
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-423 లో .. ఇకనుండి అయినా మంచిగా ఉండండి అని పెద్దవాళ్ళు అయిన అత్తయ్య మామయ్య చెప్తున్నారని శ్రీవల్లి అనగానే వదిలేయమ్మా వల్లి కొన్ని విషయాలు కొందరికి అర్థం కావు అని రామరాజు అంటాడు. నిన్నటి వరకు తీపి అనుకున్నవి ఇప్పుడు చేదు అయినవి అని వేదవతి అనేసి వెళ్లిపోతుంది. దాంతో నర్మద, ప్రేమ బాధతో వెళ్ళిపోతారు. ఆ తర్వాత ప్రేమని నర్మద ఓదారుస్తుంది.
భద్రవతి ఫ్యామిలీ ఉగాది పండుగ హ్యాపీగా జరుపుకుంటారు. విశ్వ గాయాలతో ఇంటికి వస్తాడు. విశ్వని చూసి ఏమైందని భద్రవతి అడుగుతుంది. రామారాజు కొట్టాడని విశ్వ చెప్పగానే భద్రవతి కోపంగా .. రామారాజు అనుకుంటూ వస్తుంది. ఇక రామారాజు ఫ్యామిలీ వస్తుంది. ఏంటి అరుచుకుంటు వచ్చారని రామారాజు అడుగగా.. నా మేనల్లుడిని ఇంత దారుణంగా కొడతావా నువ్వు మనిషివా లేక మృగానివా అని భద్రవతి అంటుంది. నేను మనిషిని కాబట్టే వాడు ఇంకా ప్రాణాలతో ఉన్నాడని రామరాజు అంటాడు. రేయ్ తిరుపతి ఏమైంది రా అని వేదవతి అనగానే అతను రాత్రి జరిగిందంతా చెప్తాడు. రేయ్ సేనా.. పోలీసులకి ఫోన్ చెయ్ రా .. వీడి మీద పడిన ప్రతీ దెబ్బకి రామరాజు గాడి మీద పది దెబ్బలు తగలాలని భద్రవతి అనగానే అప్పుడే పోలీసులు వస్తారు. నా మేనల్లుడిని ఈ రామరాజు గాడు కొట్టాడు వాడిని అరెస్ట్ చేయండి సర్ భద్రవతి అనగానే మాకు అన్నీ తెలుసు.. అమూల్యని కిడ్నాప్ చేసి, చంపడానికి ప్రయత్నిస్తూ చిత్రహింసలు పెట్టినట్టు ఐపీసీ సెక్షన్ 364, 365 ప్రకారం ఎఫ్ఐఆర్ ఫైల్ చేశామని ఇన్‌స్పెక్టర్ చెప్పగానే భద్రవతి, సేనాపతి, రేవతి షాక్ అవుతారు. అప్పుడే ధీరజ్ , ప్రేమ ఇద్దరు బైక్ పైన వస్తారు. ఇన్ స్పెక్టర్ వీడిని తీసుకొని వెళ్ళండి అని ధీరజ్ అనగానే.. హే అమూల్య నా మీద కేసు పెడతావా నిన్ను వదలనే అని విశ్వ అంటాడు. వేదవతి వచ్చి చెంపచెల్లుమనిపిస్తుంది. దాంతో భద్రవతి.. హే వేదవతి అని కోపంగా అనగానే హే భద్రవతి అని ఎదురుతిరుగుతుంది వేదవతి. అక్కడితో ఆగు.. నా కూతురి జోలికి వస్తే అక్క వి అని కూడా చూడను అని వేదవతి వార్నింగ్ ఇస్తుంది. ఇక సేనాపతి, భద్రవతి ఇద్దరు వెళ్ళిపోతారు.
విశ్వని స్టేషన్ లోకి తీసుకొని వెళ్ళి లాకప్ లో పడేస్తాడు. ఇక భద్రవతి, సేనాపతి ఇద్దరు స్టేషన్ కి వెళ్ళి ఇన్ స్పెక్టర్ తో మాట్లాడినా ప్రయోజనం ఉండదు. ఆ తర్వాత తమ తరుపు లాయర్ వచ్చి మాట్లాడతాడు కానీ ఇన్ స్పెక్టర్ గట్టిగా మాట్లాడతాడు. దాంతో లాయర్ కూడా ఏం చేయలేకపోతాడు. ఏమైందని భద్రవతి అడుగగా అమ్మాయిని కిడ్నాప్ చేశాడని కేసు బలంగా ఉందని , మనకి ఒకటే దారి ఉంది. ఆ రామరాజుతో రాజీ అని లాయర్ అనగానే ఆ పనివాడితో రాజీపడటమా అది ఎప్పటికీ జరుగదని భద్రవతి అంటుంది. మరోవైపు ఏంట్రా చిన్నోడా.. ఇంటి ఆడపిల్లని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళావ్.. నలుగురు చూస్తే ఏమనుకుంటారని వేదవతి అనగానే నా చెల్లెలిని కిడ్నాప్ చేసి, తన జీవితం నాశనం చేయాలని చూసిన వాడిని వదిలేయాలా అని ధీరజ్ అంటాడు. వాడు చేసింది వందకి వంద శాతం కరెక్ట్ అని రామరాజు అంటాడు. కరెక్ట్ కాదని ఎంట్రీ వేదవతి వాళ్ళ చిన్నమ్మ వస్తుంది. ఎందుకు కరెక్ట్ కాదని రామరాజు కొడుకులు అడుగగా గొడవని పెద్దగా చేసుకోవడం ఎందుకు అని ఆ పెద్దావిడ అనగానే అందరు ఆలోచనలో పడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.





