంభాషణలు ఆకట్టుకుంటాయి.
ఊరి పెద్దగా చలామణి అయ్యే రాజప్ప.. సతీష్ టీవీ తీసుకురావడాన్ని తన గౌరవానికి భంగంగా భావిస్తాడు. "ఊర్లో ఏది తెచ్చినా ఫస్ట్ నేనే తెచ్చేవాడిని" అనే ఇగో అతని పాత్రలో కనిపిస్తుంది. టీవీ రాకతో ఊర్లో మనుషుల మధ్య గొడవలు మొదలవుతాయి. ముఖ్యంగా సాయి తేజ్, వేధ జలంధర్, వి. మునిరాజు పోషించిన పాత్రల మధ్య సాగే డైలాగ్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. “వచ్చే శివరాత్రి లోపల టీవీకి సంబంధించిన వాళ్ళని తెచ్చి పంచాయతీ పెట్టకపోతే.. ఒంటి మీద నూలుపోగు లేకుండా తిరుగుతా” అంటూ సాగే డైలాగ్స్ సినిమాలోని ఘర్షణ వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
ట్రైలర్ లో గమనిస్తే, తిమ్మరాజుపల్లి అనే ఊరికి టీవీ రావడం అనేది ఒక పెద్ద సెలబ్రేషన్ లా చూపించారు. అయితే, అదే టీవీ వల్ల ఊరి పెద్దలకు, హీరోకి మధ్య వచ్చిన గొడవలు ఏంటి? రాజప్ప అనే పాత్రతో హీరోకి ఉన్న వైరం ఏమిటి? అనే విషయాలు సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఒక సాధారణ టీవీ మనుషుల మధ్య ఎలా చిచ్చు పెట్టింది అనే పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
సాయి తేజ్ పల్లెటూరి యువకుడిగా సహజంగా కనిపిస్తున్నాడు. ట్రైలర్‌లో విజువల్స్ చాలా నేచురల్‌గా ఉన్నాయి. ట్రైలర్ లో వినిపించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంది.
మొత్తానికి, ఒక చిన్న పల్లెటూరిలో టీవీ ఎంతటి మార్పులు తెచ్చింది, అది ఆ ఊరి మనుషుల జీవితాలను ఎలా ప్రభావితం చేసింది అనే పాయింట్‌తో ఈ సినిమా ఆసక్తికరంగా సాగనుంది.
టాలీవుడ్‌లో విభిన్నమైన కథాంశాలతో, థ్రిల్లర్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్ సెట్ చేసుకున్న హీరో అడివి శేష్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటించిన లేటెస్ట్ మూవీ ‘డెకాయిట్’ విడుదలకు సర్వం సిద్ధమైంది. ఏప్రిల్ 10న ఈ సినిమా భారీ స్థాయిలో థియేటర్లలోకి వస్తున్న నేపథ్యంలో, అడివి శేష్ తన తదుపరి ప్రాజెక్ట్ ‘గూఢచారి 2’ (G2) గురించి మరియు తనకు వస్తున్న బాలీవుడ్ ఆఫర్ల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ‘గూఢచారి 2’ సినిమా మరో మూడు నెలల్లోనే విడుదల కాబోతుందనే వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై అడివి శేష్ స్పష్టత ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని, ముఖ్యంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా బ్యాలెన్స్ ఉన్నాయని ఆయన తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో, హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని చిత్ర బృందం భావిస్తోంది. అందుకే ఈ ఏడాది చివరలో మాత్రమే ‘G2’ ప్రేక్షకుల ముందుకు వస్తుందని శేష్ స్పష్టం చేశారు.
‘మేజర్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న శేష్‌కు బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్లు వెల్లువెత్తాయి. ఏకంగా ఆరు పెద్ద ప్రాజెక్టులు ఆయన వద్దకు వచ్చాయట. ఇందులో నాలుగు వార్ సినిమాలు, రెండు బయోపిక్‌లు ఉన్నాయి. కానీ, శేష్ ఈ ఆఫర్లన్నింటినీ సున్నితంగా తిరస్కరించారు. ఒకే రకమైన పాత్రలకు పరిమితం అవ్వడం తనకు ఇష్టం లేదని, ముఖ్యంగా ‘మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథను వెండితెరపై ఆవిష్కరించిన తర్వాత మళ్లీ అటువంటి బయోపిక్‌లు లేదా యుద్ధ సినిమాలు చేయాలని అనిపించడం లేదని ఆయన చెప్పుకొచ్చారు.
ప్రస్తుతానికి తన పూర్తి ఫోకస్ అంతా ‘G2’ పైనే ఉందని, ఈ సినిమా ప్రేక్షకులకు ఒక సరికొత్త యాక్షన్ అనుభూతిని ఇస్తుందని శేష్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో వచ్చిన ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘హిట్ 2’ వంటి సినిమాలతో మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న ఆయన, ఇప్పుడు ‘డెకాయిట్’ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యారు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక సోషల్ మీడియాలోనూ అడివి శేష్ నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. కేవలం అవకాశాల కోసం కాకుండా, వైవిధ్యమైన కథల కోసం ఎదురుచూడటం గొప్ప విషయమని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రేపు విడుదల కాబోతున్న ‘డెకాయిట్’ ఫలితం ఎలా ఉండబోతుందో, అలాగే ఈ ఏడాది చివరలో రానున్న ‘G2’ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.
The ongoing dispute between actor Silambarasan and producer Isari Ganesh has finally reached an amicable resolution. The issue, which had halted the progress of his upcoming film Arasan and his ad film shoots, was settled after the actor's parents, T. Rajender and Usha Rajender, held direct discussions with the producer.
To clear the roadblocks, a total compensation of ₹6.5 crores was agreed upon. Simbu will pay ₹4 crores towards the settlement, while Arasan producer Thanu will cover the remaining ₹2.5 crores. With this major hurdle cleared, Simbu is ready to resume his work without further delays. He will first complete his pending commitments for an ad film.
Following that, he will return to the sets of Arasan. Director Vetrimaaran has planned long, continuous schedules to wrap up the project quickly, aligning with Simbu's goal to have at least two theatrical releases next year.
