ఇంట్లోనే గోల్డ్ ఫేషియల్ ఇంత ఈజీగా చేసుకోవచ్చా?

 


ప్రతిరోజూ టీవీ  లోనూ సోషల్ మీడియాలోనూ అందానికి సంబంధించి  బోలెడు యాడ్స్ చూస్తుంటాం.  ఈ యాడ్స్ లో ఎక్కువగా ముఖం బంగారంలా మెరిసిపోవడానికి గోల్డ్ ఫేషియల్ గురించి చెబుతుంటారు.  గోల్డ్ మాస్క్ గురించి కూడా యాడ్స్ ఎడాపెడా కనిపిస్తుంటాయి. అయితే అందరికీ బ్యూటీ పార్లర్ కు వెళ్లి గోల్డ్ ఫేషియల్ చేయించుకునే స్థోమత ఉండదు. అలాగని మార్కెట్లో ఉత్పత్తులు వాడితే చర్మానికి మరింత హాని జరిగే అవకాశం కూడా ఉంటుంది.  అందుకే కేవలం నాలుగు స్టెప్స్  ఫాలో అవ్వడం ద్వారా ఇంట్లోనే గోల్డ్ ఫేషియల్ చేసుకోవచ్చు.  అదెలాగో తెలుసుకుంటే...


క్లెన్సింగ్..

ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవడం మొదటిదశ. మురికి,  మృత కణాలు,  జిడ్డు మొదలైన వాటిపైన ఏదైనా అప్లై చేస్తే అది చర్మాన్ని దెబ్బతీస్తుంది. అందుకే ముఖాన్ని పచ్చిపాలతో శుభ్రం చేసుకోవాలి.  పచ్చిపాలలో కాటన్ బాల్  ముంచి దాంతో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.  తరువాత మంచినీటితో ముఖం కడుక్కోవాలి.  దీనివల్ల మురికి తొలగిపోతుంది. ముఖం మీద మచ్చలు కూడా తగ్గుతాయి.


స్కబ్బింగ్..


గోల్డెన్ గ్లో పొందడానికి రెండవ దశ స్క్రబ్బింగ్. ఇది  ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్,  వైట్ హెడ్స్ ను శుభ్రం చేయడానికి పని చేస్తుంది. దీనికోసం ఒక గిన్నెలో చక్కెర, తేనె,  నిమ్మరసం వేసి బాగా కలపాలి. దీన్ని ముఖంపై 5-6 నిమిషాల పాటు స్క్రబ్ చేసి తర్వాత ముఖం కడుక్కోవాలి.


స్టీమింగ్..


స్టీమింగ్  చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది చర్మ రంధ్రాలను తెరుస్తుంది,  మురికిని లోతుగా శుభ్రపరుస్తుంది. అందువల్ల   ఆవిరి పట్టుకోవడం చాలా ముఖ్యం. కావాలంటే లవంగం, నిమ్మరసం, వేప ఆకులను ఆవిరి పట్టే నీటిలో వేసుకోవచ్చు. ఇవన్నీ చర్మానికి మేలు చేస్తాయి.


గోల్డెన్ గ్లో ఫేస్ ప్యాక్..


పార్లర్ లో చేసే ఫేషియల్ లాంటి గోల్డెన్ గ్లో  కావాలి అంటే ఇంట్లోనే ఫేస్ ప్యాక్ తయారుచేసుకోవచ్చు.  ఇందుకోసం ఒక గిన్నెలో 1 టీస్పూన్ కొబ్బరి నూనె, 1 టీస్పూన్ తేనె, 1/2 టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ నిమ్మరసం,  ఒక టీస్పూన్ పెరుగు వేసి బాగా కలపాలి.  దీన్ని  ముఖానికి అప్లై చేసి 5 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత ముఖం కడగాలి.  ఇలా చేసిన తరువాత ముఖానికి  గోల్డెన్ గ్లో  సొంతమవుతుంది.  చివరగా మాయిశ్చరైజర్ రాయాలి.


                                          *రూపశ్రీ.