నాగార్జునకి పెళ్ళి శుభలేఖ ఇచ్చిన సోనియా ఆకుల!
on Dec 11, 2024
బిగ్‌బాస్ సీజన్-8 ఫేమ్ సోనియా ఆకుల త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. షో నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత సోనియాకి నిశ్చితార్థం అయిన సంగతి తెలిసిందే. బిజినెస్‌మ్యాన్ యష్ పాల్ వీరగోనితో సోనియా ఏడడుగులు వేయబోతుంది. తాజాగా కింగ్ నాగార్జునని కలిసి శుభలేఖ అందజేసిన ఈ జంట. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మా జీవితంలో స్పెషల్ డే అయిన మా వివాహానికి తప్పకుండా రావాలని నాగార్జున గారిని ఆహ్వానించామంటూ ఈ వీడియోను పోస్ట్ చేశారు యష్. నవంబర్‌లో వీరి నిశ్చితార్థం జరగ్గా. ఈ నెలలోనే పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. అయితే పెళ్లి తేదీ ఎప్పుడనే విషయం మాత్రం తెలీలేదు. కానీ బిగ్‌బాస్ సీజన్-8 ముగిసిన తర్వాతే పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది.
యష్ పాల్ సొంతూరు వరంగల్. యష్ కష్టపడి చదువుకుని అమెరికా వెళ్లి చాలా ఏళ్లు అక్కడ ఉద్యోగం చేశారు. అమెరికాలో చదువు కోసం వెళ్లిన రోజుల్లో తనకి ఎదురైన ఇబ్బందులు మరొకరికి ఎదురు కాకూడదనే ఉద్దేశంతో 'ఫ్లయ్ హై' అని ఒక కన్సల్టెన్సీని ఆయన స్థాపించారు. అలానే ఫ్లయ్ హై టూరిజం, విరాట్ ఫౌండేషన్ అనే సంస్థలను కూడా ఆయన స్థాపించారు. ఈ వ్యవహారాలన్నింటినీ యష్ స్వయంగా చూసుకుంటున్నారు. వీటితో పాటు అమెరికాలో దావత్ పేరుతో యష్‌కి పలు రెస్టారెంట్లు కూడా ఉన్నాయి.
యష్‌కి సంబంధించిన సంస్థలోనే సోనియా కూడా గతంలో పని చేసేది. అలా వీరి మధ్య మొదలైన పరిచయం ప్రేమగా మారింది. అయితే యష్‌కి అప్పటికే పెళ్లి అయి పిల్లలు కూడా ఉన్నారు. కానీ తన మొదటి భార్యకి విడాకులు ఇచ్చి ఇప్పడు సోనియాని వివాహం చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని సోనియానే స్వయంగా బిగ్‌బాస్ హౌస్‌లో ప్రేరణతో చెప్పింది. అలా సోనియా లవ్, పెళ్లి విషయం ఆడియన్స్‌కి లీకైంది. ఇక బిగ్‌బాస్ ద్వారా సోనియా బ్యాడ్ అయిన సమయంలో కూడా యష్ చాలా సపోర్ట్ చేశారు.
Also Read