Simbu will start his next film with director Aswath Marimuthu, known for Oh My Kadavule and Dragon, post Arasan. The director has already completed the script, and shooting is expected to begin around August or September this year, bringing the recent roadblocks to a definitive end.
Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
-రీసెంట్ గా ఆంధ్రా యూనివర్సిటీకి వెళ్లిన పవన్
-సుదీర్ఘ ప్రసంగం
-అర్హత లేదనే అవసరం ఎందుకొచ్చింది
రావడం లేట్ అవ్వచ్చేమో గాని రావడం మాత్రం పక్కా అని పవర్ స్టార్, డిప్యూటీ సిఏం చెప్పినట్టుగానే పవన్ కళ్యాణ్(Pawan Kalyan)న్యూస్ సోషల్ మీడియాలో సందడి చేయడానికి రావడం లేట్ అవ్వచ్చేమో గాని వచ్చాక దాని తీవ్రత ఎలా ఉంటుందో అందరకి బాగా తెలుసు. మరి లేటు చెయ్యకుండా ఆ సందడి చేస్తున్న న్యూస్ ఏంటో చూద్దాం.
రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఆంధ్రా యూనివర్సిటీ విశాఖపట్నంలో జరిగిన మెగా కల్చరల్ ఫీస్ట్ కి హాజరయ్యాడు. ఈ సందర్భంగా ప్రసంగిస్తు యూనివర్సిటీలోకి రావడానికి అర్హత లేదు. ఎందుకంటే మేధస్సుతో నేను పోటీ పడలేను. మనుషులని కదిలించేది సమాజాన్ని ముందుకు నడిపించేది యూనివర్సిటీలే. అలాంటి మహానుభావులు వ్యవస్థని ప్రతిష్ఠించిన వ్యవస్థకి అతిధిగా రావడానికి అర్హత ఉందా అనిపిస్తుంది. కానీ మీరు ప్రేమతో పిలిస్తే వచ్చానని చెప్పాడు. ఇప్పుడు పవన్ తాలూకు స్పీచ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
also read: Rajasekhar: ఎమోషనల్ తో కన్నీళ్లు పెట్టుకున్న రాజశేఖర్
అభిమానులు స్పందిస్తు జ్ఞానం ముమ్మాటికి గొప్పదే. కానీ ఎలాంటి కల్మషం లేని మంచి మనసు అంతకంటే గొప్పది. ఆ మంచి మనసే మంచి సమాజానికి బీజం ఇస్తుందనే కామెంట్స్ చేస్తున్నారు
- భారీ ఖర్చుకు వెనుకాడుతున్న నాగవంశీ
- యానిమేషన్ సినిమాకి ఓటీటీ షాక్..
- నాగవంశీ ఆలోచన ఇదేనా!
టాలీవుడ్‌లో ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులకు కొదవలేదు. ముఖ్యంగా సోషియో ఫాంటసీ, మైథాలజీ అంశాలతో కూడిన సినిమాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలోనే 'కార్తికేయ 2' వంటి పాన్ ఇండియా హిట్‌తో సత్తా చాటిన టాలెంటెడ్ డైరెక్టర్ చందూ మొండేటి, హనుమంతుడి ఇతివృత్తంతో 'వాయుపుత్ర' అనే యానిమేషన్ చిత్రాన్ని ప్రకటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో ప్లాన్ చేసింది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఇప్పుడు అనిశ్చితిలో పడినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
వాయుపుత్ర సినిమాకు సంబంధించి బడ్జెట్ లెక్కలు నిర్మాతలకు ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారాయని తెలుస్తోంది. పూర్తి స్థాయి యానిమేషన్, హై క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాలంటే దాదాపు 50 కోట్ల రూపాయలకు పైగా ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా. ఇటీవలే యానిమేషన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన కొన్ని చిత్రాలు సక్సెస్ కావడంతో ఈ సినిమాపై మేకర్స్ ఆశలు పెట్టుకున్నారు. కానీ, ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు చూస్తుంటే అంత భారీ మొత్తాన్ని వెచ్చించడం రిస్క్ అని భావిస్తున్నారట.
ముఖ్యంగా డిజిటల్ రైట్స్ విషయంలో చిత్ర యూనిట్‌కు ఊహించని షాక్ తగిలినట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌తో నిర్వహించిన చర్చల్లో కేవలం 15 నుంచి 20 కోట్ల రూపాయల వరకు మాత్రమే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. సినిమా మేకింగ్ ఖర్చులో ఇది సగం కూడా కాకపోవడంతో నిర్మాత నాగవంశీ డైలమాలో పడ్డారు. మిగిలిన భారీ మొత్తాన్ని కేవలం థియేట్రికల్ వసూళ్ల మీద నమ్ముకుని ఇన్వెస్ట్ చేయడం క్షేమకరం కాదని ఆయన అభిప్రాయపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
దర్శకుడు చందూ మొండేటి గతంలో 'కార్తికేయ 2'తో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమాలో కృష్ణుడి తత్త్వాన్ని చూపించిన తీరుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అదే నమ్మకంతో హనుమంతుడిపై ఒక విజువల్ వండర్ చేయాలని ఆయన భావించారు. కానీ ఇప్పుడు బడ్జెట్ మరియు ఓటీటీ బిజినెస్ మధ్య సమతుల్యత కుదరకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టాలని (Hold) నిర్ణయించుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.
సినిమా రంగంలో ప్రస్తుతం పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. కంటెంట్ బాగుంటే ఆదరణ దక్కుతున్నప్పటికీ, యానిమేషన్ సినిమాలకు మార్కెట్ ఇంకా పూర్తి స్థాయిలో స్థిరపడలేదు. దీంతో ఇంత పెద్ద సాహసం చేయడం అవసరమా అని నిర్మాతలు ఆలోచిస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందా లేదా కేవలం వాయిదా మాత్రమే పడిందా అనే విషయంపై సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు.
టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.
జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.
చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది.
"ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు.
సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు.
గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.
*నిశ్శబ్ద.
