కార్తీకదీపం ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. ఆ సీన్ మళ్ళీ రిపీట్!
on Dec 28, 2024
స్టార్ మా సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ కి ఉండే క్రేజే వేరు. ఎంత అభిమానిస్తారో తెలిసిందే. అయితే సెకెండ్ పార్ట్ లో దీప వేరే అతడిని పెళ్ళి చేసుకొని శౌర్యని కనడం.. కార్తీక దీపం ఫ్యాన్స్ తీసుకోలేకపోయారు.
కొంతకాలం దీపకి తన మాజీ భర్తతో గొడవలు చూపించి ఆ తర్వాత విడాకులు చేపించాడు దర్శకుడు. ఇక రీసెంట్ గా దీప, కార్తీక్ లు పెళ్ళి చేసుకున్నారు. అయితే అప్పటి నుండే వారికి కష్టాలు మొదలయ్యాయి. ఇంట్లో వంట చేసే దీపని పెళ్ళి చేసుకుంటావా అంటూ శివన్నారాయణ అందరిని బయటకి గెంటేశాడు. ఇక దీప, కార్తీక్ లని టార్గెట్ చేస్తూ జ్యోత్స్న పగ సాధిస్తుంది. కార్తీక్ ని శివన్నారాయణ జాబ్ లో నుండి తీసేయడంతో ఫ్యామిలీని మేనేజ్ చేయడం కష్టమైపోతుంది. దాంతో కార్తీక్ చాలా చోట్ల జాబ్ కి ప్రయత్నించగా జ్యోత్స్న చెడగొడుతుంది.
తాజా ఎపిసోడ్ లో మన కార్తీక్ బాబు తండ్రి దగ్గర ఇరవై నాలుగు గంటల్లో జాబ్ తెచ్చుకుంటానని ఛాలెంజ్ చేస్తాడు. ఆ జాబ్ తెచ్చుకుంటాడు. ఇంతకీ అదేం జాబ్ అంటే.. సూపర్ మార్కెట్‌లో బాయ్ జాబు అన్న మాట. అందుకే భార్య దగ్గర తల దించుకుని నడుచుకుంటూ ఉంటాడు. మొత్తానికి కార్తీక్ పనికి జాయిన్ ఇంట్లోనే దీప కూడా పనిలో చేరడంతో ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. వారిద్దరికి ఇది పెద్ద కష్టమే. ఇక ఆ ఇంటి ఓనర్ అమ్మ మాత్రం దిట్టంగా కాలు మీద కాలేసుకుని.. ఫోన్ చూసుకుంటూ.. మెడలో బంగారు గొలుసులు దిగేసుకుని ఉంది. మన దీపను వంట మనిషిగా.. కార్తీక్ బాబుని ఒక సూపర్ మార్కెట్ బాయ్‌గా చూడటం నిజంగా అంటే నిజంగా బాధకరం. ఇది కార్తీకదీపం ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్ అని మాట. గతంలో కార్తీకదీపం వన్‌లో కూడా ఇలాంటి ఓ సీన్ ఉంటుంది. అప్పుడు కూడా ఇలానే ఎదురుపడతారు ఈ మొగుడు పెళ్లాలు. మొత్తానికీ సీన్ రిపీట్ అన్న మాట. ముందుముందు మన కార్తీక్, దీపలకి ఇంకా ఎన్ని కష్టాలు వస్తాయో చూడాలి మరి.
Also Read