సుప్రీతా డ్రెస్ మీద యాదమ్మ రాజు కామెంట్స్...
on Mar 21, 2025
చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే ఈ వారం షోలో యాదమ్మ రాజు - సుప్రీతా కామెడీ మాములుగా లేదు. యాదమ్మ రాజు నార్మల్ గా ఫుల్ డ్రెస్ వేసుకొచ్చాడు. కానీ సుప్రీతా మాత్రం చాలా పొట్టి డ్రెస్ వేసుకొచ్చింది. దాంతో యాదమ్మ రాజు ఆమె డ్రెస్సింగ్ స్టైల్ మీద కామెంట్స్ చేసాడు. "ఏంటి డాన్స్ మొత్తం హుషారుగా చేసి అంత డల్ ఇపోయావ్" అని అడిగింది సుమ. "మొన్న ఇక్కడ నా వంటకు సెకండ్ ప్లేస్ ఇచ్చారు. ఇదే ఊపుతో ఇంటికి వెళ్లి వంట చేసి మా ఆవిడకు పెట్టాను..ఇప్పటికి మూడు రోజులయ్యింది మాట్లాడక" అన్నాడు బాధపడుతూ యాదమ్మ రాజు. "ఎవ్వరైనా సరే నీ వంట తిన్నవాళ్ళు నీతో మాట్లాడరు" అని చెప్పింది సుమ. దానికి యాదమ్మ రాజు "అర్జెంటుగా డ్రెస్ మార్పించండి" అన్నాడు. దానికి సుమ "నా డ్రెస్సా" అన్నది. మీది కాదు ఈమెది అంటూ సుప్రీతా వైపు చూపించాడు.
"ఆమె డ్రెస్సు ఆమె ఇష్టం ఆమెకు ఎం కావాలో అది వేసుకుంటుంది" అంది సుమ. "అసలు కెమెరా మ్యాన్ ఒకటో రెండో క్లోజులు నాకు పెడుతున్నాడు. ఈ సుప్రీతా ఇలాంటి డ్రెస్సులు వేసుకొస్తే అప్పుడు ఫోకస్ మొత్తం అటే పెడతారు" అంటూ ఫీలయ్యాడు. తర్వాత సుప్రీతా యాదమ్మ రాజు భుజం మీద చెయ్యేసి గారంగా, ముద్దుగా "రాజు ఫీలవ్వకు రాజు" అంది. సరే మన ఆడియన్స్ కోసం ఒక ప్రాణం చెయ్యి రాజు..అంటూ అతనితో ప్రమాణం చేయించింది. " యాదమ్మ రాజు అనే నేను ఇన్నాళ్లు సుప్రీతా టాలెంట్ వల్ల, అందం వల్ల గెలిచామని..ఈరోజు మేం గెలవకపోతే నేను పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోను అని" రాజు చెప్పేసరికి "పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టనని చెప్పావ్" అని సుమ బాగా ఎగ్జాయిట్ అయ్యేసరికి "అంటే మందు తెచ్చాను" అని కౌంటర్ వేసాడు. దాంతో వెళ్ళిపో ఇక్కడి నుంచి అంటూ చెప్పి వల్ల పోడియం దగ్గరకు పంపేసింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