ఏదయినా ఒక వస్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు చేజారి పడి పగిలిపోయినా, దొంగతనం జరిగినా, ఎక్కడో మర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొందలేమని దిగులు పట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్టమయిన పెయింటింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దూరమయింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడగలి గింది.
అదంటే మరి ఆమెకు ప్రాణ సమానం. చాలా కాలం దొరుకుతుందని, తర్వాత ఇక దొరకదేమో అనీ ఎంతో బాధపడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గతేడాది ఆమెను చేరింది. ఆమెది నెదర్లాండ్స్. ఆమె తండ్రి నెదర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విషయానికి వస్తే.. అది 1683లో కాస్పర్ నెషర్ వేసిన స్టీవెన్ ఓల్టర్స్ పెయింటింగ్.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల ఆదేశాలను చార్లెట్ తండ్రి వ్యతిరేకించారు. ఆయన రహస్య జీవనం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం తన నగరంలోని ఒక బ్యాంక్‌లో భద్ర పరచమని ఇచ్చారట. 1940లో నాజీలు నెదర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద పడి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పెయింటింగ్ ఎక్కడున్నదీ ఎవరికీ తెలియలేదు. చిత్రంగా 1950ల్లో డసల్‌డార్ష్ ఆర్ట్ గ్యాలరీలో అది ప్రత్యక్షమయింది. 1969లో ఆమ్‌స్టర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాలరీలో వుందని చూసినవారు చెప్పారు. వేలంపాట తర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక కళాపిపాసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.
మొత్తానికి వూహించని విధంగా ఎంతో కాలం దూరమయిన గొప్ప కళాఖండం తిరిగి తన వద్దకు చేరడంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే కదా.. పోయిందనుకున్న గొప్ప వస్తువు తిరిగి చేరితే ఆ ఆనందమే వేరు! అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భద్రంగా చూసుకునే ఆసక్తి వున్నప్పటికీ శక్తి సామర్ధ్యాలు లేవు. అందుకనే త్వరలో ఎవరికయినా అమ్మేసీ వచ్చిన సొమ్మును పిల్లలకు పంచుదామనుకుంటోందిట! చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు వున్నారు. అలాగే ఇరవై మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అందరం ఒకే కుటుంబం, చాలాకాలం తర్వాత ఇల్లు చేరిన కళాఖండం మా కుటుంబానిది అన్నది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు.
చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్ విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది.
ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.
అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి 15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్ పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు.
అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో, ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది.
మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.
అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు ఒకే సారి ఆయన మీద విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.
రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .
దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.
ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు. వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .
ప్రపంచంలో అన్ని రకాల మనుషులు ఉంటారు. మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను లేదా మన చుట్టూ ఉండే గొప్ప వ్యక్తులు లేదా శక్తివంతమైన వ్యక్తులను గమనిస్తే... గొప్ప వ్యక్తులలో ఉండే అతిగొప్ప లక్షణం తక్కువ మాట్లాడటం. తక్కువ మాట్లాడేవాడు తన చేతల్లోనే తన విజయాన్ని చూపిస్తాడు అని తరచుగా చెబుతూ ఉంటారు కూడా. ఇతరుల కంటే తక్కువ మాట్లాడేవారే ఎక్కువ తెలివైనవారని, జ్ఞానులని ఎందుకు అంటారు? తక్కువ మాట్లాడేవారు ఎందుకు ప్రత్యేకమైనవారిగా పరిగణించబడతారు? తక్కువ మాట్లాడటం అనేది గొప్ప లక్షణంగా ఎందుకు పరిగణించబడుతుంది? వివరంగా తెలుసుకుంటే..
తక్కువ మాట్లాడితే మాట విలువ పెరుగుతుంది..
ఎప్పుడూ మాట్లాడుతూ ఉండే వ్యక్తులపై చుట్టూ ఉన్నవారు శ్రద్ధ పెట్టడం తగ్గిస్తారట.చాలా తక్కువగా మాట్లాడే వ్యక్తి మాట్లాడినా కూడా ప్రజలు శ్రద్ధగా వింటారు. తక్కువ మాట్లాడటం వల్ల వ్యక్తి మాటలకు విలువ పెరిగి, సమాజంలో వారికి మరింత గౌరవం లభిస్తుందని ఆచార్య చాణక్యుడు చెబుతాడు.
ఆలోచనా శక్తి..
తక్కువ మాట్లాడేవారు తమ మెదడును ఎక్కువగా ఉపయోగిస్తారు. వారు స్పందించడానికి తొందరపడరు. ముందుగా పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుని, ఆ తర్వాతే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే వారు కరెక్ట్ గా నిర్ణయాలు తీసుకున్నారని అందరూ ఒప్పుకునే విధంగా ఉంటాయి. సమాజం కూడా ఇలా తక్కువ మాట్లాడే వారికి చాలా తెలివైన వారు అని చెబుతూ ఉంటుంది.
ఆత్మవిశ్వాసం..
తక్కువ మాట్లాడేవారు ఆర్భాటాలు చేయరు. వారికి తమపై పూర్తి విశ్వాసం ఉంటుంది, కాబట్టి ఇతరులను ఆకట్టుకోవడానికి పనికిమాలిన మాటలు మాట్లాడరు. ఇలా నిశ్శబ్దంగా ఉండే స్వభావమే వారి నిజమైన బలం అవుతుందని చాణక్యుడు అంటాడు. తక్కువ మాట్లాడినప్పుడు వారిలో ఎన్నో విషయాలు వారిలోనే రహస్యంగా ఉండిపోతాయి. అదే ఎప్పుడూ మాట్లాడేవారు ఏ చిన్న సంఘటన జరిగినా బయటకు చెప్పేసుకుంటారు. దీని వల్ల వారికి విలువ, గౌరవం తగ్గిపోతుంది.
అర్థం చేసుకునే అవకాశం..
