కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసిన మసూద మూవీ నటుడు తిరువీర్
on Mar 21, 2025
సిల్వర్ స్క్రీన్ మీద తిరువీర్ అనే నటుడు ఇప్పుడిప్పుడే తన మార్క్ వేసుకుంటూ వెళ్తున్నాడు. పలాస మూవీలో అలాగే జార్జి రెడ్డి చిత్రంలో తిరువీర్ నటన అద్భుతంగా పండింది. నవరసాలను పండించడంలో ఆయనకు ఆయనే సాటి. ఐతే సిన్ అనే మూవీలో నటన తనకు మంచి గుర్తింపు తెచ్చింది. అలాగే మసూద అనే థ్రిల్లర్ మూవీలో ఐతే ఆయన నటనకు ఫుల్ మార్క్స్ పడ్డాయి. అలాంటి తిరువీర్ సెలెక్టీవ్ గా మంచి మూవీస్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక ఇప్పుడు "ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో" అనే మూవీలో ఫోటోగ్రాఫర్ రోల్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
అలాంటి తిరువీర్ రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో కొన్ని పిక్స్ పెట్టాడు. "రెండు దశాబ్దాల కల, అమ్మ చివరి కోరిక" అని పోస్ట్ చేసి సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నా అన్న ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేసాడు. తన కొత్త ఇంటికి గృహప్రవేశం ఫొటోస్ ని పోస్ట్ చేసాడు. నెటిజన్స్ కూడా కంగ్రాట్యులేషన్స్ అంటూ విషెస్ చెప్పారు. ఇక యాంకర్ గాయత్రీ భార్గవ్ కూడా కామెంట్ చేసింది. "ఇల్లు కటి చూడు, పెళ్లి చేసి చూడు. అంత శుభమే జరుగుతుంది. హ్యాపీ హోమ్" అని చెప్పింది. అలాగే జబర్దస్త్ కమెడియన్ అభి కూడా కంగ్రాట్యులేషన్స్ చెప్పాడు. స్టేజి షోస్ , నాటకాల్లో నటిస్తూ సిల్వర్ స్క్రీన్ మీదకు అడుగుపెట్టాడు తిరువీర్ . ఇక "ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో" అనే మూవీలో తిరువీర్ ఒక ఫోటోగ్రాఫర్ రోల్ లో నటిస్తున్నారు. రాహుల్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఈ మూవీ వస్తోంది. ఐతే ఇది పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతోందన్న విషయం చెప్పాడు తిరువీర్.. ఇప్పుడు ఈ నటుడు బ్యాక్ టు బ్యాక్ కొన్ని సెలెక్టీవ్ అండ్ ఆడియన్స్ కి హార్ట్ టచ్ అయ్యే మూవీ కంటెంట్ తో రాబోతున్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
