ప్రేమ ఉందంటే ఎన్నేళ్ళైనా వెయిట్ చేస్తానన్న నిఖిల్.. కావ్య క్వశ్చన్ కి అందరు షాక్!
on Dec 11, 2024
బిగ్ బాస్ సీజన్-8 క్లైమాక్స్ కి వచ్చేసిన సంగతి తెలిసిందే. మరికొన్ని రోజుల్లో ఈ సీజన్ ముగియనుంది. హౌస్ లో ఇప్పటికే అయిదుగురు కంటెస్టెంట్స్ ఉండగా బిబి పరివార్ వర్సెస్ స్టార్ మా పరివార్ అంటూ ఈ వీక్ మొదలైన నుండి సీరియల్స్ సెలబ్రిటీలని హౌస్ లోకి తీసుకొస్తూ వారిచేత గేమ్స్ ఆడిస్తూ ప్రైజ్ మనీని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా నిన్నటి ఎపిసోడ్ లో బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ దీపిక రంగరాజు (కావ్య) హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక వచ్చీ రాగానే తనదైన వెరైటీ స్టెప్పులు, తింగరి మాటలతో కావ్య కామెడీ చేసింది. ముఖ్యంగా బిగ్‌బాస్ కనిపించలేదు కానీ ఖచ్చితంగా కావ్య దెబ్బకి దండం పెట్టేసి ఉంటాడు.
అందరినీ చాలా సిల్లీ కొశ్చన్స్ అడిగిన కావ్య.. నిఖిల్‌ని మాత్రం సీరియస్‌గా ఓ ప్రశ్న వేసింది. నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది.. తనకి గతంలో నువ్వంటే చాలా ఇష్టం.. కానీ ఇప్పుడు ఇష్టం కాదు.. ఒకవేళ మీకు తన మీద ఇంకా లవ్ ఉంది అనుకోండి.. అయినా కానీ నాకు నువ్వు వద్దు నిన్ను పెళ్లి చేసుకోను అని చెబుతుంది.. అలా అని ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసుకోలేదు.. మరోవైపు మీ ఇంట్లో నువ్వు పెళ్లి చేసుకోవాలని మీ అమ్మ నుంచి ప్రెజర్ వస్తుంది.. అప్పుడు మీరు ప్రేమించిన అమ్మాయి కోసం ఇంకా వెయిట్ చేస్తారా.. లేకపోతే డౌన్ ఫీల్ అయి ఇంక వర్కవుట్ అవదని మూ ఆన్ అయి వేరే పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటారా.. అంటూ కావ్య అడిగింది.
ప్రేమ ఉందంటే నేను నిజంగా వెయిట్ చేస్తా.. ఎన్ని ఏళ్లయినా ఖచ్చితంగా వెయిట్ చేస్తా.. అమ్మవాళ్లు చెప్పిన సంబంధం చేసుకోను.. నేను మూ ఆన్ అవ్వలేదు ఆ అమ్మాయిపైన ఇంకా ఫీలింగ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా నేను వెయిట్ చేస్తా కదా.. అంటూ సమాధానమిచ్చాడు. ఈ మాటలకి కావ్య క్లాప్స్ కొట్టింది. ఇలా నిఖిల్ లవ్ స్టోరీని గట్టిగానే బిగ్‌బాస్ టీమ్ వాడేస్తుంది. ఆ తర్వాత కావ్య.. హౌస్‌మేట్స్‌లో ఒకరిని సెలక్ట్ చేసుకొన ఒక గేమ్ ఆడాలంటూ బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో అవినాష్‌తో ఒక గేమ్ ఆడింది. ఇందులో అవినాష్ ఈజీగా గెలిచాశాడు. ఇక వెళ్లేముందు నిఖిల్‌కి ఒక టైట్ హగ్ ఇచ్చి నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పక దక్కుతుంది అంటూ దీపిక చెప్పింది. దీంతో నిఖిల్ నవ్వుతూ థాంక్యూ బయటికొచ్చాక తప్పకుండా కలుస్తా అంటూ బైబై చెప్పేశాడు.
Also Read