తక్కువ మాట్లాడటం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఇతరుల మాటలను వినడానికి అవకాశం లభించడం. ఇతరులు చెప్పేది బాగా వినగలిగే వ్యక్తి మాత్రమే ఇతరుల బలహీనతలను, అవసరాలను అర్థం చేసుకోగలరని చాణక్యుడు చెబుతాడు. మౌనంగా ఉండి ఇతరుల మాటలను విన్నప్పుడు, వారి ఆలోచనలపై ఒక అవగాహన ఏర్పడుతుంది. ఇది నిర్ణయాలు తీసుకోవడానికి, విజయం సాధించడానికి అత్యంత కీలకం అవుతుంది.
*రూపశ్రీ.
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది. చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని, దాన్ని సాధించి, విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది. అయితే.. విజయం సాధించడానికి కష్టపడితే సరిపోతుందని తెలివి ఉంటే చాలని అనుకుంటారు అందరూ. కానీ విజయం సాధించడానికి తెలివి తేటలు, కష్టపడే తత్వం ఉన్నా.. కొన్ని అలవాట్లు మాత్రం వారికి విజయాన్ని దూరంగానే ఉంచుతాయి. కొన్ని అలవాట్లు ఉన్న వ్యక్తి జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేడని సాక్షత్తు ఆచార్య చాణక్యుడే చెబుతాడు. ఒక వ్యక్తిని విజయం సాధించకుండా చేసే ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే..
సోమరితనం..
కష్టపడే వ్యక్తులలో సోమరితనం ఉంటుందా అని చాలా మంది ఆశ్చర్యపోతారు. కానీ ఇది నిజం.. కష్టపడే వ్యక్తులలో ఎంతో కొంత సోమరితనం కనిపిస్తూ ఉంటుంది. అయితే ఏదో ఒక సందర్బంలో ఈ సోమరితనం వారిని దెబ్బతీస్తుంది. కీలకమైన సందర్బంలో ఏ విషయాన్ని అయినా లైట్ తీసుకుంటే లేదా పనిని నిర్లక్ష్యం చేస్తే.. చేతుల దాకా వచ్చిన విజయం కూడా చేజారిపోతుంది. అందుకే.. ఏ కొద్దిపాటి సోమరితనం ఉన్నా, దాన్ని వదిలిపెట్టడం మంచిది.
పట్టుదల..
పట్టుదల ఏ పనిలో అయినా ముందుకు సాగడానికి, పనిని పూర్తీ చేయడానికి ప్రేరణ ఇస్తుంది. కానీ చాలామంది ఏదైనా పనిని మొదలు పెట్టినప్పుడు చాలా సీరియస్ గా ప్రారంభించి కష్టపడతారు.. ఆ తరువాత మాత్రం తమ పట్టుదలను తగ్గిస్తారు. దీని వల్ల దక్కాల్సిన విజయం చెయ్యి జారిపోతుంది.
ప్రవర్తన..
మనిషి ప్రవర్తన కూడా వారు పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. చాలామంది ఇతరులతో అమర్యాదగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వ్యక్తులను చుట్టుప్రక్కల వారు, సమాజం ఎప్పటికీ ఇష్టపడదు, వారికి గౌరవం ఇవ్వదు, వారు చేసే పనులలో తోడ్పాటు, వారు చేసే పనులకు గౌరవం కూడా ఇవ్వదు. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవారు తమ పనుల విషయంలో కూడా నెగెటివ్ ఫలితాలు పొందుతారు.
*రూపశ్రీ.
మంచి, చెడు ప్రతి మనిషిలోనూ తప్పకుండా ఉండే గుణాలు. మనుషులు కొన్ని విషయాల్లో మంచిగా, మరికొన్ని విషయాల్లో చెడ్డగా ఉంటారు. పూర్తీగా మంచితనం ఉన్న మనుషులు, పూర్తీగా చెడ్డగా ఉన్న మనుషులు ఎక్కడా ఉండరు. అయితే మనిషి తన స్వార్థం కోసం ఇతరులను ఇబ్బంది పెడుతూ, ఇతరులకు నష్టం కలిగిస్తూ, ఇతరుల జీవితాలు నాశనం అవుతున్నా తనకు అది అనవసరం అనుకునే స్థాయిలో కొందరు ఉంటారు. వారికి కేవలం తమ క్షేమం, తమ సంతోషం మాత్రం ముఖ్యం. అలాంటి వారిని సింపుల్ గా అవకాశవాదులు అని కూడా అంటారు. కానీ ఇలాంటి వారు తమలో ఉన్న స్వార్థం, అవకాశవాదం బయటకు కనిపించకుండా మంచితనం అనే ముసుగు వేసుకుని ఉంటారు. అలాంటి వ్యక్తులను గుర్తించడం చాలా ముఖ్యం. మంచితనం ముసుగు ధరించిన చెడ్డ వ్యక్తులలో కనిపించే కొన్న లక్షణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. వారిని గుర్తించి జాగ్రత్త పడవచ్చు..
మంచితనం ముసుగు వేసుకున్న వ్యక్తుల లక్షణాలు..
కొంతమంది ప్రతి విషయంలో ఇతరులను విమర్శిస్తూ, ఆలోచించకుండానే తమ అభిప్రాయాలను ఏర్పరచుకుంటారు. వారి మాటలు కొన్నిసార్లు ఎంత కఠినంగా ఉంటాయంటే, అవి ఎదుటివారి మనసును గాయపరుస్తాయి.
తమ తప్పులను ఒప్పుకోకుండా, ఇతరులను నిందించే వారు ఉంటారు. తాము చెప్పిందే సరైనదని నిరూపించుకోవడమే వారికి ముఖ్యం.
ఇతరులను, ఇతరుల అభిప్రాయాలను గౌరవించరు, వాటిని పట్టించుకోరు. వారి ప్రవర్తన కేవలం వారి ప్రాధాన్యత, వారికి నచ్చిన విషయాలే అయి ఉండాలని అనుకుంటారు.
కృతజ్ఞత అనేది వీరిలో కొంచెమైనా ఉండదు. ఎప్పుడూ ప్రతికూలతపైనే దృష్టి పెడతారు. ఏ విషయంలో అయినా సరే.. మంచిని చూడటం కంటే ఫిర్యాదు చేయడానికి, నెగెటివ్ గా మాట్లాడటానికి ఇష్టపడతారు.
