బెట్టింగ్ యాప్స్ ప్రొమోషన్ లో శ్రీముఖి ?
on Mar 22, 2025
సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసిన బెట్టింగ్ యాప్స్ మీదనే కథంతా నడుస్తోంది. సినీ, బుల్లితెర నటీనటులంతా కూడా ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ వలలో చిక్కారు. దాంతో పోలీసులు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన వాళ్ళ మీద కేసులు ఫైల్ చేస్తున్నారు. ఐతే సోషల్ మీడియాలో శ్రీముఖి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. ఐతే శ్రీముఖి వాళ్ళ నాన్న చెప్పిన మాటలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఐతే శ్రీముఖికి ఒక అమ్మాయి కాల్ చేసిందట. ఆ టైంకి శ్రీముఖి షూటింగ్ లో ఉందని, ఆ నంబర్ ఎవరిదో తెలుసుకోవాలని శ్రీముఖి చెప్పిందన్నారు.
ఐతే ఒక వీడియో బైట్ ఇవ్వాలని చెప్తూ శ్రీముఖి ఫ్రెండ్ వేరే వాళ్ళతో కో-ఆర్డినేట్ చేశాడంటూ చెప్పుకొచ్చాడు శ్రీముఖి వాళ్ళ నాన్న. ఐతే అవతల వ్యక్తి నుంచి స్క్రిప్ట్ రావడంతో ఒక వీడియో చేసి పంపింది కానీ శ్రీముఖి అసలు తాను చేసిన వీడియోని పోస్ట్ చేయలేదు అని ఐతే ఇప్పుడు ఆ వీడియో తీసుకున్నట్టు చెప్పుకొచ్చాడు. అలాగే కొన్ని రోజులుగా చూస్తే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ బుల్లితెర మీద నటించే, విష్ణుప్రియ, టేస్టీ తేజ, రీతూ చౌదరి, సుప్రీతా, వర్షిణి, సిరి హన్మంత్, సోబాశెట్టి, నాయని పావని వంటి వాళ్ళ మీద పోలీసులు కేసు ఫైల్ చేసిన వార్తల్ని మనం చూస్తూనే ఉన్నాం. ఐతే ఈ బెట్టింగ్ యాప్స్ తో ఎంతో మంది సాధారణ ప్రజలు వేలు, లక్షలు పోగొట్టుకుని ఇంటిని, ఒంటిని గుల్ల చేసుకుంటూ రోడ్డున పడుతున్నారు. ఇప్పుడు పోలీసులు ఈ విషయం మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
