Karthika Deepam2 : దీపే సీఈఓ.. కార్తీక్ మాటతో పారిజాతం, జ్యోత్స్న షాక్!
on Nov 10, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -511 లో.....దీప ఆఫీస్ కి క్యారేజ్ తీసుకొని వెళ్తుంది. వెనకాలే పారిజాతం, సుమిత్ర వస్తారు. మీరెందుకు వచ్చారని శివన్నారాయణ అడుగుతాడు. రావాల్సి వచ్చిందని సుమిత్ర అంటుంది. మీతో మాట్లాడాలని శివన్నారాయణతో పారిజాతం అంటుంది. దాంతో శివన్నారాయణ పక్కకి వస్తాడు.
సీఈఓగా ఎవరిని చేస్తున్నారని పారిజాతం అడుగుతుంది.. ఎవరు అయితే నీకెందుకని శివన్నారాయణ అంటాడు. ఆ దీపనే కదా అని పారిజాతం అంటుంది. మనవరాలిని కాదని పని మనిషిని చేస్తున్నారని పారిజాతం అంటుంది. అప్పుడే కార్తీక్ ఎంట్రీ ఇచ్చి దీప సీఈఓ ఏంటి.. ఎవరు చెప్పారని కార్తీక్ అంటాడు. నాకు దీప సీఈఓ అన్న ఆలోచన రాలేదు.. ఇప్పుడు నువ్వు చెప్పావ్ ఖచ్చితంగా దీపని సీఈఓ చేస్తానని శివన్నారాయణ అనగానే పారిజాతం, జ్యోత్స్న షాక్ అవుతారు. శివన్నారాయణ వాళ్ళు అక్కడ నుండి వెళ్ళపోతారు. పారిజాతం కత్తి చూపించి ఆ దీప సీఈఓగా ఒప్పుకోవాలి వెంటనే దీంతో పొడుస్తానని పారిజాతం అనగానే.. నిజంగానే చంపేస్తావా అని జ్యోత్స్న అంటుంది.
అది సీఈఓ అయితే నీ పరిస్థితి ఏంటో నాకు తెలుసు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని పారిజాతం అంటుంది. ఆ తర్వాత అందరు కలిసి భోజనం చేస్తారు. జ్యోత్స్న దగ్గరికి సుమిత్ర వచ్చి ఇక్కడ అందరికి తోడున్నారు.. నీకు తప్ప.. నీకు ఒక జోడి కావాలి.. అదే నా కోరిక అని సుమిత్ర అంటుంది. నేను అనుకున్నది సాధించాలని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత బోర్డు మీటింగ్ జరుగుతుంది. సుమిత్ర మాట్లాడుతు.. మావయ్య గారు ఏ నిర్ణయం తీసుకున్నా అది సరైనదేనని అంటుంది. ఇది కూడా హ్యాండ్ ఇచ్చిందని పారిజాతం అనుకుటుంది. కొత్త సీఈఓగా మా భార్యని సజెస్ట్ చేస్తున్నా అని కార్తీక్ అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