మంచితనం అనే ముసుగు వేసుకున్నవారు ఎవరికీ ఇచ్చిన మాటలను నిలబెట్టుకోరు. మాట దాటేస్తుంటారు. అవకాశం కోసం మాటలు ఇవ్వడం తర్వాత మాట తప్పడం వీరి దృష్టిలో అస్సలు తప్పు కాదు. ఒకవేళ తప్పిన మాట గురించి మాట్లాడితే ఎదురుదాడి చేసి మాట్లాడతారు.
సరదా లేదా ఫన్ పేరుతో ఇతరులను ఎగతాళి చేయడం, కించపరిచి మాట్లాడటం వీరి గుణం. ఇలాంటివి పదే పదే చేస్తూ ఉంటే.. వారు మంచితనం ముసుగు వేసుకున్న చెడ్డ వ్యక్తుని అర్థం చేసుకోవచ్చు.
తాము ఇతరుల కన్నా గొప్ప అని భావించుకుంటూ, తమ ఆధిక్యతను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. పైగా ఇతరులను తక్కువగా అంచనా వేస్తారు. తక్కువ చేసి మాట్లాడతారు.
పాత పగలను మనసులో పెట్టుకుంటారు, ఎవ్వరినీ క్షమించరు. చిన్న చిన్న తప్పులను కూడా చాలా కాలం గుర్తుంచుకుంటారు.
గాసిప్స్ చెప్పుకోవడం, ఇతరుల వ్యక్తిగత సమాచారాన్ని అందరికీ చేరవేడం, అందరి దృష్టిలో ఇతరులను చెడ్డ చేయడం అంటే వీరికి చాలా సంతోషం కలిగించే విషయం.
చిన్న విషయాల్లో కూడా అబద్ధాలు చెబుతూ ఉంటారు. ఇలాంటి అబద్దాలు విని విని అవి సహజం అనుకునే వారు ఏదో ఒకరోజు వీరి ద్వారా చాలా పెద్ద మోసాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఇది క్రమంగా సంబంధాలలో నమ్మకాన్ని దెబ్బతీస్తుంది.
*రూపశ్రీ.
మాజీ మంత్రి టీఅ. జీవన్ రెడ్డి బీఅర్ఎస్ గూటికి చేరారు. తన నివాసంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు ఆయనకు బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత జగిత్యాలకు తొలి పర్యటన సందర్భంగా బోర్నపల్లి వంతెన అంశంపై జీవన్ రెడ్డి చేసిన వినతి వెంటనే ఆమోదించిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు.
అలాగే చక్కెర కర్మాగారం అంశంపై జీవన్ రెడ్డి పోరాటం చేసిన సందర్భాన్ని కూడా ప్రస్తావించారు. జీవన్ రెడ్డి వంటి నాయకుడి చేరికతో బీఆర్ఎస్ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పని చేయాలనే ఆలోచనే తనకు ఆనందాన్నిస్తోందని జీవన్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ను కలిసి తన రాజకీయ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తానన్నారు.
లోకం మాధవి మిరాకిల్ అక్రమాల పరిస్థితి ఏంటి? ఆమె పదవికి గండం ఏర్పడనుందా? ఈసీ వరకూ చేరిన ఈ ఆరోపణల ప్రభావం ఎంత మేరకు ఉండొచ్చు? జనసేనకు ఇది మరో తలనొప్పి కానుందా? అన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాలలో జోరుగా సాగుతోంది.
ఔను నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశ మయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే అరవశ్రీధర్ వ్యవహారంతో సతమతమౌతున్న జనసేనకు ఇప్పుడు లోకం మాధవిపై వచ్చిన అవినీతి వ్యవహారాలు మరో తలపోటుగా పరిణమించాయని అంటున్నారు.
జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆమెకు చెందిన మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ చుట్టూ ముసురుతున్న వివాదాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వ్యవహారం ఆమె పదవికి ఎసరుపెడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. లోకం మాధవిపై ప్రధానంగా రెండు రకాల ఆరోపణలు వస్తున్నాయి. మొదటిది భూ ఆక్రమణలు. భోగాపురం సమీపంలో మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సంస్థ కోసం కేటాయించిన భూముల్లో అక్రమాలకు పాల్పడ్డారని, ప్రభుత్వ భూములను నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్నారని ఫిర్యాదులు అందాయి. ఇక రెండోది ఎన్నికల అఫిడవిట్ వివాదం. ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తులు, కంపెనీ లావాదేవీలు, బకాయిల వివరాలను తప్పుగా లేదా అసంపూర్తిగా చూపించారనేది మరో ఆరోపణ.
వైసీపీ నాయకులు, కొందరు సామాజిక కార్యకర్తలు ఆమె అఫిడవిట్‌లో సమాచారాన్ని దాచారంటూ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అఫిడవిట్‌లో ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇంతకీ ఆమె పదవికి గండం ఉందా? అంటే.. ప్రస్తుతానికి లోకంమాధవి పదవికి వచ్చిన తక్షణ ముప్పు ఏమీ లేదంటున్నారు. లోకం మాధవిపై వచ్చిన ఆరోపణలపై అంతర్గత విచారణ జరిగే అవకాశం ఉందంటున్నారు. ఇక పోతే మాధవి ఈ ఆరోపణలను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నారు. ఇవి రాజకీయ కక్ష సాధింపుతో చేస్తున్న ఆరోపణలనీ, తన సంస్థలన్నీ నిబంధనల ప్రకారమే నడుస్తున్నాయని ఆమె చెబుతున్నారు.
ఇక ఈ విషయంలో జనసేన పార్టీకి మాత్రం ఒకింత ఇబ్బందికరమైన పరిణామంగానే చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ అవినీతి రహిత రాజకీయాలు అని చెబుతుంటారు. అటువంటిది ఆయన పార్టీ ఎమ్మెల్యేపై ఇలాంటి ఆరోపణలు రావడం ప్రత్యర్థులకు.. మరీ ముఖ్యంగా వైసీపీకి ఒక విమర్శనాస్త్రంగా మారుతుంది. ఒకవేళ విచారణలో ప్రాథమిక ఆధారాలు దొరికితే, పార్టీ పరంగా ఆమెపై చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. గతంలో అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ పదవులను కోల్పోయిన ఉదాహరణలు ఉన్నాయి.
