అన్నా పెళ్లి చూపులకు వెళ్తున్నావా...నెక్స్ట్ జనరేషన్ హీరో ఆదినే...
on Dec 28, 2024
హైపర్ ఆది అంటే చాలు కామెడీ షోస్ గుర్తు వస్తాయి. అటు జబర్దస్త్ షోస్ అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ, మరో వైపు ఢీ జోడి ఏదీ వదలకుండా అన్ని షోస్ లో కనిపిస్తూనే ఉంటాడు. ఐతే హైపర్ ఆది ఫోటో షూట్స్ చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి హైపర్ ఆది రీసెంట్ గా కొన్ని ఫొటోస్ ని పోస్ట్ చేసాడు. అది కూడా ఒక కార్ ఎదురుగా నిలబడి మరీ నవ్వుతూ ఉన్న పిక్స్ అవి. ఆ పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. హైపర్ ఆదికి బేసిక్ గా బాగా పొట్ట ఉంటుంది. ఏ డ్రెస్ వేసినా కూడా పొట్ట బయటకు కనిపించేస్తూ ఉంటుంది.
ఈ ఫోటో షూట్ లో కూడా పొట్ట బాగా కనిపించేస్తోంది. దాంతో నెటిజన్స్ వెరైటీగా కామెంట్స్ చేస్తున్నారు. " హీరో పోలికలు వచ్చేసాయి వెయిట్ చేయడమే...నెక్స్ట్ నువ్వే అనే హీరో...పొట్ట ఉండే వారికీ మీరే అన్న అవుట్ ఫిట్ కి మోడల్...అన్నా జిమ్ కి వెళ్లి వర్కౌట్స్ చేసి బొజ్జ తగ్గించవచ్చు కదా .. అన్నా న్యూ లుక్ బాగుంది. అన్న కార్ డ్రైవింగ్ నేర్చుకున్నారా..హాయ్ అన్నా పెళ్లి చూపులకు వెళ్తున్నారా ... అన్నా పెళ్ళెప్పుడు...అందరికి వయసు పెరుగుతుంది నీకేమో వయసు తగ్గుతుంది...అన్నా కొంచెం ఫ్యాట్ గా ఉన్నా కూడా జబర్దస్త్ గా ఉన్నావు. " అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక హైపర్ ఆది జబర్దస్త్ తో కెరీర్ ప్రారంభించి అటు సినిమాల్లో, ఈవెంట్ లలో అలరిస్తూ బిజీ ఐపోయాడు. తనదైన కామెడీ పంచులతో.. టైమింగ్ తో జనాలను ఆకట్టుకుంటున్నాడు.
Also Read