Illu illalu pillalu : నర్మద కేసులో ట్విస్ట్.. సేనాపతి దొరికిపోయాడు!
on Nov 10, 2025
.webp)
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -312 లో.....ధీరజ్ ప్రేమపై కోప్పడతాడు. మా పుట్టింటికి వెళ్ళిపోతానని ప్రేమ అనగానే వెళ్ళు ఎవరిని బ్లాక్ మెయిల్ చేస్తున్నావని ధీరజ్ అంటాడు. దాంతో ప్రేమ నిజంగానే వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది. ఈ మెంటల్ ది నిజంగానే వెళ్ళింది.. ఇప్పుడు ఎంత గొడవ అవుతుందోనని ధీరజ్ బయపడి ప్రేమకి ఫోన్ చేస్తాడు.
నువ్వు నాకు సారీ చెప్తేనే నేను వస్తానని ప్రేమ అంటుంది. దాంతో ధీరజ్ సారీ చెప్తాడు. ప్రేమ బయటకు వస్తుంది. నువ్వు మళ్ళీ ఏమైనా అంటే మా ఇంటికి వెళ్తానని ప్రేమ బ్లాక్ మెయిల్ చేస్తుంది. టార్చర్ కి స్పెల్లింగ్ రాపిస్తున్నావు కదే అని ధీరజ్ అనుకుంటాడు. అదంతా భాగ్యం, ఆనందరావు చూసి వాళ్ళు దాగుడుమూతలు ఆడుకుంటున్నారు.. మనమే పిచ్చి వాళ్ళలాగా నిద్ర మానుకొని చూస్తున్నామని భాగ్యం అంటుంది. మరొకవైపు టీవీలో నర్మద లంచం తీసుకుందంటూ న్యూస్ వస్తుంది. అది చూస్తూ భద్రవతి, సేనాపతి హ్యాపీగా ఫీల్ అవుతుంటే.మ మరొకవైపు వేదవతి కుటుంబం డల్ గా ఉంటుంది. ఆ తర్వాత రామరాజు ఆస్తులు కొట్టెయ్యాలి.. అలా చెయ్యాలంటే ఆ నర్మద జైల్లో ఉండాలి.. మనం ఇక్కడే ఉండాలని భాగ్యం, ఆనందరావు ప్లాన్ వేస్తారు.
ఆ తర్వాత నర్మద లంచం తీసుకున్నట్లు అన్ని ఆధారాలపై అధికారులు నర్మద ముందు పెడుతారు . నేను తీసుకోలేదు అతనికి అంత డబ్బు ఎక్కడ నుండి వచ్చింది.. అతని బ్యాంకు స్టేట్ మెంట్ చూడండి.. అందులో సేనాపతి అతనికి ట్రాన్స్‌ఫర్ చేసినట్లు ఉందని నర్మద చూపిస్తుంది. వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చానని నన్ను కావాలనే ఈ కేసు లో ఇరికించారని నర్మద తగిన సాక్ష్యం చూపిస్తుంది. దాంతో అధికారులు నర్మద నిర్దోషి అని పంపిస్తారు. ఆ విషయం న్యూస్ లో రావడంతో భద్రవతి షాక్ అవుతుంది. ఇటు వేదవతి కుటుంబం హ్యాపీగా ఫీల్ అవుతుంది. తరువాయి భాగంలో సేనాపతిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తుంటే.. నర్మద వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