కానీ, మిరాకిల్ సంస్థల వ్యవహారం కార్పొరేట్ లావాదేవీలతో ముడిపడి ఉన్నందున, అందులోని సాంకేతిక అంశాలను విశ్లేషించడానికి సమయం పడుతుంది. ఈ వివాదం ఆమె రాజకీయ భవిష్యత్తును దెబ్బతీస్తుందా లేదా? అనేది రాబోయే విజిలెన్స్ నివేదికలు, కోర్టు విచారణలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇది లోకం మాధవికి మరియు జనసేన పార్టీకి ఒక రాజకీయ సవాల్ లాంటిదేనంటున్నారు పరిశీలకులు.
నారా లోకేష్ ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్-ఛార్జ్‌ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా కడప జిల్లా ఎమ్మెల్యేలు, నేతలపై లోకేష్ సీరియస్ అయ్యారు. వారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలకు గైర్హాజరు కావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.
మైదకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా లేరనీ, నియోజకవర్గ సమస్యలపై పట్టు కోల్పోతున్నారని లోకేష్ దగ్గర సమాచారం ఉండటంతో ఆయనపై సీరియస్ అయ్యారు. ఇటీవల పుట్టా సుధాకర్ యాదవ్ తనయుడు మహేష్ యాదవ్ డ్రగ్ టెస్టుల్లో పట్టుబడటం.. పార్టీకి మాయని మచ్చగా మారడం కూడా ఇందుకు ఒక కారణం అయి ఉండొచ్చని భావిస్తున్నారు.
ఇక ప్రొద్దటూరు ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి సీనియర్ నేత అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను సమన్వయం చేయడంలో విఫలమవుతున్నారని నారా లోకేష్ అన్నారు.అలాగే కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంటూ కూడా జనానికి అందుబాటులో ఉండటం లేదన్న ఫిర్యాదులున్నాయి.
ఇటీవల ఒక ఆకస్మిక తనిఖీ చేసినా అది బూమరాంగ్ కావడంతో.. పార్టీ అధిష్టానం ఆమెపై ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. మాధవిరెడ్డిపై వస్తున్న ఫిర్యాదులపై లోకేష్ వివరణ అడిగారని తెలుస్తున్నది. ధర్మవరం ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ తదితర నేతలపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి నారా లోకేష్. కొందరు నేతలు స్థానిక పోలీసు, రెవెన్యూ అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని, ఇందువల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని లోకేష్ మందలించినట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, సొంత వర్గాలను ప్రోత్సహించడంపైనా లోకేష్ సీరియస్ అయినట్టు సమాచారం. మైలవరం నియోజకవర్గంలోని పార్టీ అంతర్గత విభేదాలు, స్థానిక నేతల మధ్య గల ఆధిపత్య పోరుపై లోకేష్ గతంలోనే హెచ్చరికలు జారీ చేశారు.
ఎమ్మెల్యేలు లేదా ఇన్-ఛార్జ్‌లు ప్రజలకు అందుబాటులో లేకపోతే వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చే ప్రసక్తి లేదని లోకేష్ నిష్కర్షగా చెప్పినట్లు తెలుస్తోంది. ప్రతి మూడు నెలలకోసారి ఇచ్చే పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఆధారంగానే భవిష్యత్తు ఉంటుందన్న వార్నింగ్ కూడా లోకేష్ నుంచి వారికి వెళ్లిందని చెబుతున్నారు. ఇసుక, భూ దందాల వంటి వాటిలో ఎవరి పేరు వినిపించినా ఉపేక్షించేది లేదన్నారని చెబుతున్నారు. మొత్తానికి, ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెంచే క్రమంలో సొంత పార్టీ నేతలైనా సరే తప్పు చేస్తే వదిలిపెట్టేది లేదన్న సంకేతాన్ని ఈ హెచ్చరికల ద్వారా లోకేష్ ఇచ్చారని చెబుతున్నారు.
వేసవి కాలంలో శరీరానికి నీరు చాలా అవసరం. నీటి కొరత ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి రోజుకు 8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగమని వైద్యులు తరచుగా సలహా ఇస్తారు. అదనంగా మజ్జిగ లేదా కొబ్బరి నీళ్లు త్రాగమని కూడా సిఫార్సు చేస్తారు. కొందరు ఆరోగ్యానికి కొబ్బరి నీరు బెటర్ అని చెబితే.. మరికొందరు మజ్జిగ చాలా మంచిది అంటారు. ఈ రెండూ ఆరోగ్యకరమైనవే.. అయినప్పటికీ రెండింటిలో కూడా ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది అనే విషయం దగ్గర చాలా మంది కన్ప్యూజ్ అవుతుంటారు. కొబ్బరి నీరు, మజ్జిగ.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేసే డ్రింక్ ఏంటో తెలుసుకుంటే..
కొబ్బరి నీరు..
కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం , సోడియం ఉంటాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి శాతం తగ్గడం నివారించబడుతుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది, తక్షణ శక్తిని అందిస్తుంది. తేలికగా, సులభంగా జీర్ణమవుతుంది. అధికంగా చెమట పట్టినప్పుడు లేదా వ్యాయామం చేసినప్పుడు కొబ్బరి నీళ్లు తాగమని డైటీషియన్లు సిఫార్సు చేస్తారు. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎలక్ట్రోలైట్ సమతుల్యత చేయబడుతుంది.
మజ్జిగ..
మజ్జిగలో జీర్ణవ్యవస్థను బలపరిచే ప్రోబయోటిక్ గుణాలు ఉంటాయి. మజ్జిగ తాగడం జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. ప్రతిరోజూ మజ్జిగ తాగడం వల్ల గ్యాస్, ఎసిడిటీ , ఉబ్బరం నుండి ఉపశమనం లభిస్తుంది. మజ్జిగ తాగితే శరీరం చల్లబడుతుంది. బరువును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. గ్యాస్ లేదా అజీర్ణం వంటి కడుపు సమస్యలతో బాధపడుతుంటే, మజ్జిగ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
తేడా..
