Illu illalu pillalu : విశ్వని కొట్టిన ధీరజ్.. చందుని అరెస్ట్ చేసిన పోలీసులు!
on Mar 21, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -111 లో....విశ్వ కోపంగా ప్రేమని కొట్టబోతుంటే అది రామరాజుకి తగులుతుంది. అందరు షాక్ అవుతారు. మా నాన్ననే కొడతావా అని విశ్వ పైకి ధీరజ్ వెళ్తుంటే అందరు ఆపుతారు. రామరాజు గొడవని సర్దుమనిచి లోపలికి వెళ్తాడు. అయినా ధీరజ్ మాత్రం నా తండ్రిపై చెయ్యేస్తావా అంటూ కోపంగా ఉంటాడు.
విశ్వ బయటకి వెళ్తుంటే తన వెనకాల ధీరజ్ వెళ్తుంటాడు. అది చూసి తిరుపతి టెన్షన్ పడుతూ ఏం జరుగుతుందో అని వెనకాలే వెళ్తాడు. అన్ని గొడవలకి కారణం నేనే అంటూ ప్రేమ బాధపడుతుంది. వేదవతి వచ్చి ప్రేమతో మాట్లాడుతుంది. ఆ తర్వాత నర్మద వచ్చి ప్రేమతో మాట్లాడుతుంది. నాకు వంటలో హెల్ప్ చేయమంటు డైవర్ట్ చేస్తుంది. ఆ తర్వాత తిరుపతి చందుకి ఫోన్ చేసి విశ్వ దగ్గరికి ధీరజ్ కోపంగా వెళ్తున్నాడని చెప్తాడు. దాంతో ధీరజ్ దగ్గరికి చందు బయల్దేరతాడు. ధీరజ్ విశ్వ దగ్గరికి వెళ్లి గొడవపడతాడు. తిరుపతి ఎంత ఆపినా కూడా దీరజ్ ఆగడు. మరొక వైపు ప్రేమ, నర్మద కబుర్లు చెప్పుకుంటూ వంట చేస్తుంటారు.
ధీరజ్ గొడవ పడుతున్న దగ్గరికి చందు వస్తాడు. తను కూడా దీరజ్ ని ఆపుతాడు అయినా వినకుండా విశ్వని కొడతాడు. తరువాయి భాగంలో తిరుపతి, చందు ఇద్దరు వస్తుంటే పోలీసులు చందుని అరెస్ట్ చేస్తారు. మీరు విశ్వ అనే అబ్బాయి ని కొట్టారని కంప్లైంట్ ఇచ్చారని పోలీసులు చెప్తారు. దాంతో తిరుపతి వెంటనే రామరాజుకి ఫోన్ చేసి విషయం చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
