కోటి రూపాయల అప్పు తీసుకున్న ధన.. ఆడుకుందామనుకున్న సందీప్!
on Dec 10, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -275 లో......రామలక్ష్మి సీతాకంత్ ఆఫీస్ కి వెళ్తుంటే ఆటపట్టిస్తుంది. మరొకవైపు శంకర్ తో ధన మాట్లాడుతుంటాడు. నా దగ్గర కోటి రూపాయలు తీసుకున్నావ్ ఇంకా ఇవ్వలేదంటూ కోప్పడతాడు. అప్పుడే సందీప్ వచ్చి వీడెవడో ఏకంగా కోటి రూపాయలు తీసుకున్నాడని అతన్ని సందీప్ చూస్తాడు. అలా చూసేసరికి ధన తనని చూసి సందీప్ షాక్ అవుతాడు. నువ్వేంటని సందీప్ అడుగుతాడు.
అతను నీకు తెలుసా అని శంకర్ అడుగగా.. తను నా బావ అని సందీప్ అంటాడు. బావ, బామ్మర్ది ఇద్దరు అప్పు చేసి నా దగ్గర ఎగ్గొడ్దామనుకున్నారా అని శంకర్ అనగానే.. సందీప్ కూడా తీసుకున్నాడా అని ధన షాక్ అవుతాడు. ఇద్దరికి వరకు టైమ్ ఇస్తున్నా నాకు కచ్చితంగా కావాలని శంకర్ వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత శ్రీలత అందరికి టిఫిన్ వడ్డీస్తుంది. అత్తయ్య మీరు కూర్చోండి.. నేను వడ్డీస్తానని శ్రీలతని కూర్చోపెట్టి రామలక్ష్మి వడ్డీస్తుంది. అలా అత్తాకోడళ్ళు ప్రేమ గా ఉండడం చూసి సీతాకాంత్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందని రామలక్ష్మిని ఒకవైపు శ్రీలతని ఒకవైపు పెట్టుకొని ఒక ఫోటో తీసుకుంటాడు సీతాకాంత్.
మరొకవైపు అసలేం జరిగిందని ధనని సందీప్ అడుగుతాడు. ముంబైలో ఒక కంపెనీతో కంపెనీ స్టార్ట్ చేశాను. మొదట్లో లాభం వచ్చింది. నేను అతనికి వదిలేసి జల్సాలకి అలవాటు పడి శంకర్ దగ్గర అప్పు చేసాను. లాభం వస్తుంది కదా అని తీర్చేయొచ్చనుకున్న ఇంకా నష్టం వచ్చింది అని చెప్తాడు. ఆ తర్వాత నేను కూడా నీలాగే చేసానని సందీప్ అంటాడు. దొరికింది మంచి ఛాన్స్.. వీడిని అడ్డు పెట్టుకొని సీతాకాంత్ ని ఆడుకోవాలని సందీప్ అనుకుంటాడు. మన సిచువేషన్ చెప్పి మమ్మీని హెల్ప్ చెయ్యమందామని సందీప్ అంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి సీతాకాంత్ లు ఆఫీస్ కి వెళ్తుంటే.. సందీప్, ధన ఇద్దరు ఇంటికి వస్తారు. తనని చూసి అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. సడెన్ గా వచ్చవ్ ఏంటని ధనని అడుగగా.. డాక్యుమెంట్స్ కోసం వచ్చానని, అలాగే సిరిని చూసి వెళదామని వచ్చానని ధన అబద్ధం చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read