
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం2(Karthika Deepam2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-622 లో.. దీప బయటకు వెళ్తుంటే అప్పుడే డాక్టర్ వస్తుంది. ఏంటి ఎక్కడికి వెళ్తున్నావని అడుగగా అర్జెంట్ గా బయటకు వెళ్ళాలి.. శౌర్యని ఎవరో కిడ్నాప్ చేశారని అంటుంది. లేదు నువ్వు ఇక్కడే ఉండాలని డాక్టర్ చెప్తుంది. ఎందుకు ఉండాలని పారిజాతం ఎంట్రీ ఇస్తుంది. దాంతో డాక్టర్ ఏదో ఒకటి చేసి కవర్ చేస్తుంది. ఇక దీపని తన రూమ్ లోపలికి వెళ్ళమంటుంది. మరోవైపు శౌర్య కోసం కార్తీక్ వెతుకుతుంటాడు. అప్పుడే దీప కాల్ చేసి శౌర్య దొరికిందా అంటుంది. నేను నా కూతురిని కాపాడుకుంటా.. నువ్వు మీ అమ్మని కాపాడుకోమని కార్తీక్ అంటాడు.
దశరథ్ గుడిలో యాగం చేస్తుంటాడు. ఇక కార్తీక్ కి దాస్ కాల్ చేసి.. అల్లుడు శౌర్య ఎక్కడ ఉందో నాకు తెలుసు.. లొకేషన్ ని పండిస్తున్నాను వచ్చెయ్ అని అనగానే కార్తీక్ వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక దాస్ నిజం చెప్తాడు. నేను ఎంత చెప్పినా వినకుండా జ్యోత్స్న కోపంగా వెళ్ళింది అందుకే నేను మీ ఇంటి మీద ఓ కన్నేసి ఉంచాను. శౌర్య రెడీ అయి స్కూల్ కి వెళ్ళడానికి బయటకి వచ్చినప్పుడు ముగ్గురు రౌడీలు కిడ్నాప్ చేసి ఈ ఇంటికి తీసుకొచ్చారని కార్తీక్ కి దాస్ జరిగింది మొత్తం చెప్తాడు. ఇక కార్తీక్ రౌడీలని కొట్టి శౌర్యని తీసుకెళ్తాడు. శౌర్యని శ్రీధర్ కి అప్పగించి కార్తీక్ హాస్పిటల్ కి వెళతాడు.
మరోవైపు పారిజాతం దగ్గరికి జ్యోత్స్న వచ్చి.. దీప ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే కాపలాగా ఉండమని చెప్తుంది. కాసేపటికి ఆపరేషన్ రూమ్ లో ఉన్న జ్యోత్స్నకి మత్తు ఇంజెక్షన్ వేస్తుంది డాక్టర్. ఇక కార్తీక్ హాస్పిటల్ కి వస్తాడు. ఇక్కడేం చేస్తున్నావ్ పారు అనగా.. కాపలాగా ఉన్నానని అంటుంది. మీ అందరి టైమ్ దగ్గర పడిందని పారిజాతంతో కార్తీక్ చెప్పేసి దీప దగ్గరికి వెళతాడు. శౌర్య సేఫ్ గా ఉంది.. నాన్నకి అప్పగించానని కార్తీక్ అనగానే దీప నార్మల్ అవుతుంది. ఇక అప్పుడే డాక్టర్ వచ్చి.. కార్తీక్ ఎక్కడికి వెళ్ళావ్.. ఓ వైపు ఆపరేషన్ థియేటర్ లో జ్యోత్స్న ఉంది.. దీప గది బయట పారిజాతం ఉంది.. హాల్లో నారాయణ ఉన్నాడు.. వీళ్ళందరిని దాటుకొని నేను ఎలా దీపకి ఆపరేషన్ చేయాలని డాక్టర్ అనగానే నేను చూసుకుంటానని కార్తీక్ అంటాడు. వీళ్ళంతా ఏం మాట్లాడుకుంటున్నారని బయట ఉన్న పారిజాతం అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






