Home

»

Tv News

Jayam serial: వీరు అసలు గుట్టు పట్టేసిన రుద్ర.. ఇషికకు చుక్కలు చూపిస్తున్న గంగ!

Mar 20, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -221 లో..... పెద్దసారు దగ్గరికి రుద్ర వెళ్లి వీరు మీకు ఎలా పరిచయం అయ్యాడని అడుగుతాడు. మనం ఆఫీస్ ఎక్స్ టెన్షన్ చేస్తున్నాడు. పిఏ అవసరం ఉండే వీరుని మన క్లర్క్ నారాయణ తీసుకొని వచ్చాడని పెద్దసారు చెప్తాడు. ఎందుకు అలా అడుగుతున్నావని పెద్దసారు అడుగుతాడు. వీరుకి బిజినెస్ గురించి తెలియడం లేదని ప్రీతీ అంది.. అతను ఏ బేస్ నుండి వచ్చాడో తెలిస్తే బాగుంటుందని అడిగానని రుద్ర చెప్తాడు.

ఆ తర్వాత పైడిరాజు అడ్రెస్ పట్టుకొని గంగ అసలైన పేరెంట్స్ గురించి వెతుకుతారు. అక్కడ ఒకతను వాళ్ళు లేరు.. వాళ్ళ ఒకగానొక అమ్మాయి తప్పిపోయిందని ఊరు వదిలి వెళ్లారని చెప్తాడు. దాంతో ఆ విషయం లక్ష్మికి పైడిరాజు చెప్తాడు. దాంతో చేసిన తప్పుకి ప్రయాశ్చితం చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని లక్ష్మీ బాధపడుతుంది. ఆ తర్వాత నారాయణ దగ్గరికి రుద్ర వెళ్తాడు. వీరు ఎలాంటి వాడు మీకెలా పరిచయమని అడుగుతాడు. తనకి ఎవరు లేరు.. నా ఇంట్లో అద్దెకి ఉండేవాడు.. ఎప్పుడు మీ పెద్దనాన్న దగ్గరే వర్క్ కావాలనే వాడు అని నారాయణ చెప్తాడు. ఎందుకు మా పెద్దనాన్న దగ్గర వర్క్ కావాలని అడిగేవాడు అని రుద్ర అనగానే ఏం సర్ ఎప్పుడు అడిగినా చెప్పలేదని నారాయణ చెప్తాడు. తన వస్తువులు తీసుకొని వెళ్ళడానికి కూడా వీరు ఇక్కడికి రాలేదని నారాయణ చెప్తాడు. అతని వస్తువులు చూస్తానని రుద్ర అనగానే నారాయణ తీసుకొని వెళ్తాడు. అందులో ఒక ఫోటో చూస్తాడు. అది ఎవరు అని రుద్ర అడుగుతాడు. ఏమో సర్ ఎప్పుడు ఈ ఫోటో పట్టుకొని ఒక్కసారి ఏడుస్తాడు.. ఒకసారి కోపంగా ఉంటాడని నారాయణ చెప్తాడు.

మరొకవైపు గంగ, రంగా కలిసి మళ్ళీ ఇందుమతిని రెచ్చగొట్టి ఇషిక చేత పని చేయించేలా చేస్తారు. ఇందుమతి స్వీట్ తీసుకొని రమ్మని చెప్పగానే తీసుకొని వస్తుంది. ఆ తర్వాత జ్యూస్ తీసుకొని వస్తుంది. ఆ తర్వాత ఇషిక కోపంగా ఉంటుంది. అప్పుడే వీరు వచ్చి మీ అత్తయ్య దగ్గర ఇన్ఫర్మేషన్‌ సేకరించావా అని అడుగుతాడు. నీకు ఇంత స్వార్థం ఏంటి బ్రో అసలు నా గురించి పట్టించుకోవా అని ఇషిక అంటుంది. అప్పుడే రుద్ర వస్తాడు. నారాయణని కలిసానని చెప్పగానే వీరు షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com