బిగ్ బాస్ కి నాగార్జున అన్ ఫిట్..ఆయనకు ఇంగ్లీష్ రాదు..
on Mar 22, 2025
బిగ్ బాస్ హోస్ట్ అనేది మేజర్ రోల్...హోస్ట్ కి ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. హోస్ట్ రోస్ట్ చేయొచ్చు కానీ ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా రోస్ట్ చేయకూడదు అంటూ బిగ్ బాస్ హోస్ట్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున మీద బిగ్ బాస్ కంటెస్టెంట్ సోనియా ఆకుల ఫైర్ అయ్యింది. "నాకు తెలిసి రానా గారు హోస్ట్ ఐతే బాగుంటుంది అనుకుంటున్నా. అతనొక ట్రెండీ పర్సన్. ఫామిలీ రిలేషన్స్, ఫ్రెండ్ షిప్స్ గురించి అప్డేట్ గా ఉండే వ్యక్తి. మళ్ళీ నాగార్జున గారే హోస్ట్ గా వస్తే నేను బిగ్ బాస్ కి వెళ్ళను..బిగ్ బాస్ హౌస్ లో అంత సీన్ లేకపోయినా గౌతమ్ మీద నాగార్జున గారు మండిపడ్డారు. కానీ రానా కొంచెం ఆలోచించి కామెంట్ చేసే పర్సన్ అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన చేసిన నంబర్ వన్ యారి వంటి షోస్ చూస్తే ఆయన పర్సెప్షన్స్ చాలా బాగుంటాయి, క్లారిటీగా ఉంటాయి. 20 సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క బిగ్ బాస్ తో వచ్చింది. ప్రజలతో కనెక్ట్ అయ్యే అవకాశం వచ్చింది. కానీ నాగ్ సర్ వస్తే బిగ్ బాస్ హౌస్ కి మళ్ళీ అవకాశం వచ్చినా వెళ్ళను.
ఆయన నేచర్ సాఫ్ట్. కానీ ఏ విషయాన్నీ సరిగా అనలైజ్ చేయరు. చాల పదాలు మింగేస్తారు...మాటలు మార్చేస్తారు. నేను అనని వాటిని తప్పుగా హైలైట్ చేసి చూపించారు. ఆయన వల్లే నేను మధ్యలో ఎలిమినేట్ అయ్యి బయటకు రావాల్సి వచ్చింది. నాగ్ సర్ నా భర్త పేరు అడిగారు. నేను యాష్ వీరగోని అని చెప్పా. కానీ ఆయన యష్ వీర్ అని యశ్వి అంటారు. నాకేమో యష్మి గురించి మాట్లాడుతున్నారేమిటా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో నా భర్త పేరు చూస్తే యష్ వీర్ అనే కనిపిస్తుంది. ఇక నా విషయంలో అడల్ట్ రేటెడ్ కామెడీ అన్న పాయింట్ సోషల్ మీడియా బాగా హైలైట్ చేసేసింది. ఐకే కామెడీ షోస్ లో హుకింగ్ అనేది కామన్. ఒక అమ్మాయి అబ్బాయి కలిసి నడుస్తూ వెళ్ళేటప్పుడు చేసే వల్గర్ కామెడీని హుకింగ్ అంటారు. అది చాల సెన్సిటివ్ ఇష్యూ. ఆ పదాన్ని విష్ణు ప్రియా విషయంలో వాడాను. దాన్ని నాగ్ సర్ పెద్ద ఇష్యూ చేసేసారు. నేను అనని మాటలను అన్నట్టుగా హైలైట్ చేశారు..హోస్ట్ గా రానా బెటర్ అనేది నేను అనుకుంటున్నా" అంటూ చెప్పింది సోనియా ఆకుల.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
