Home

»

Tv News

Podharillu: గాయత్రి పెళ్లి టెన్షన్ లో మాధవ.. కేశవ చేతిలో శైలుకి పరాభవం!

Mar 20, 2026

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -74 లో.... శైలు ఇంకా తన ఫ్రెండ్ కలిసి వెళ్తుంటే స్కూటీ ప్రాబ్లమ్ వస్తుంది. దాంతో వాళ్ళు మెకానిక్ కేశవ దగ్గరికి వెళ్తారు. కేశవ వాళ్ళకి కన్పించకుండా మాట్లాడతాడు. ఈ రోజు ఎలాగైనా ఆ ముంగీస కేశవ గాడిని కూల్ చేసి నా ఫోన్ తీసుకోవాలని శైలు తన ఫ్రెండ్ తో మాట్లాడడం కేశవ వింటాడు. శైలు పక్కకి వెళ్లి కేశవకి ఫోన్ చేసి మీతో గొడవ పెట్టుకున్నందుకు సారీ మీ డబ్బు ఇచ్చి ఫోన్ తీసుకొని వెళదామనుకుంటున్నా మీరు నేను చెప్పిన అడ్రెస్ కి రండి అని కేశవకి శైలు చెప్తుంది.

అదంతా యాక్టింగ్ అని కేశవకి అర్థం అయి తన ప్లాన్ తిప్పి కొట్టాలని అనుకుంటాడు. ఆ తర్వాత కన్నా, మహా గుడికి వస్తారు. అక్కడకు గాయత్రి వస్తుంది. వెళ్ళిపోదామా వదిన అని మహాతో కన్నా అనగానే ఏంట్రా నేను రాగానే అలా అంటున్నావ్..నేను  ఏమైనా మిమ్మల్ని పోలీసులు పట్టుకొని వెళ్ళేలా చేసానా.. నన్ను మీరు ఎవరు అర్థం చేసుకోరు.. ఒక మాధవ బావ మాత్రమే అర్థం చేసుకుంటాడని గాయత్రి బాధగా వెళ్తుంది. ఆ తర్వాత శైలు, కేశవ ఒక రెస్టారెంట్ లో కలుస్తారు. కేశవని మాటల్లో పెట్టి ఫోన్ కొట్టేయ్యాలని ట్రై చేస్తుంది శైలు. కానీ కేశవ జాగ్రత్త పడతాడు. అలా కేశవని జ్యూస్ కి పంపించి ఫోన్ తన బ్యాగ్ లో వేసుకుంటుంది శైలు. అది గమనించిన కేశవ జ్యూస్ తనపై పడేలా చేసి అది క్లీన్ చేసుకోవడానికి పంపిస్తాడు. శైలు వచ్చేలోపు ఫోన్ తీసుకొని కేశవ జంప్ అవుతాడు.

శైలు వచ్చి షాక్ అవుతుంది. బిల్ కూడా తనే కడుతుంది. మరొకవైపు మాధవ తలనొప్పిగా ఉందంటూ ముందు వస్తాడు. అప్పుడే కన్నా ట్యాబ్లెట్ తీసుకొని వస్తాడు. మహా వెళ్లి టీ పెట్టుకొని వస్తుంది. ఎందుకు అమ్మ నేను తెచ్చుకునే వాడిని కదా అని మాధవ అంటాడు. గాయత్రికి పెళ్లి ఫిక్స్ అయినప్పటి నుండి అదే ఆలోచిస్తున్నావు కదా అని మాధవతో కన్నా అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com