కొబ్బరి నీరు శరీరానికి తక్షణమే తేమను అందిస్తుంది. మరోవైపు, మజ్జిగ జీర్ణక్రియను బలపరుస్తుంది. కొబ్బరి నీటిలో ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉండగా, మజ్జిగలో ప్రోటీన్ , ప్రోబయోటిక్స్ ఉంటాయి.
ఎప్పుడు ఏది ఎంచుకోవాలి..?
డీహైడ్రేషన్ లేదా అలసటగా అనిపిస్తే కొబ్బరి నీళ్లు తాగవచ్చు. ఇది శరీరాన్ని తిరిగి ఎనర్జీగా మారుస్తుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్ల అసమతుల్యత తగ్గిస్తుంది.
భోజనం తర్వాత మజ్జిగ తాగవచ్చు. ఇది ఆహారం బాగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. అలాగే ఎండలో బయటకు వెళ్లే ముందు కొబ్బరి నీళ్లు తాగవచ్చు. ఎండ నుండి వచ్చిన తర్వాత కూడా కాసింత చల్లగా ఉండే మజ్జిగ తాగవచ్చు.
మజ్జిగ, కొబ్బరి నీరు రెండూ మంచివే అయినా.. శరీర పరిస్థితిని బట్టి కొబ్బరి నీరు, మజ్జిగ వేర్వేరు ఫలితాలు ఇస్తాయి, వేర్వేరుగా ఉపయోగపడతాయి.
*రూపశ్రీ.
వేసవికాలం అంటేనే వేడి గాలులు, వడదెబ్బ, మండే ఎండలు గుర్తొస్తాయి. ఎండల వేడి గురించి పక్కన పెడితే.. మనుషుల నుండి జంతువుల వరకు.. ప్రతి ఒక్క ప్రాణి వేసవిలో వడదెబ్బకు గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వడదెబ్బ కారణంగా ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలే ప్రతి ఒక్కరికి శ్రీరామ రక్షలా కాపాడతాయి. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే..
ప్రయాణాలు..
వేసవి కాలంలో చేసే ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అధిక వేడిమితో డీహైడ్రేషన్ గురికాకుండా తరచూ మంచినీరు,ఓఆరెస్,పల్చటి మజ్జిగ వంటివి తీసుకుంటూ ఉండాలి. వీలైనంత వరకు ఉదయం చాలా తొందరగా, లేదా సాయంత్రం ఎండ వేడిమి చాలా వరకు తగ్గిన తర్వాత ప్రయాణాలు చేయడం ఉత్తమం. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలతో ప్రయాణాలు చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి.
బయటకు వెళ్లడం..
వేసవి కాలంలో సాధారణంగా మిగతా రోజుల్లా పనుల కోసం బయటకు వెళ్ళే విధానాన్ని తగ్గించుకోవాలి. వేసవి కాలంలో పనుల షెడ్యుల్.. బయటకు వెళ్ళి చక్కబెట్టుకోవాల్సిన పనుల ప్రణాళికలు మార్చుకోవాలి. తప్పనిసరిగా వెళ్లవలసి వస్తే.. వెంట వాటర్ బాటిల్, గొడుగు ఉండేలా చూసుకోవాలి. కాలి నడకన లేదా బైక్ లో వెళ్లడం కంటే ఆటో వంటి వాహనాలలో బయటకు వెళ్లి రావడం చాలా మంచిది.
ఆహార, పానీయాలు..
వేసవిలో తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీరానికి నీటి శాతాన్ని ఇచ్చే ఆహారాలు తీసుకోవాలి. ఆహారంలో కారం, ఉప్పు, నూనె వంటివి బాగా తగ్గించాలి. నీటి శాతం అధికంగా ఉండే కూరగాయలు, పండ్లు విరివిగా తీసుకోవాలి. ముఖ్యంగా ఎండలో బయటకు వెళ్లి వచ్చిన తర్వాత తొందర పాటులో చాలా చల్లగా ఉన్న ఫ్రిజ్ లోని నీరు తాగడం మానుకోవాలి. బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత కుండలోని నీరు లేదా పల్చగా మజ్జిగ, సుగంద షర్బత్ వంటివి తాగవచ్చు. ఇవి శరీరానికి ఊరట ఇస్తాయి. వేసవి తాపం తీరుస్తాయి.
హెల్త్ కేర్..
వేసవి ఎండల కారణంగా ఆరోగ్య ఇబ్బందులు తలెత్తితే దగ్గరలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో తగిన చికిత్స పొందాలి. అక్కడ ఓఆర్ లేదా ఎలక్ట్రోలైట్స్ ను అందించి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తారు. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నీడ పట్టున విశ్రాంతి తీసుకోవడం లేదా నీడ పట్టున పనులు చేసుకోవడం మంచిది.
సేవ..
వేసవికాలంలో ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యం గురించి మాత్రమే కాకుండా.. నలుగురి ఆరోగ్యం గురించి కూడా ఆలోచించడం కనీస మానవత్వం. వేసవిలో ప్రయాణాలు చేసేవారు.. దారి వెంట వెళ్లే బాటసారులు ఉంటారు. అలాంటి వారి కోసం.. మంచి నీరు ఏర్పాటు చేయడం, అక్కడక్కడా కూర్చోవడానికి కాసింత చోటు ఇవ్వడం వంటివి కూడా చేయాలి. ఇవి కనీస మానవ ధర్మం కూడా. అయితే.. ఏ పని చేసినా ప్రమాదాలు మీదకు తెచ్చుకోకుండా చేయడమే మంచిది.
*రూపశ్రీ.
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం బాగుంటే ఏ పనులైనా చేయవచ్చు, ఎంత డబ్బు అయినా సంపాదించుకోవచ్చు. కానీ నేటికాలంలో డబ్బు చాలా వరకు ఆరోగ్యం కోసమే ఖర్చు పెడుతున్నారు. ఎక్కడ చూసినా హాస్పిటల్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. చిన్న పిల్లల నుండి వృద్దుల వరకు వయసుతో నిమిత్తం లేకుండా చాలా రకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ఈ ఆరోగ్యం గురించి అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన వరల్డ్ హెల్త్ డే జరుపుకుంటున్నారు. ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సపం ఎలా ఆవిర్బవించింది? దీని ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? ఈ రోజు ఏ కార్యక్రమాలు చేపడతారు? ఆరోగ్యం కోసం ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? తెలుసుకుంటే..
