Jayam serial : నిజం తెలుసుకున్న ప్రీతీ.. ఆ పట్టీలు చూసి గంగ షాక్!
on Nov 10, 2025

ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -109 లో......రుద్ర, పారు పెళ్లి చేసుకోబోతున్నారన్న విషయం తెలిసి.. గంగ షాక్ అవుతుంది. రుద్రతో ఉన్న జ్ఞాపకాలన్నీ గుర్తుచేసుకుంటుంది. మరొకవైపు మన ప్లాన్ సక్సెస్ అయిందని ఇషిక, వీరు మాట్లాడుకుంటారు. అసలు ఈ ఐడియా శకుంతల అత్తయ్యకి ఇచ్చి మంచి పని చేసామని ఇషిక అంటుంది. వెనకాల నుండి ప్రీతి వచ్చి మీరు ఐడియా ఇచ్చారా ఎందుకు ఇలా చేశారని వాళ్ళపై కోప్పడుతుంది.
అది కాదు ప్రీతీ అని ఇషిక చెప్పబోతుంటే వద్దు అని ప్రీతీ అంటుంది. అప్పుడే శకుంతల ఎంట్రీ ఇచ్చి ఎవరేం చెప్పలేదు.. ఇదంతా నా నిర్ణయమే.. అయినా రుద్ర ఒప్పుకున్నాక నీకెందుకు ప్రాబ్లమ్ అని ప్రీతిపై శకుంతల కోప్పడుతుంది. ఆ తర్వాత గంగ ప్రాక్టీస్ చేస్తుంటే పారు వస్తుంది. ఇవన్నీ నీకేందుకూ అని డిస్సపాయింట్ గా మాట్లాడుతుంది. దాంతో తనకి కౌంటర్ ఇచ్చేలా గంగ మాట్లాడుతుంది. గంగకి రుద్ర గిఫ్ట్ ఇచ్చిన పట్టీలు పారు పెట్టుకుంటుంది. అది చూసి గంగ షాక్ అవుతుంది. పట్టీలు బాగున్నాయా గంగా అని పారు అడుగుతుంది.
అప్పుడే రుద్ర ఎంట్రీ ఇస్తాడు. ఏంటి గంగ ప్రాక్టీస్ చెయ్యడం లేదని అడుగుతాడు. నా పట్టీలు బాగున్నాయట చూస్తుందని పారు అంటుంది. ఆ పట్టీలు నువ్వు ఎందుకు పెట్టుకున్నావని రుద్ర అనగానే.. నీ వస్తువు అయితే నాదే కదా.. అయినా నా కోసమే కొని ఉంటావ్.. నువ్వు ఎవరి కోసమో అంటే నేను హర్ట్ అవుతానని రుద్ర చెయ్ పారు పట్టుకుంటుంది. ఇది అకాడమీ అని రుద్ర అంటాడు. గంగ కోపంగా అక్కడ నుండి వెళ్లిపోతుంది. తన వెనకాలే రుద్ర వెళ్తాడు. నాకు గిఫ్ట్ ఇచ్చినవి తాను ఎందుకు తీసుకుందని గంగ అడుగుతుంది. నువ్వు వద్దని ఇచ్చావ్ కదా.. ఎవరు తీసుకుంటే ఏంటి.. నువ్వు గేమ్ పై పోకస్ పెట్టు పోటీకి సంబందించిన డేట్ వచ్చింది. నిన్ను నమ్మాను.. నువ్వు ఆ నమ్మకం నిలబెట్టు అని గంగతో రుద్ర చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



