ఫైర్ ఐన మంచు మనోజ్.. ఒక అమ్మాయిని లవ్ చేసి చీట్ చేసావ్ శివ
on Mar 22, 2025
"అనగనగా ఈ ఉగాదికి" అంటూ ఈటీవీలో త్వరలో ప్రసారం కాబోయే షో నెక్స్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో యాంకర్ శివకి ఇచ్చిపడేశాడు మంచు మనోజ్. ఆల్రెడీ యాంకర్ శివకి ఈరోజు ప్రాణగండం ఉంది అంటూ ఆది సెటైర్ వేసాడు. ఐతే శివ కూడా మనోజ్ అన్నా ఒక క్వశ్చన్ అన్నా అనేసరికి "ఏ రెండో క్వశ్చన్ కి నువ్వు ఉండవా" అని కౌంటర్ వేసాడు. ఆ తర్వాత మనోజ్ "కావాలని ప్లాన్ చేసుకుని వచ్చి అలా కాంట్రోవర్సిగా చెప్తారో ఏమో....మరి మీ తప్పులు కూడా బయట పెట్టాలిగా.. నువ్వెండేది పిఆర్సినే కదా.. అందులో ఒక అమ్మాయిని లవ్ చేసి చీట్ చేసావ్ ..ఆ అమ్మాయి పేరు..." అంటూ మంచు మనోజ్ ఫుల్ ఫైర్ అయ్యాడు.
ఇక యాకర్ శివ ఏమీ సమాధానం చెప్పలేక కూర్చున్నాడు. అసలు ఇంతకు శివ ఎం అడిగాడో ప్రోమోలో కట్ చేసేసారు. కానీ మంచు మనోజ్ అన్న ఘాటైన మాటల్ని మాత్రం ప్రోమోలో చూపించారు. ఈ ప్రోమో మొత్తం కూడా ఫుల్ జోష్ తో సాగింది. అలాగే త్వరలో రిలీజ్ కాబోయే రాబిన్ హుడ్ మూవీ నుంచి హీరో నితిన్ వచ్చాడు. అలాగే నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ప్రదీప్ మాచిరాజు వచ్చారు. ఐతే హోస్ట్స్ గా నందు, రష్మీ చేశారు. "మనోజ్ అన్న గురించి యూట్యూబ్ లో ఏది వచ్చినా అది వైరల్ అవుతుంది" అని నందు చెప్పేసరికి.."రేయ్ ఎవర్రా నువ్వు" అంటూ పెద్ద డైలాగ్ వేసాడు మనోజ్. ఇంతలో నందు ఆదిని చూపించి "వాడే ఎలుగుబంటోడు" అన్నాడు. దానికి "ఓయ్ ఎలుగుబంటు" అంటూ ఆది మీద సెటైర్ వేసాడు మనోజ్. ఇక ప్రదీప్ మీద ఒక డైలాగ్ వేసింది రష్మీ. "పిండే పండయ్యింది" అంటూ అరుంధతి మూవీ డైలాగ్ ని ప్రదీప్ మీద వేసేసరికి ప్రదీప్ షాకైపోయాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