వరల్డ్ హెల్త్ డే ప్రారంభం..
వరల్డ్ హెల్త్ డే ప్రారంభానికి ప్రధాన కారణం World Health Organization (WHO). 1948 ఏప్రిల్ 7న WHO అధికారికంగా స్థాపించబడింది. అదే తేదీని గుర్తుగా 1950 నుంచి ప్రతి సంవత్సరం వరల్డ్ హెల్త్ డే జరుపుతున్నారు. ప్రపంచంలోని ప్రజల ఆరోగ్యం మెరుగుపరచడం, ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడం కోసం ఈ రోజును ఏర్పాటు చేశారు.
ఉద్దేశ్యం..
ప్రపంచ ఆరోగ్య సంస్థకు గుర్తుగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ రోజు జరుపుకోవడం వెనుక కొన్ని ముఖ్య ఉద్దేశ్యాలు ఉన్నాయి.
ప్రజల్లో అవగాహన పెంచడం..
ఆరోగ్యం గురించి చాలామందికి సరైన సమాచారం, అవగాహన ఉండవు. అందుకే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వ్యాధుల నివారణ, ఆరోగ్యకర జీవనశైలి, మానసిక ఆరోగ్యం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు.
గ్లోబల్ హెల్త్ సమస్యలపై దృష్టి..
ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక థీమ్ ఉంటుంది. ఈ థీమ్ ను అనుసరించి కార్యక్రమాల రూపకల్పన, వాటి ఆచరణ వైపు ప్రణాళికలు ఏర్పాటు చేస్తారు. ఉదాహరణకు.. మెంటల్ హెల్త్, క్లైమేట్ చేంజ్ ప్రభావం, యూనివర్సల్ హెల్త్ కేర్ వంటి అంశాలు ఉండవచ్చు. ఈ రోజు తీసుకునే నిర్ణయాలు, ప్రాణాళికలు.. ప్రపంచ మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకోవడం జరుగుతుంది.
ప్రభుత్వాలు, సంస్థలను ప్రోత్సహించడం..
దేశాలు తమ ఆరోగ్య విధానాలను మెరుగుపరచడానికి ఈ రోజు ప్రేరణ కల్పిస్తుంది. ఇందుకోసం.. ఆరోగ్య సమాచారం, ఆరోగ్యం కోసం మెరుగు పరుచుకోవలసిన అంశాలు, పర్యావరణం, ఆరోగ్య సూత్రాలు.. వంటివి సూచించడం జరుగుతుంది.
నిర్వహించే కార్యక్రమాలు..
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజున కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం పరిపాటి. ఇవి ప్రతి గ్రామం, ప్రతి ఊరు, పట్టణాలలో ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వం, స్వచ్చంద ఆరోగ్య సంస్థల నేతృత్వంలో జరుగుతాయి.
ఉచిత ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. గ్రామాలు, పట్టణాల్లో ఫ్రీ మెడికల్ చెకప్‌లు, రక్తపరీక్షలు, షుగర్, BP పరీక్షలు వంటివి ఉచితంగా చేస్తారు.
హెల్త్ ర్యాలీలు & అవగాహన కార్యక్రమాలు చేపడతారు. కొన్ని ప్రాంతాలలో వాకథాన్‌లు, మారథాన్‌లు, స్కూల్స్, కాలేజీల్లో అవగాహన సెషన్స్ నిర్వహిస్తారు.
చాలా చోట్ల సెమినార్లు & వర్క్‌షాప్స్ నిర్వహిస్తారు. డాక్టర్లు, హెల్త్ ఎక్స్‌పర్ట్స్ ప్రసంగాలు, మానసిక ఆరోగ్యం, పోషణపై చర్చలు వంటివి జరుపుతారు.
వ్యాక్సినేషన్ డ్రైవ్స్ కూడా ఇస్తారు. పిల్లలకు, పెద్దలకు టీకాలు వేయించడం, ప్రజల్లో ఇమ్యూనిటీ పెంపుకు తోడ్పడటం చేస్తారు.
సోషల్ మీడియా క్యాంపెయిన్స్ కూడా నిర్వహిస్తారు. హ్యాష్‌ట్యాగ్స్ ద్వారా అవగాహన, ఆరోగ్య చిట్కాలు పంచుకోవడం. ఆరోగ్య సమస్యల గురించి సరైన సమాచారం అందించడం, ఆరోగ్య విషయంలో చాలా చేసే నిర్లక్ష్యాల గురించి వివరించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన సందర్బాలు చెప్పడం వంటివి చేస్తారు.
అందరూ చేయాల్సింది..
హెల్త్ ఈజ్ వెల్త్ అని అంటారు.. ఆరోగ్యం బాగుంటే కోట్ల ఆస్తులు ఉన్నట్టే.. అందుకే ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ద కనబరచాలి. జాగ్రత్తలు తీసుకుంటూ మంచి లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రెగ్యులర్ చెకప్స్ కు హాజరు కావాలి.
వ్యాయామం, ప్రాణాయామం, ధ్యానం వంటి చిన్న అలవాట్లు ఆరోగ్యాన్ని చాలా గొప్పగా మెరుగుపరుస్తాయి. ప్రతి రోజు వీటిని కొద్దిసేపు అయినా ప్రాక్టీస్ చేయాలి. అలాగే మంచి ఆహారం తీసుకోవాలి. మంచి ఆహారం అంటే ఖరీదైన ఆహారం అనే అపోహను వదిలేయాలి. నోటికి రుచిగా ఉన్నది కాదు.. శరీరానికి, ఆరోగ్యానికి ఏది మంచిదో అది తినడం అలవాటు చేసుకుంటే.. ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లోనే భద్రంగా ఉంటుంది.
*రూపశ్రీ.
