కాబోయే భర్తతో అమ్మాయిలు తప్పక మాట్లాడాల్సిన విషయాలివి!

పెళ్లిళ్లు.. నిశ్చితార్థాల సందడి మొదలైపోయింది. పెళ్లిళ్లు అంటే ఇక ఎలాగూ పెద్దవాళ్ళు ప్లాన్ చేసినట్టు జరుగుతాయి. కానీ ముడిపడిన తరువాత జీవితాన్ని డీల్ చేసుకోవాల్సింది అమ్మాయి, అబ్బాయే..  అయితే పెళ్లి తరువాత ఇలా జరగాల్సింది, ఇలా జరుగుతుందని అనుకున్నాను, ఇలా ఉండాల్సింది  కానీ అలా లేదు, అంతా నీ ఇష్టమేనా?? నాకు విలువ లేదు, నువ్వు చెప్పినట్టే వినాలా?? బాద్యతలన్నీ ఒక్కరే మోయాలా?? నేను విసిగిపోయాను.. నీతో వేగలేను.. లాంటి మాటలతో ఒకరినొకరు బాధపెట్టుకుని బంధాన్ని తెంచుకునే వరకు వెళతారు చాలామంది. మరీ ముఖ్యంగా పెళ్లి తరువాత అమ్మాయిలే ఎక్కువ ఇబ్బందులు పడుతుంటారు. బాధ్యతల దగ్గర నుండి కెరీర్ వరకు ఎన్నో విషయాలు కాబోయే జీవితభాగస్వామితో చర్చించడం ఎంతో అవసరం. చాలా వరకు విషయాలను లైఫ్ పార్టనర్ తోనే చెప్పగలరు. కాబట్టి అమ్మాయిలు  కాబోయే భర్తతో ఈ కింది విషయాలను తప్పకుండా చర్చించాల్సిన అవసరం ఉంది.

నిశ్చితార్థం, పెళ్లికి మధ్య సమయంలో భాగస్వామితో మాట్లాడటం ద్వారా వారి స్వభావాన్ని తెలుసుకోవచ్చు. దీంతో పాటు పెళ్లి తర్వాత ఒకరినొకరు నిందించుకోకుండా ఉండొచ్చు. వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్య రాకుండా ఉండాలంటే

బాధ్యతల గురించి మాట్లాడాలి..

నిశ్చితార్థం తర్వాత, భాగస్వామితో కుటుంబం మరియు సంబంధాల గురించి బహిరంగంగా మాట్లాడాలి. భవిష్యత్తులో ఎవరు ఏ బాధ్యతను నిర్వర్తించాలనేది ముందుగా నిర్ణయించుకోవాలి. పెళ్లి తర్వాత ఇది చాలా సులభం అవుతుంది. ఈ విషయం మాట్లాకపోతే పెళ్లి తరువాత ఒకరిమీధ ఒకరు నిందలేసుకునేదాకా సమస్య వెళుతుంది.

అడ్జెస్మెంట్ గూర్చి మాట్లాడకపోతే అట్టర్ ప్లాప్ అవుతారు.. 

పెళ్లికి ముందు అడ్జస్ట్‌మెంట్‌ గురించి మాట్లాడాలి . మీ సమస్యలతో పాటు, మీ భాగస్వామికి మీ మనసును  విప్పి చెప్పాలి. ఇష్టాఇష్టాలు, ఇష్టం లేని విషయాలు మాట్లాడటం చాలా ముఖ్యం. అవతలి వారి ఇష్టాలు తెలుసుకుని ఒకరినొకరు అర్థం చేసుకోవడం ముఖ్యం. 

కెరీర్ చాలా ముఖ్యం..

ఈ అంశం అమ్మాయిలకు చాలా ముఖ్యమైనది. అసలే నేటికీ చాలా చోట్ల అమ్మాయిలు పెళ్లి తర్వాత ఉద్యోగాలు చేయడం లేదు. అబ్బాయిలు కూడా మొదట ఒకే చెప్పి ఆ తరువాత వొద్దు నాటారు.  దానివల్ల చాలా ఇబ్బందులు మొదలవుతాయి. ఇలా జరగకూడదు అంటే ముందుగానే కెరీర్ గురించి ఫైనల్ చేయాలి. ఉద్యోగం గురించి, ఆర్థిక అవసరాల గురించి ధైర్యంగా చెప్పాలి.

కుటుంబ నియంత్రణ..

పెళ్లయిన కొద్ది రోజుల వరకు పిల్లలు వొద్దని ప్రఝీ జంట అనుకుంటారు. కానీ పెద్దలు మాత్రం పెళ్లయ్యక అమ్మాయి ఎప్పుడెప్పుడు శుభవార్త చెబుతుందా అని ఎదురుచూస్తుంటారు. ఈ విషయం గురించి గురించి కాబోయే భార్యాభర్తలు ముందుగానే మాట్లాడుకోవడం చాలా బాగుంటుంది. దీనివల్ల పిల్లల చదువులు, వారికి మంచి కెరీర్ ఇవ్వవడానికి ఆర్థిక భరోసా ఏర్పాటుచేసుకోవడం బాగుంటుంది.  

తల్లిదండ్రుల బాధ్యత 

నేటి కాలంలో అమ్మాయిలు కూడా వారి తల్లిదండ్రులకు సహాయం చేస్తారు. అటువంటి పరిస్థితిలో, వారు తమ భాగస్వామితో ముందుగానే దాని గురించి మాట్లాడాలి. తద్వారా తర్వాత ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేకపోతే అమ్మాయిలకు తమ తల్లిందండ్రుల విషయంలో  చేదు అనుభవాలు ఎదురవుతాయి.

                                     ◆నిశ్శబ్ద.