Prerana Biggboss: అలా అనేవాళ్ళకి బుద్ధి లేదు.. నేను ఎక్కడి నుండి వస్తే ఏంటి
on Dec 28, 2024
బిగ్ బాస్ సీజన్-8 లో టాప్-5 కంటెస్టెంట్స్ లో ప్రేరణ కంబం ఒకరు. పెళ్ళి చేసుకొని ఆర్నెళ్ళ తర్వాత హౌస్ లోకి వచ్చిన మొదటి లేడి కంటెస్టెంట్ ప్రేరణ కంబం. హౌస్ లో తన మాటతీరుతో, ఆటతీరుతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇక టాప్-5 కంటెస్టెంట్ గా ఎలిమినేషన్ అయి బయటకొచ్చింది ప్రేరణ.
ఇక తాజాగా ప్రేరణ ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్ నిజాలు చెప్పింది. కే బ్యాచ్ టీ బ్యాచ్ అని పెట్టారు. నేను కే బ్యాచ్ కాదు.. నేను తమిళ అమ్మాయిని. కన్నడలో పెరిగాను.. కన్నడలో పని చేశాను. అందుకని నన్ను కూడా కే బ్యాచ్‌లో కలిపేశారు. నేను తెలుగు పనిచేస్తున్నా.. అలాగని టీ బ్యాచ్‌లో కలిపేయలేరుగా. కన్నడలో పనిచేశానంతే. అలాగని కన్నడదాన్ని అయిపోను. నేను తమిళ్ అమ్మాయిని. అలా చూస్తే నేను కే బ్యాచ్ కాదు టీ బ్యాచ్ కాదు వేరే టీ బ్యాచ్ అవుతాను. మూడో బ్యాచ్‌లో ఉన్నాను. నేను బయటకు వచ్చిన తర్వాత ఈ కే బ్యాచ్.. టీ బ్యాచ్ గురించి తెలిసినప్పుడు చాలా కోపం వచ్చింది. ఎవరు స్టార్ట్ చేశారో కానీ బుద్దిలేదు వాళ్లకి.. ఎందుకంటే షోలోకి వెళ్లింది తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయడానికి. మేమ్ తెలుగు సీరియల్స్ చేస్తున్నది తెలుగు వాళ్ల కోసం. నేను హైదరాబాద్‌లోనే పెరిగాను. పెళ్ళైన తర్వాత కూడా మళ్లీ హైదరాబాద్‌కి వచ్చేశాను. గట్టిగా మాట్లాడితే నేను తెలుగు అమ్మాయిలాగే ఫీల్ అవుతా. షోలో కూడా మేమ్ ఎక్కడ నుంచి వచ్చిన కూడా తెలుగులోనే మాట్లాడేవాళ్లం.
హౌస్‌లో మమ్మల్ని మీరు అక్కడ నుంచి వచ్చారు.. ఇక్కడ నుంచి వచ్చారనే భేదం చూపించలేదు. మాకు టాలెంట్ ఉంది కాబట్టి తీసుకున్నారు. మేము ఎంటర్ టైన్ చేశాం. నేను తెలుగులోనే కదా మాట్లాడుతున్నా. నేను తెలుగు షోలో ఉన్నప్పుడు నేను ఎక్కడ నుంచి వస్తే ఏంటి? తెలుగు వాళ్లనే కదా ఎంటర్‌టైన్ చేస్తున్నా. నేను కష్టపడి తెలుగు వాళ్లనే కదా ఎంటర్‌టైన్ చేస్తున్నది. కష్టపడి తెలుగు భాష నేర్చుకున్నది మాకోసం కాదు.. మీకోసం.. తెలుగు వాళ్లని ఎంటర్‌టైన్ చేయడం కోసమే కాబట్టి మమ్మల్ని వేరు చేసి చూడొద్దు. బ్యాచ్‌లు అని పేరు చెప్పి.. విడగొట్టొద్దు. భాష గొడవలు ఎందుకు వస్తున్నాయ్.. అంతా కలిసి ఉందాం. నేను ఇంట్లో కన్నడ మాట్లాడితే మీకెందుకు. మీ తెలుగులోనే మాట్లాడుతున్నా కదా. ఇలాంటి రియాలిటీ షోలో ఇలాంటివి ఎందుకు తీసుకుని వస్తున్నారంటూ ప్రేరణ చెప్పుకొచ్చింది.
Also Read